ETV Bharat / technology

శాంసంగ్ ఫోన్​ యూజర్లకు గుడ్ న్యూస్​ - ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్​మెంట్​ - మరో 8 రోజులే ఛాన్స్​! - Samsung Offers - SAMSUNG OFFERS

Samsung Offers Free Screen Replacement : శాంసంగ్​ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్​. గ్రీన్​ లైన్ సమస్య ఉన్న గెలాక్సీ ఫోన్​ యూజర్లకు శాంసంగ్ కంపెనీ పూర్తి ఉచితంగా డిస్​ప్లే రీప్లేస్​మెంట్ చేయనున్నట్లు ప్రకటించిది. ఈ ఆఫర్​ ఏప్రిల్​ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

Samsung Offers Free Screen Replacement
Samsung Galaxy phone
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 12:45 PM IST

Samsung Offers Free Screen Replacement : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్​ కంపెనీ శాంసంగ్​ తమ గెలాక్సీ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్​ లైన్​ సమస్య ఎదుర్కొంటున్న ఫోన్లకు పూర్తి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్​మెంట్​ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇది వన్​-టైమ్ ఆఫర్ మాత్రమే అని స్పష్టం చేసింది.

వీటికి మాత్రమే!
వాస్తవానికి శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్​షిప్​ ఫోన్లలో చాలా సార్లు గ్రీన్ లైన్ ఇష్యూ కనిపించింది. ఇటీవల విడుదలైన గెలాక్సీ ఎస్​21 సిరీస్​ ఫోన్లలోనూ ఇదే సమస్య రిపీట్ అయ్యింది. దీనితో యూజర్ల నుంచి శాంసంగ్ కంపెనీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. దీనితో పూర్తి ఉచితంగా డిస్​ప్లే రీప్లేస్​మెంట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ఫ్రీ ఆఫర్​ అన్ని శాంసంగ్ ఫోన్లకు వర్తించదని స్పష్టం చేసింది.

గ్రీన్ లైన్​ సమస్య ఎదుర్కొంటున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్​20, గెలాక్సీ ఎస్​21, గెల్సాకీ నోట్​ 20, గెలాక్సీ 22 ఫ్లాగ్​షిప్​ ఫోన్లకు మాత్రమే ఉచితంగా డిస్​ప్లే రీప్లేస్​మెంట్ చేస్తారు. అది కూడా గత మూడేళ్లలోపు గెలాక్సీ ఫోన్లు కొన్నవారికి మాత్రమే ఈ ఫ్రీ ఆఫర్​ అందిస్తారు.

వారెంటీ అవసరం లేదు!
శాంసంగ్​ అందిస్తున్న ఈ ఆఫర్​ పొందడానికి వారెంటీ అవసరం లేదు. అంటే ఫోన్​ వారెంటీ డేట్ పూర్తయిన వాళ్లు కూడా పూర్తి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్​మెంట్ చేయించుకోవచ్చు.

ఏప్రిల్ 30లోపు మాత్రమే!
ఈ ఫ్రీ ఆఫర్​ ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని శాంసంగ్ స్పష్టం చేసింది. కనుక యూజర్లు ఈ గడువులోగా తమకు సమీపంలో ఉన్న శాంసంగ్ సర్వీస్​ సెంటర్​కు వెళ్లి అపాయింట్​మెంట్ బుక్ చేసుకోవాలి.

ఫ్రీ బ్యాటరీ రీప్లేస్​మెంట్ కూడా
శాంసంగ్ కంపెనీ తమ యూజర్లకు మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఉచితంగా స్క్రీన్ మార్చడమే కాకుండా, ఫ్రీగా బ్యాటరీ రీప్లేస్​మెంట్​ కూడా చేయనున్నట్లు స్పష్టం చేసింది.

వారికి మాత్రం నో ఛాన్స్!
శాంసంగ్ కంపెనీ కేవలం ఫ్లాగ్​షిప్ గెలాక్సీ ఫోన్లకు మాత్రమే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్​మెంట్ చేస్తోంది. మరి ఇదే గ్రీన్​ లైన్ సమస్య ఎదుర్కొంటున్న మిగతా యూజర్ల సంగతేంటి? కంపెనీ వారికి కూడా ఇలాంటి అవకాశం కల్పిస్తుందా? లేదా? అనేది చూడాలి.

మీ ఫోన్ పోయిందా? డోంట్​ వర్రీ - ఇకపై మీరే దాన్ని బ్లాక్ చేయవచ్చు! - How To Block Stolen Phone

మంచి ఇయర్​ఫోన్స్ కొనాలా? రూ.1000 బడ్జెట్లోని టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Earphones

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.