ETV Bharat / technology

మరో 3 రోజుల్లో వన్​ప్లస్ వాచ్​ 2 లాంఛ్​ - కేవలం రూ.99కే బుకింగ్!​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 5:23 PM IST

OnePlus Watch 2 Launch Date : ప్రముఖ ఎలక్ట్రానిక్​ తయారీ సంస్థ వన్​ప్లస్​ మరో సరికొత్త స్మార్ట్​వాచ్​ను​ భారత విపణిలో లాంఛ్​ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వన్​ప్లస్​ స్మార్ట్​వాచ్​-2 పేరుతో దీనిని తీసుకువస్తోంది కంపెనీ. మరి దీని స్పెక్స్​, ఫీచర్స్​, ధర తదితర వివరాల గురించి తెలుసుకుందామా?

OnePlus Watch 2 Launch Date
OnePlus Watch 2 Launch Date

OnePlus Watch 2 Launch Date : ఇండియన్​ మార్కెట్​లో వన్​ప్లస్​కు ఉన్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రముఖ ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ​ నుంచి విపణిలోకి ఏ ప్రొడక్ట్ వచ్చినా హాట్​కేకుల్లా అమ్ముడుపోతుంటాయి​. అంతలా క్రేజ్​ ఉంది వన్​ప్లస్​ బ్రాండ్​కు. ఈ నేపథ్యంలో ఈ సంస్థ నుంచి మరో మూడు రోజుల్లో ఓ సరికొత్త ప్రొడక్ట్​ రానుంది. అదే వన్​ప్లస్​ స్మార్ట్​వాచ్​-2. దీని ఫీచర్స్, స్పెక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

OnePlus Watch 2 Features :

  • బ్రాండ్​- వన్​ప్లస్​
  • వాచ్​ స్క్రీన్​- 1.43 అంగుళాలు
  • డిస్​ప్లే సైజ్​- 46mm
  • డిస్​ప్లే మెటీరియల్​- సఫైర్​ క్రిస్టల్​ AMOLED డిస్‌ప్లే
  • ప్రాసెసర్​- Qualcomm Snapdragon W5 Gen 1 చిప్​సెట్​
  • బ్యాటరీ లైఫ్​- 100 గంటలు (ఒక్క ఛార్జ్​తో)
  • కలర్స్​- రేడియంట్​ స్టీల్, బ్లాక్​ స్టీల్
  • బ్యాటరీ సామర్థ్యం- 402mAh
  • వాటర్​ రెసిస్టెంట్​- IP68 రేటింగ్​
  • ఓఎస్​- Google WearOS 4.0
  • ధర- రూ.16,999 (అంచనా మాత్రమే)
  • లాంఛ్​ అంచనా తేదీ- 2024 ఫిబ్రవరి 26

కనెక్టివిటీ ఆప్షన్స్​
5.0 బ్లూటూత్​ వెర్షన్​, జీపీఎస్​, GLONASS, గెలీలియో. వన్‌ప్లస్​ 12 నుంచి ప్రేరణ పొంది రెండు వేరియెంట్స్​తో రానున్న ఈ వన్​ప్లస్​ స్మార్ట్​వాచ్​-2 సిలికాన్​ బెల్టుతో, స్టెయిన్‌లెస్​ స్టీల్ కేసులను కలిగి ఉండనుంది. కాగా, ఇప్పటికే 2021లో వన్​ప్లస్​ నుంచి స్మార్ట్​వాచ్​-1 రిలీజ్​ కాగా, దానికి మంచి ఆదరణ లభించింది.

ప్రీ బుకింగ్స్
OnePlus తీసుకురానున్న ఈ వన్​ప్లస్​ స్మార్ట్​వాచ్​-2కు సంబంధించి ప్రీ-బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. కేవలం రూ.99లను చెల్లించి సంస్థ అధికారిక వెబ్​సైట్​లో ఈ​ ప్రొడక్ట్​ను బుక్​ చేసుకోవచ్చు. OnePlus స్టోర్స్​ల నుంచి మాత్రమే కాకుండా అమెజాన్​, ఫ్లిప్‌కార్ట్​ లాంటి ఇ-కామర్స్​ ఆన్​లైన్​ స్టోర్స్​లో కూడా ఈ స్మార్ట్​వాచ్​ను బుక్​ చేసుకోవచ్చు.

ఇతర ఆఫర్స్​
వన్​ప్లస్​ స్మార్ట్​వాచ్​-2​ బాక్స్ ​ప్రైస్​పై రూ.1000 వరకు ఇన్​స్టాంట్​ డిస్కౌంట్​ను ఇవ్వనుంది కంపెనీ​. ప్రీ బుల్లెట్ వైర్‌లెస్​ Z2 యాక్టివ్​ నాయిస్​ క్యాన్సిలేషన్ ఇయర్​బడ్స్​ను కూడా వాచ్​తో పాటు పూర్తి ఉచితంగా అందించనుంది.​ అయితే ఈ ఫ్రీ ఇయర్‌బడ్స్​ కూపన్​ ఆఫర్​ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఆసక్తిగలవారు వన్‌ప్లస్​ అధికారిక వెబ్‌సైట్​ నుంచి పాస్​ లింక్​ను కొనుగోలు చేయవచ్చు. దీని సాయంతో మీరు వాచ్​ను అందరికన్నా ముందుగానే బుక్​ చేసుకోవచ్చు. కాగా, మొదటి 1,500 యూనిట్లకు మాత్రమే ఈ ఆఫర్​ను పరిమితం చేయనున్నట్లు సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వాట్సాప్​లో 4 కొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్స్​ - ప్రత్యేకతలు ఇవే!

2024లో జీమెయిల్ షట్​ డౌన్ అవుతుందా? ​యూజర్ల పరిస్థితి ఏమిటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.