ETV Bharat / technology

కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా?- ఈ యాప్​తో మీ ప్రయాణం చాలా ఈజీ బాస్..!

ఒకే యాప్​లో ఫాస్టాగ్ రీఛార్జి, స్పీడ్‌ లిమిట్‌ అలర్ట్స్‌- ఇది ఉంటే మీ జర్నీ సేఫ్​..!

NHAI Rajmarg Yatra
NHAI Rajmarg Yatra (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 13, 2024, 11:35 AM IST

NHAI Rajmarg Yatra App: మనకి తెలియని కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే రూట్​ మ్యాప్ కచ్చితంగా ఉండాలి. ఫాస్టాగ్ రీఛార్జి చేసేందుకు మరో యాప్. జర్నీలో ఏవైనా సమస్యలు ఎదురైతే కంప్లైంట్ చేసేందుకు అప్పటికప్పుడు గూగుల్​లో వెతకాల్సి వస్తుంది. ఇలా ఒక్కోదానికి ఒక్కో యాప్ కాకుండా అన్నింటికీ కలిపి ఒకే యాప్​ను NHAI (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) తీసుకొచ్చింది. రూట్‌ మ్యాప్స్‌ దగ్గర నుంచి స్మార్ట్‌ అలర్ట్స్‌ వరకు అనేక ఫీచర్లు ఇందులో ఉండటంతో జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. 'రాజ్‌మార్గ్‌యాత్ర' పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్​పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

కీలక సమాచారం: జాతీయ రహదారులపై వెళ్తున్నప్పుడు ప్రయాణికులకు అవసరమయ్యే కీలక సమాచారం ఈ యాప్‌లో లభిస్తుంది. రెస్టారెంట్స్, పెట్రోల్‌ పంపులు, ఛార్జింగ్‌ స్టేషన్లు, హాస్పిటల్స్, ఏటీఎంలు, పోలీస్‌ స్టేషన్లు, పర్యటక ప్రదేశాల సమాచారం ఇందులో కన్పిస్తుంది. ఈ యాప్ వాతావరణ స్థితి, ట్రాఫిక్‌ అలర్ట్స్​ కూడా ఇస్తుంది.

ఫిర్యాదులు అక్కడే: ప్రధాన రహదారులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే ఈ యాప్​లో రిపోర్ట్‌ చేయొచ్చు. ఇందుకోసం యాప్​లో 'Report An Issue On NH' అనే ఆప్షన్‌ ఉంటుంది. దాని సాయంతో రహదారికి సంబంధించిన సమస్యను ఫొటో, వీడియోను యాడ్​ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఇందులో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు తీసుకుంటుంది. ఇందులో మన కంప్లైంట్ స్టేటస్​ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఫాస్టాగ్‌ సర్వీసెస్: ఈ రాజ్​మార్గ్​యాత్ర యాప్‌ నుంచి ఫాస్టాగ్‌కు సంబంధించిన సర్వీసులూ పొందొచ్చు. ఫాస్టాగ్‌ రీఛార్జి కోసం ఎన్‌హెచ్‌ఏఐ వివిధ బ్యాంకు పోర్టల్‌లతో కలసి పనిచేస్తోంది. కొత్త ఫాస్టాగ్‌ అప్లికేషన్, నెలవారీ పాస్‌లు, ఫాస్ట్‌ ట్యాగ్‌కు సంబంధించిన ఇతర సర్వీసులూ ఈ ప్లాట్‌ఫామ్‌పై లభిస్తాయి.

టోల్‌ ప్లాజా వివరాలు: మీరు వెళ్తున్న రహదారిలో ఉండే టోల్‌ ప్లాజాల సంఖ్య, వాటి పేర్లు, కట్టాల్సిన మొత్తం వివరాలు కూడా ఈ యాప్​ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యాప్​లో 'Toll Plaza Enroute' అనే ఆప్షన్​ ఉంటుంది. దీనిపై క్లిక్​ చేసి మీరు బయల్దేరుతున్న ప్రాంతం, చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంటర్‌ చేసి సెర్చ్‌పై క్లిక్‌ చేస్తే మీకు కావాల్సిన టోల్​ ప్లాజా వివరాలన్నీ అందులో కన్పిస్తాయి.

NHAI Rajmarg Yatra App
NHAI Rajmarg Yatra App (Google Play)

స్మార్ట్‌ అలర్ట్‌: ఓవర్‌ స్పీడ్‌ నోటిఫికేషన్‌ ఫెసిలిటీ కూడా ఈ యాప్​లో ఉంది. మీరు పరిమితికి మించి ఓవర్ స్పీడ్​తో ప్రయాణిస్తే ఇది మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎన్‌హెచ్‌ఏఐ యాప్​లో ఈ సదుపాయం తీసుకొచ్చింది. దీని కోసం ప్రొఫైల్లోకి వెళ్లి స్మార్ట్ అలర్ట్‌, వాయిస్‌ అసిస్టెంట్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా: హైవే అసిస్టెన్స్‌, పోలీస్‌ అసిస్టెన్స్‌, ఎమర్జెన్సీ నంబర్లు ఎమర్జెన్సీ ఆప్షన్‌లో కన్పిస్తాయి. మీరు ప్రయాణిస్తున్న హైవే వివరాలు కూడా అందులో డిస్​ప్లే అవుతాయి. కావాలంటే మీ జర్నీని రికార్డ్‌ చేసుకోచ్చు.

12 భాషల్లో రాజ్​మార్గ్ యాత్ర: ఈ యాప్​ తెలుగు, ఇంగ్లిష్‌తో సహా మొత్తం 12 భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని మీ మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అయితే చాలు యాప్​ ద్వారా ఈ ఫెసిలిటీస్ అన్నీ పొందొచ్చు. యాపిల్‌ యూజర్లు కూడా ఈ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుని వినియోగించొచ్చు.

వారెవ్వా.. వోక్స్‌వ్యాగన్ నయా కారు ఫస్ట్ లుక్​ అదుర్స్- రిలీజ్ ఎప్పుడంటే?

'జియో ఫైనాన్స్‌' యాప్ లాంచ్- జీరో ప్లాట్‌ఫామ్‌ ఫీతో పాటు మరెన్నో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.