ETV Bharat / technology

వన్​ప్లస్​ కమ్యూనిటీ సేల్ వచ్చేసింది- ఆ ఫోన్స్, టాబ్లెట్స్​, వాచ్​, ఇయర్​బడ్స్​పై ఆఫర్లే ఆఫర్లు..! - ONEPLUS COMMUNITY SALE 2024

వన్​ప్లస్​ కమ్యూనిటీ సేల్​లో భారీ డిస్కౌంట్స్.. ఆకర్షణీయమైన డీల్స్ ఇవే..!

OnePlus Community Sale Brings Discounts
OnePlus Community Sale Brings Discounts (OnePlus)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 6, 2024, 1:21 PM IST

OnePlus Community Sale: ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇయర్​ ఎండ్​లో కమ్యూనిటీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్​లో కంపెనీ తన ఎంపిక చేసిన ఫోన్లు, ఇయర్​ బడ్స్, టాబ్లెట్స్ తదితర ఉత్పత్తులపై ఆకర్షణీయమై ఆఫర్లను అందిస్తోంది. అంతేకాక పెద్ద ఎత్తున బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్‌ EMI సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఈ సందర్భంగా ఈ సేల్ ఎన్ని రోజులు ఉండనుంది?, కంపెనీ అందిస్తున్న ఆఫర్లు ఏంటి? వంటి వివరాలు మీకోసం.

స్మార్ట్​ఫోన్లపై డీల్స్ ఇవే!:

కంపెనీ ఈ సేల్​లో 'వన్‌ప్లస్‌ 12' మొబైల్​పై భారీ ఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. దీన్ని 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో రూ.64,999 ధరతో లాంఛ్ చేసింది. ఇప్పుడు ఏకంగా రూ.6,000 తగ్గింపు ధరతో దీన్ని కేవలం రూ.58,999లకే అందిస్తోంది. అంతేకాక దీనిపై ICICI బ్యాంక్‌, వన్‌కార్డ్‌, RBL బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు యూజర్లు రూ.7వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు.

మరోవైపు 'వన్​ప్లస్ 12R' ఫోన్​పై రూ.6 వేలు, బ్యాంకు కార్డులపై రూ.3 వేలు డిస్కౌంట్స్​ ఇస్తామని కంపెనీ చెబుతోంది. దీంతో ఫోన్ ధర రూ.35,999 పలుకుతుంది.

ఇక కంపెనీ లేటెస్ట్​గా తీసుకొచ్చిన 'వన్‌ప్లస్‌ నార్డ్‌ 4' స్మార్ట్‌ఫోన్లపై కూడా ఈ సేల్​లో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ మోడల్​లోని సెలెక్టెడ్ వేరియంట్లపై రూ.3,000 ధర తగ్గింపు, ఇన్ స్టంట్ బ్యాంకు డిస్కౌంట్ రూ.2,000 లభిస్తుంది.

వీటితో పాటు వన్‌ప్లస్‌ 'నార్డ్‌ CE4', 'నార్డ్‌ CE4 లైట్‌' మొబైల్స్​పై రూ.2 వేలు డిస్కౌంట్‌, వెయ్యి రూపాయల ఇన్ స్టంట్ బ్యాంకు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ మొబైల్​ రూ.24,999 నుంచి రూ.22,999 ధరకు దిగి వస్తుంది. దీంతోపాటు వన్​ప్లస్ 'నార్డ్ బడ్స్ 2ఆర్' పొందొచ్చు.

కంపెనీ 'వన్​ప్లస్ ఓపెన్' పేరుతో గ్లోబల్​గా లాంఛ్ చేసిన తన మొట్ట మొదటి ఫోల్డబుల్​ ఫోన్​పై కూడా అదిరే ఆఫర్​ను అందిస్తోంది. ఈ ఫోన్​ ధర రూ.1,49,999 ఉండగా ఈ సేల్​లో భాగంగా అందిస్తున్న డిస్కౌంట్​లో దీన్ని రూ.1,34,999లకే సొంతం చేసుకోవచ్చు.

ఇక 'వన్​ప్లస్ ప్యాడ్​ గో' ట్యాబ్లెట్​ ధరను రూ.37,999 నుంచి రూ.27,999లకు తగ్గించి అందిస్తున్నారు. వీటితో పాటు ఈ సేల్​లో 'వన్​ప్లస్ ప్యాడ్ 2', 'వన్​ప్లస్ నార్డ్ CE4 లైట్' పై రూ.2,000 ధర తగ్గింపు ఉంటుంది. అంతేకాక వన్​ప్లస్ 'నార్డ్ CE4 లైట్' మొబైల్​పై రూ.1000 ఇన్​స్టంట్ బ్యాంక్​ డిస్కౌంట్​తో పాటు వన్​ప్లస్ 'బుల్లెట్స్ వైర్ లెస్ Z2' బ్లూటూత్​ను కూడా పొందొచ్చు.

వాచీలు, బడ్స్‌పై డిస్కౌంట్లు ఇలా!:

వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్​లో భాగంగా కంపెనీ తన ఎంపిక చేసిన వాచ్​లు, ఇయర్​బడ్స్​పైనా మంచి డిస్కౌంట్లు అందిస్తోంది. 'వన్​ప్లస్ వాచ్ 2', 'వన్​ప్లస్ వాచ్ 2R' ధరలను రూ.3,000 వరకు తగ్గించింది. అదనంగా 'వన్​ప్లస్ వాచ్2'పై రూ.3,000, 'వన్​ప్లస్ వాచ్2R'పై రూ.2000 చొప్పున ఇన్​స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్​ను కూడా అందిస్తోంది. దీంతో 'వన్​ప్లస్ వాచ్2' ధర రూ.24,999 నుంచి రూ.20,999లకు దిగి వచ్చింది.

మరోవైపు 'వన్​ప్లస్ బడ్స్ ప్రో3' ధరను రూ.1,000 తగ్గింపును ఆఫర్​ చేస్తోంది. అంతేకాక ఇన్​స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000తో కలిపి దాని ధర రూ.11,999లకు తగ్గించింది. ఇక 'వన్​ప్లస్ బడ్స్ ప్రో2' పై భారీ డిస్కౌంట్​తో రూ.7,999లకే సొంతం చేసుకోవచ్చు. కంపెనీ దీన్ని రూ.11,999 ధరకు లాంఛ్ చేసింది.

వన్​ప్లస్​ కమ్యూనిటీ సేల్ డిసెంబర్‌ 6 నుంచి 17 వరకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా వంటి ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు, రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌లోనూ ఈ ఆఫర్లు లభిస్తాయి. మరెందుకు ఆలస్యం ఈ ఇయర్​ ఎండ్​లో అదిరే ఆఫర్లలో మీకు కావాల్సిన ఉత్పత్తులను కొని పడేస్తే పోలా..!!

165KM రేంజ్​తో 'విడా వీ2' ఎలక్ట్రిక్ స్కూటర్లు- కేవలం రూ.96వేలకే..!

2025 హోండా అమేజ్ ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి? ఇది డిజైర్ కంటే మెరుగ్గా ఉందా..?

ప్రోబా-3 మిషన్ సక్సెస్- నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ59

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.