Paytm International UPI Payment: పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్. పేటీఎం ఇంటర్నేషనల్ UPI పేమెంట్స్‌ను లాంచ్ చేసింది. దీంతో యూజర్స్ ఇప్పుడు విదేశాల్లో కూడా నగదు రహిత లావాదేవీలు చేయొచ్చు. ఈ మేరకు One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) కంపెనీ ఇప్పుడు విదేశాల్లోనూ పేటీఎం సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.
UPI రాకతో దేశంలో నగదు రహిత లావాదేవీలు సులభతం అయ్యాయి. ఎవరికైనా డబ్బు పంపించాలనుకుంటే ఈ సర్వీస్ సహాయంతో మొబైల్ ద్వారా ఈజీగా పంపించేస్తున్నారు. ఇలా ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్‌పైనే మొగ్గు చూపిస్తున్నారు. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. అయితే దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకోవడంలో పేటీఎం పాత్ర కూడా ఉంది.
ఈ క్రమంలో దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు తాజాగా OCL.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్‌తో పాటు ఎంపిక చేసిన దేశాల్లో పేటీఎం యూజర్ల కోసం ఇంటర్నేషనల్ UPI పేమెంట్ సర్సీసులను ప్రారంభించింది. One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) అనేది పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ.
Paytm UPI Goes Global!
— Paytm (@Paytm) November 19, 2024
🌍✈️ From pioneering mobile payments in India to taking Paytm UPI across the world! Shop at UAE malls, sip lattes in Paris, pick treasures in Singapore, and enjoy the beaches of Mauritius. Or maybe you’re hiking in Nepal? Paytm UPI is here to simplify… pic.twitter.com/fHbKW3jSAX
విదేశాల్లో పేటీఎం UPI పేమెంట్స్:
- OCL కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ సదుపాయంతో వినియోగదారులు ఇకపై పేటీఎం యాప్ ద్వారా UPIని ఉపయోగించి విదేశాల్లో చెల్లింపులు చేయొచ్చు.
- One97 కమ్యూనికేషన్స్ (OCL) అనేది ఇండియాలోని లీడింగ్ పేమెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.
"QR, సౌండ్‌బాక్స్ అండ్ మొబైల్ చెల్లింపుల అగ్రగామి Paytm బ్రాండ్‌లను కలిగి ఉన్న ఇండియాలోని ప్రముఖ పేమెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL), విదేశాలలో ఉన్న పేటీఎం వినియోగదారుల కోసం UPI పేమెంట్ సర్వీసులను ప్రారంభించింది." అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
UPI ద్వారా నగదు రహిత లావాదేవీలు: ఇండియన్ ట్రావెలర్స్ ఇప్పుడు వారి పేటీఎం యాప్‌ని ఉపయోగించి UPI ద్వారా ఇంటర్నేషనల్ నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు. పేటీఎం తీసుకొచ్చిన ఇంటర్నేషనల్ పేమెంట్స్ సర్వీస్ జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్ వంటి ప్రసిద్ధ గమ్యస్థానాలు ఉన్నాయి.
దీనిపై పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.. "త్వరలో రాబోయే హాలీడేస్‌ను దృష్టిలో ఉంచుకుని మేము ఈ సేవలను తీసుకొచ్చాం. ఇది వినియోగదారులకు ఇప్పుడు విదేశీ ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా చేస్తుందని మేము విశ్వసిస్తున్నాం. మా యూజర్స్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ పేటీఎం సర్వీసుల బెనిఫిట్స్‌ను పొందగలుగుతారు" అని అన్నారు.
ఒప్పోనా మజాకా- కిర్రాక్ ఫీచర్లతో 'ఫైండ్ X8' సిరీస్- ధర ఎంతో తెలిస్తే గుండె గుభేలే..!
'అంతర్గతంగా వివాదాస్పద విధానాలు పాటించిన గూగుల్- మెసేజ్‌లను మాయం చేయడమే వ్యూహం'