ETV Bharat / technology

రాయల్ ఎన్​ఫీల్డ్​ నుంచి మరో కొత్త బైక్- డిజైన్​ చూస్తే మతిపోతోందిగా..! - ROYAL ENFIELD BEAR 650

మార్కెట్లోకి డుగ్​ డుగ్​ బండి వచ్చేస్తోంది- రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Royal Enfield Bear 650
Royal Enfield Bear 650 (Royal Enfield)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 29, 2024, 3:19 PM IST

Updated : Oct 29, 2024, 3:32 PM IST

Royal Enfield Bear 650: రాయల్ ఎన్​ఫీల్డ్ ఎట్టకేలకూ తన బేర్ 650 బైక్​ రిలీజ్​పై క్లారిటీ ఇచ్చింది. దీన్ని EICMA 2024లో రిలీజ్ చేయనున్నారు. ఇది​.. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, సూపర్ మెటోర్ 650, షాట్‌గన్ 650 తర్వాత ట్విన్ ప్లాట్​ఫారమ్ ఆధారంగా కంపెనీ తీసుకొచ్చిన ఐదో 650cc మోటార్‌సైకిల్.

ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 స్క్రాంబ్లర్-బేస్డ్ డిజైన్‌తో వస్తుంది. కంపెనీ దీన్ని అనేక కొత్త ఫీచర్లు, ప్రీమియం మెకానికల్ పార్ట్స్​తో రూపొందించింది. నవంబర్ 5న జరగబోయే EICMA 2024లో రాయల్ ఎన్​ఫీల్డ్ ఈ బేర్ 650 ధరల వివరాలను వెల్లడించనుంది.

Royal Enfield Bear 650
Royal Enfield Bear 650 (Royal Enfield)

డిజైన్​: ఈ బైక్ పెయింట్ స్కీమ్, ఎగ్జాస్ట్ సిస్టమ్​తో కూడిన టైర్​లతో ఇంటర్‌సెప్టర్ 650 కంటే చాలా ఆకర్షణీయమైన కూల్ లుక్​లో ఉంటుంది. దీని స్క్రాంబ్లర్ స్టైల్ సీట్, సైడ్ ప్యానెల్స్‌పై ఉన్న నంబర్ బోర్డ్ గ్రేట్ ఫ్లేవర్​ని ఇస్తాయి. ఈ బైక్​లోని LED లైట్స్, వీల్​ సైజ్​ చాలా భిన్నంగా ఉంటాయి.

ఈ బైక్​లో స్పోక్​ వీల్స్​తో కూడిన MRF నైలోరెక్స్ ఆఫ్-రోడ్ టైర్‌లను అమర్చారు. ఏమైనప్పటికీ బైక్​ ట్యూబ్​ లెస్​ స్పోక్ వీల్స్​ మిస్సవుతుంది.​ షాట్​గన్​లో కనిపించే విధంగా ఇది షోవా USD ఫోర్క్‌లతో వస్తుంది. అయితే దీని ఇంటర్నల్ పార్ట్స్​ చాలా డిఫరెంట్​గా ఉంటాయి. మొత్తంమీద సస్పెన్షన్​ ట్రావెల్ ఇంటర్​సెప్టర్​ కంటే ఎక్కువగా ఉండటంతో సీటు ఎత్తు పెరిగింది.

Royal Enfield Bear 650
Royal Enfield Bear 650 (Royal Enfield)

ఈ బైక్ బ్రేక్స్​ ఇంటర్​సెప్టర్​ మాదిరిగా ఉంటాయి. అయితే ఫ్రంట్ బ్రేక్​ డిస్క్​ సైజ్​ పెద్దగా ఉంటుంది. ఇందులో డ్యూయల్- ఛానల్​ ABS స్టాండర్డ్‌గా ఉంది. ఈ బైక్ వెనక ABS ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం స్విచ్ ఆఫ్ చేయొచ్చు. ఈ స్క్రాంబ్లర్ ఇన్​బిల్డ్​ నావిగేషన్ సిస్టమ్​తో ఫుల్- కలర్ TFT స్క్రీన్‌ను కలిగి ఉంది.

ఇంజిన్: ఈ కొత్త బైక్ 650cc, ప్యార్లల్-ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 47bhp పవర్, 57Nm పీక్ టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఇది ఇంటర్‌సెప్టర్ 650 కంటే దాదాపు 5Nm ఎక్కువ. ఇది కొత్త టూ-ఇన్‌-టు ఎగ్జాస్ట్ సిస్టమ్​తో వస్తుంది. ఈ కారణంగా బైక్​ బరువు కొద్దిగా తగ్గుతుంది. దీని ఇంజిన్ మునుపటిలా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Royal Enfield Bear 650
Royal Enfield Bear 650 (Royal Enfield)

కంపెనీ ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650ని మొత్తం ఐదు కలర్ ఆప్షన్స్​తో తీసుకొస్తోంది. ఒక్కో కలర్​లో దీని ధర ఒక్కోవిధంగా ఉంటుంది. రాయల్ ఎన్​ఫీల్డ్ నవంబర్ 5న ఈ బైక్‌ను విడుదల చేయనుంది. అదే రోజున దీని ధరను కూడా వెల్లడించనుంది. మార్కెట్లో దీని బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు.

పవర్​ఫుల్ M4 చిప్​తో యాపిల్ iMac వచ్చేసింది- ధర ఎంతంటే?

ఈ పండక్కి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?- అయితే ఈ టాటా కర్వ్‌ ఈవీపై ఓ లుక్కేయండి..!

Last Updated : Oct 29, 2024, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.