ETV Bharat / technology

నేటి నుంచి అమల్లోకి పీఎం ఇ-డ్రైవ్‌ స్కీమ్- ఇకపై వాహన కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్స్! - PM E Drive Scheme - PM E DRIVE SCHEME

PM E-Drive Scheme: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్​న్యూస్. విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన పీఎం ఇ-డ్రైవ్‌ పథకం నేటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆయా వాహనాలు కొనుగోలుచేసే వారికి భారీగా తగ్గింపు లభించనుంది.

PM E-Drive Scheme
PM E-Drive Scheme (IANS)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 1, 2024, 10:21 AM IST

Updated : Oct 1, 2024, 10:32 AM IST

PM E-Drive Scheme: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి అదిరే గుడ్​న్యూస్ వచ్చింది. నేటి నుంచి పీఎం ఇ-డ్రైవ్‌ పథకం అమల్లోకి రానుంది. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఈవీ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దిల్లీలోని భారత్‌ మండపంలో మంగళవారం ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగనుంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రూ.10,900 కోట్లతో తీసుకొస్తున్న ఈ పథకం 2024 అక్టోబర్‌ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉండనుందని గెజిట్‌ నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది.

వివిధ రకాల వాహనాలకు రాయితీ:

  • పీఎం ఇ- డ్రైవ్‌ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు, త్రీ- వీలర్లు, ఇ- అంబులెన్సులు, ఇ-ట్రక్కులకు కేంద్రం రాయితీ ఇవ్వనుంది.
  • ఈ పథకం అమల్లో ఉండనున్న రెండేళ్ల కాలంలో బస్సులకు అత్యధికంగా రూ.4,391 కోట్లు చెల్లించనుండగా.. టూ- వీలర్లకు రూ.1772 కోట్లు వెచ్చించేందుకు కేంద్రం నిర్ణయించింది.
  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్‌ టూ- వీలర్‌, త్రీ- వీలర్‌ కేటగిరీకి కిలోవాట్‌కు రూ.5,000, ఆ మరుసటి ఏడాది రూ.2,500 చొప్పున చెల్లించనున్నారు.
  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్‌ టూ- వీలర్​కు గరిష్ఠంగా రూ.10వేలు, ఇ- రిక్షాకు రూ.25వేలు చొప్పున గరిష్ఠంగా చెల్లించనున్నారు.
  • ఆ మరుసటి ఏడాది 2025-26లో టూ- వీలర్‌కు రూ.5 వేలు, ఇ-రిక్షాలకు రూ.12,500 చొప్పున రాయితీ లభించనుంది.

రెండళ్ల పాటు పీఎం ఇ-డ్రైవ్‌:

  • 2015 ఏప్రిల్‌ 1న రూ.795 కోట్లతో.. ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంలో ఫేమ్‌-1 పథకాన్ని ప్రారంభించారు.
  • రెండేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంది.
  • తిరిగి మళ్లీ 2019 ఏప్రిల్‌ 1న రూ.11,500 కోట్లతో ఫేమ్‌-2 పథకాన్ని తీసుకొచ్చారు.
  • ఈ ఫేమ్‌-2 పథకం 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంది.
  • తర్వాత ఎలక్ట్రిక్‌ టూవీలర్‌, త్రీవీలర్లకు మద్దతు ఇచ్చేందుకు మధ్యలో ఎలక్ట్రిక్‌ మొబలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ 2024ను ప్రకటించారు.
  • రూ.778 కోట్లతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ మొబలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ సెప్టెంబర్‌తో 30తో ముగియనుంది.
  • ఈ క్రమంలో నేటి నుంచి దాదాపు రెండళ్ల పాటు పీఎం ఇ-డ్రైవ్‌ పథకం అమల్లో ఉండనుంది.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేంద్రం కొత్త స్కీమ్- రూ. 10,900 కోట్లు కేటాయింపు - PM E Drive Scheme

స్టన్నింగ్ టైగర్ లుక్స్​తో కొత్త రేంజ్ రోవర్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Range Rover SV New Edition

Last Updated : Oct 1, 2024, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.