Nokia 3210 Specs Leaked : నోకియా ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. హెచ్ఎండీ గ్లోబల్ తమ ఐకానిక్ నోకియా 3210 ఫోన్‌ను న్యూ టచ్‌తో రీలాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే లాంఛ్‌కు ముందే ఈ నయా ఫోన్ ఫీచర్స్, స్పెక్స్, ధర వివరాలు లీక్ అయ్యాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్ఎండీ గ్లోబల్ ఇప్పటికే నోకియా 6310 ఫోన్‌ను రీలాంఛ్ చేసింది. ఇప్పుడు 1999ల నాటి నోకియా 3210 ఫోన్‌ను కూడా రీలాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది.
Nokia 3210 Features :
- అప్‌కమింగ్ నోకియా 3210 డిజైన్ దాని ఒరిజినల్ డిజైన్ కంటే చాలా భిన్నంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే దీని డిజైన్ నోకియా 6310 ఫోన్‌లాగా ఉంది.
- ఈ ఫోన్ వెనుక వైపు నోకియా లోగో అడ్డంగా (హారిజాంటల్) రాసి ఉంది.
- ఒరిజినల్ నోకియా 3210 ఫోన్లో రియర్ కెమెరా అనేది పూర్తిగా లేదు. కానీ ఈ నయా నోకియా ఫోన్లో వెనుకవైపు 2 ఎంపీ కెమెరాను అమర్చారు.
- అప్‌కమింగ్ నోకియా 3210 ఫీచర్ ఫోన్లో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే కూడా అమర్చారు.
- ఈ ఫోన్లో యూనిసోక్ టీ107 ప్రాసెసర్ ఉంటుంది.
- నోకియా 3210 ఫోన్‌ను 64జీబీ, 128జీబీ అనే రెండు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో తెస్తున్నారు. మైక్రో ఎస్బీ కార్డ్‌తో ఈ స్టోరేజ్‌ను ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు.
- ఈ అప్‌కమింగ్ నోకియా ఫోన్లో 1450 mAh బ్యాటరీ ఉంటుంది. కనుక బ్యాటరీ లైఫ్ బాగుంటుంది.
- గేమింగ్ ప్రియుల కోసం, ఈ నోకియా ఫోన్లో క్లాసిక్ స్నేక్ గేమ్ కూడా ఉంటుంది.
- ఈ ఫోన్ డ్యూయెల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కనుక దీనిలో రెండు సిమ్ కార్డులు వేసుకోవచ్చు.
- ఈ నోకియా ఫోన్లో బ్లూటూత్ 5.0, యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్ట్, క్లాసిక్ 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి.
- నోకియా 3210 ఫోన్ 4జీ నెట్వర్క్ సపోర్ట్‌తో వస్తుంది.
Nokia 3210 Price : ఈ క్లాసిక్ నోకియా 3210 ఫోన్ ధర సుమారుగా రూ.8000 ఉంటుందని సమాచారం.
Nokia 3210 Launch Date : హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్‌ను 2024 మే 8న లాంఛ్ చేయనుంది.
వాట్సాప్ నయా ఫీచర్ - ఇకపై గ్రూప్‌లోనే 'ఈవెంట్ ప్లాన్' చేయండిలా! - WhatsApp Event Planning