ETV Bharat / technology

భారత్ ఎన్​సీఏపీ లాంచ్- 'కార్లపై స్టార్ రేటింగ్స్ షూరూ'! - Bharat NCAP

author img

By ETV Bharat Tech Team

Published : Sep 1, 2024, 12:50 PM IST

Updated : Sep 1, 2024, 4:03 PM IST

Bharat NCAP: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ భారత్ ఎన్​సీఏపీని లాంచ్ చేశారు. దీని లోగో, స్టిక్కర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్​సీఏపీ అంటే ఏంటి? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? దీనివల్ల ప్రయోజనాలేంటి? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

Bharat_NCAP
Bharat_NCAP (ETV Bharat)

Bharat NCAP: దేశంలో రోడ్డు భద్రత, వాహనాల ప్రమాణాలను పెంపొందించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. భారత్ ఎన్​సీఏపీను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం లాంచ్ చేసి లోగో, స్టిక్కర్‌ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. కారు క్రాష్ టెస్ట్ ప్రోగ్రాం అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియాలో ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తాజాగా దీన్ని ఇండియాలో కూడా లాంచ్ చేయటంతో కార్ క్రాష్ టెస్ట్ ప్రోగ్రాం కలిగి ఉన్న ఐదో దేశంగా భారత్ నిలవనుంది.

ఏంటీ భారత్ ఎన్​సీఏపీ?:

  • ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్‌ ఇచ్చే కొత్త విధానమే ఈ Bharat NCAP.
  • ఈ విధానం కింద ఇండియాలో తయారు చేసిన వాహనాల సేఫ్టీని టెస్ట్​ చేస్తారు.
  • ఇండియాలో తయారు చేసినా లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నా సంబంధిత కారుకు Bharat NCAP సర్టిఫికేట్​ ఉండాల్సిందే.
  • దీనిలో భాగంగా వాహనాల తయారీ సంస్థలు, తమ మోడల్స్​ను ఏఐఎస్​ 197 (ఆటోమోటివ్​ ఇండస్ట్రీ స్టాండర్డ్​) కింద వాలంటరీ టెస్టింగ్​కు ఇవ్వొచ్చు.
  • ఇది స్వచ్ఛందమే అయినా సంస్థలన్నీ ఇందులో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
  • అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్​ కింద అధికారులకు ఏ షోరూమ్​ నుంచైనా, ఏ వాహనాన్ని అయినా పిక్​ చేసి పరీక్షించే అధికారం వస్తుంది.
  • గ్లోబల్​ ఎన్​సీఏపీ, యూరో ఎన్​సీఏపీ వంటి టెస్టింగ్​ ప్రోగ్రామ్స్​ను కలగలిపి ఈ Bharat NCAPని రూపొందించారు.
  • ఏఓపీ (అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​), సీఓపీ (చైల్డ్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​)తో పాటు వివిధ టెస్ట్​లు నిర్వహించి స్టార్​ రేటింగ్స్​ ఇస్తారు.
  • ఈ టెస్ట్​లో 3 అంతకంటే ఎక్కువ రేటింగ్​ పొందాలంటే వాహనాల్లో కచ్చితంగా ఈఎస్​సీ (ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​) ఉండాల్సిందే.

క్రాష్ టెస్ట్​లో పరిగణలోకి తీసుకునే అంశాలేంటి?

  • ఈ కారు క్రాష్‌ టెస్ట్‌లో ఐదు భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు.
  • భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వాహనాన్ని డిజైన్‌ చేశారా? లేదా?
  • కారులో ప్రయాణించే పెద్దల భద్రతకు ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
  • ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లల భద్రతకు ఇస్తున్న ఫీచర్లు ఏంటి?
  • పాదచారులను వాహనం ఢీకొన్నప్పుడు వారిపై ఎంత మేర ప్రభావం ఉంటుంది?
  • భద్రత కోసం కారులో ఎలాంటి సాంకేతికతను ఉపయోగించారు? వంటి అంశాలను పరీక్షిస్తారు.
  • క్రాష్‌ టెస్ట్‌ అనంతరం కార్ల స్టార్‌ రేటింగ్ వివరాలను Bharat NCAP వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

దీని ఉపయోగాలేంటి?:

  • మార్కెట్లో ఎప్పటికప్పుడు కొంత వెర్షన్లో వాహనాలు లాంచ్ అవుతున్నాయి. అయితే భద్రతపరంగ ఏ వాహనాన్ని ఎంచుకోవాలి? అని ఆలోచిస్తున్న కస్టమర్లకు ఈ Bharat NCAP ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.
  • Bharat NCAPతో వాహన భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు ఆటోమొబైల్​ సంస్థలకు కూడా ఉపయోగకరంగా ఉండనుంది.
  • ఈ ప్రోగ్రాంలో భాగంగా 3,500 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్న వాహనాలను టెస్ట్​ చేశారు.
  • క్రాష్‌ టెస్ట్​లో మంచి స్కోర్​ సాధిస్తే ఆ వాహనాలకు అంతర్జాతీయంగానూ డిమాండ్​ పెరుగుతుంది.
  • తద్వారా ఎగుమతులు కూడా మెరుగుపడతాయి.
  • ఇప్పటికే ఈ ప్రోగ్రామ్​ను మహీంద్రా అండ్​ మహీంద్రా, టయోటా, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్​ వంటి సంస్థలు ప్రశంసించాయి.

Last Updated : Sep 1, 2024, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.