ETV Bharat / technology

నోకియా 3210 మళ్లీ వస్తోందా? ఆసక్తి రేపుతున్న HMD టీజర్! - Nokia 3210 smartphone - NOKIA 3210 SMARTPHONE

Nokia 3210 Smartphone : ఒకప్పడు నోకియా 3210 మొబైల్​కు ఎంత క్రేజ్​ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90వ దశకంలో ఇది ఎంతో పాపులర్. అందుకే దీని అప్​డేటెడ్ వెర్షన్​ను మళ్లీ లాంఛ్​ చేసేందుకు హెచ్​ఎండీ సంస్థ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.

Nokia 3210 Smartphone Features
Nokia 3210 Smartphone launch date
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 4:49 PM IST

Nokia 3210 Smartphone : నోకియా మొబైల్ లవర్స్​కు గుడ్ న్యూస్​. హెచ్​ఎండీ సంస్థ నోకియా 3210 అప్​డేటెడ్ వెర్షన్​ను మళ్లీ లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పైగా నోకియా అభిమానులను ఊరిస్తూ ఎక్స్​లో 'నోకియా బర్త్ డే' ఫొటోను కూడా షేర్ చేసింది.

సో పాపులర్​
ఈ ప్రపంచంలో నోకియా మొబైల్ తెలియనివారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. స్మార్ట్​ఫోన్స్ రాక ముందు కీప్యాడ్ మొబైల్స్​లో నోకియానే నంబర్-1గా ఉండేది. అందుకే దానిని మరోసారి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్​ఎండీ (Human Mobile Devices) సన్నాహాలు చేస్తోంది. బహుశా మే నెలలోనే ఈ అప్​డేటెడ్​ నోకియా హ్యాండ్​సెట్​ను లాంఛ్ చేసే అవకాశం ఉంది. అయితే హెచ్​ఎండీ ఈ కొత్త నోకియా ఫోన్​ పేరును ఇంకా వెళ్లడించలేదు. బహుశా ఇది నోకియా 3210 మోడల్ అప్​డేటెడ్ వెర్షనే అయ్యుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

పునరుత్తేజంతో
ఈ ఫిన్నిష్ మొబైల్ తయారీ కంపెనీ గత కొన్నేళ్లుగా నోకియా బ్రాండెడ్ ఫోన్ల ప్రొడక్షన్​ను తగ్గిస్తూ వచ్చింది. కానీ 2024లో ఓ దృఢమైన నిర్ణయం తీసుకుంది. తమ బ్రాండెడ్​ ఫోన్ల తయారీని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా సరికొత్త నోకియా ఫోన్​ను మే నెలలో లాంఛ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్​ (ట్విట్టర్​) వేదికగా ప్రకటించింది. ఈ ప్రకటనలో పసుపు రంగులో ఉన్న నోకియా పిక్సలేటెడ్ ఫోటోను షేర్ చేసింది. దానికి 'An Icon Returns this May' అనే ట్యాగ్​లైన్​ను జత చేసింది.

నోకియా ఈ పోస్ట్​ను మార్చి 18న చేసింది. దీని ద్వారా నోకియా 3210 మోడల్ లాంఛ్ అయ్యి 25వ వార్షికోత్సవం జరుపుకుంటోందని చెప్పకనే చెప్పింది. అందుకే త్వరలో ఈ మోస్డ్​ లవబుల్ ఫోన్​ను మరోసారి యూజర్ల ముందుకు తెచ్చే అవకాశముందని మార్కెట్లో టాక్​ నడుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, హెచ్​ఎండీ ఈ ఏడాది తమ బ్రాండెడ్​ ఫోన్లను మరిన్ని లాంఛ్​ చేసి, సేల్స్ పెంచుకుని మార్కెట్​లో మరింతగా విస్తరించాలని ఆశిస్తోంది. అందులో భాగంగానే తన మోస్ట్ పాపులర్ నోకియా 3210ను మరోసారి యూజర్లకు గుర్తు చేస్తోంది.

కొత్త ఫోన్ కొనాలా? టాప్​-5 అప్​కమింగ్ మొబైల్స్ ఇవే - ధర ఎంతంటే? - Upcoming Smartphones 2024

ఇన్​స్టాగ్రామ్​లో స్క్రీన్​షాట్​ తీస్తే - ఆ విష‌యం అవతలి వ్యక్తికి తెలుస్తుందా? - Instagram Screenshot

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.