LPG Gas Cylinder Safety Precautions: ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఇది ఎంత ఉపయోగకరమో ఆదమరిస్తే అంతే ప్రమాదం. గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సిలిండర్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సిలిండర్లను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ISI గుర్తు ఉన్న LPG గ్యాస్ సిలిండర్లను మాత్రమే ఉపయోగించాలి.
- గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో సిలిండర్ సీల్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
- సిలిండర్‌ను ఎప్పుడూ వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలోనే ఉంచాలి.
- మీకు సిలిండర్‌ను సరిగా అమర్చటం రాకుంటే సర్వీస్ మ్యాన్ లేదా డెలివరీ పర్సన్ సహాయం తీసుకుంటే మంచిది.
- సిలిండర్‌కు సమీపంలో పేలుడుకు కారణమయ్యే కిరోసిన్, పెట్రోల్ లాంటి ఫ్యూయల్స్ లేకుండా చూసుకోండి.
- గ్యాస్ సిలిండర్‌ను ఉంచే గదిలో గ్యాస్ డిటెక్టర్లను ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఎప్పుడైనా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఇది హెచ్చరిస్తుంది.
- వంట అయిపోయిన వెంటనే గ్యాస్ సరఫరాను ఆఫ్ చేయాలి. దీంతోపాటు బయటకు వెళ్తున్నప్పుడు, రాత్రి పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేశామో లేదో ఓసారి చెక్ చేసుకుంటే మంచిది.
- గ్యాస్ లీకేజీలను నివారించేందుకు ఎల్‌పిజి స్టవ్, కనెక్షన్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
- పిల్లలను ఎప్పుడూ వంటగదికి, ఎల్పీజీ సిలిండర్‌కు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
- ఒకవేళ ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ అయినట్లయితే కిటికీలను తెరచి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేయాలి. LPG సప్లయర్ లేదా ఎమర్జెన్సీ సర్వీసులను సంప్రదించాలి.
నో డెలివరీ ఛార్జీస్:
- ఇంటి వద్దకు డెలివరీ అయ్యే ఎల్పీజీ సిలిండర్లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని HPCL స్పష్టం చేసింది.
- ఫ్లోర్, అపార్ట్మెంట్స్.. ఇలా లొకేషన్స్‌తో సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది.
- ఒకవేళ డెలివరీ వ్యక్తి అదనపు ఛార్జీలు అడిగితే చెల్లించకుండా తిరస్కరించే అధికారం కస్టమర్లకు ఉంటుంది.
- ఈ సమస్యపై హైదరాబాద్‌కు చెందిన కరీం అన్సారీ అనే వ్యక్తి HPCLపై RTI పిటిషన్ దాఖలు చేశారు.
- దీనిపై HPCL స్పందిస్తూ వినియోగదారులు సిలిండర్ డెలివరీల కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ డెలివరీ బాయ్ అదనపు ఛార్జీలను అడిగితే తిరస్కరించే అధికారం కస్టమర్లకు ఉందని పేర్కొంది.
మహిళలూ జాగ్రత్త- ఇవి ఉంటే మీరు ఎక్కడికెళ్లినా సేఫ్! - Women Safety Gadgets