ETV Bharat / technology

ఎంజీ మూడో ఎలక్ట్రిక్ కారు లాంచ్- ఫీచర్స్ చూస్తే వావ్ 'విండ్సర్​' అనాల్సిందే! - New MG Windsor EV Launched - NEW MG WINDSOR EV LAUNCHED

New MG Windsor EV Launched: ప్రపంచ దిగ్గజ కార్ల బ్రాండ్లలో ఒకటైన ఎంజీ నుంచి మరో కారు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదిరే ఫీచర్లతో నాలుగు కొంగొత్త రంగులతో దీన్ని రూపొందించారు. ఈ కొత్త కారుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

New_MG_Windsor_EV_Launched
New_MG_Windsor_EV_Launched (MG Motor India)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 16, 2024, 4:19 PM IST

New MG Windsor EV Launched: ప్రపంచ దిగ్గజ కార్ల బ్రాండ్లలో ఒకటైన మోరిస్ గ్యారేజెస్ నుంచి మరో కారు వచ్చేసింది. ఎంజీ విండ్సర్ పేరుతో ఎలక్ట్రిక్ వేరియంట్లో మోరిస్ గ్యారేజెస్ దీన్ని లాంచ్ చేసింది. ఇంతకు ముందు ఎంజీ.. కామెట్, జెడ్ఎస్ ఈవీలు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం మూడో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు మూడు ట్రిమ్​లలో, నాలుగు కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

MG Windsor EV Exterior: ఈ కారు ఎక్స్‌టీరియర్​లో విండ్సర్ సిగ్నేచర్ కౌల్, హెడ్‌ల్యాంప్‌ల వంటి డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. ఈ కారుకు 18-అంగుళాల క్రోమ్ అల్లాయ్ వీల్స్, ఫ్లోటింగ్ రూఫ్‌లైన్, పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనుక వైపు గ్లాస్‌హౌస్ కింద కనెక్ట్ చేసిన టెయిల్‌ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్‌లు ఉన్నాయి.

MG Windsor EV Interior: కారు లోపల క్యాబిన్‌ను లేత గోధుమరంగుపై బ్లాక్ కలర్​తో కలిపి ఇచ్చారు. సీట్లు క్విల్టెడ్ ప్యాటర్న్‌లో ఉన్నాయి. కామెట్‌ కారులో ఉన్న ఓఎస్ నే ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్​లో వాడారు. ఇందులో 15.6 అంగుళాల భారీ డిస్‌ప్లే ముందుభాగంలో హైలైట్​గా నిలుస్తోంది. మెయిన్ హైలైట్ సీట్‌బ్యాక్ ఎలక్ట్రికల్‌గా 135 డిగ్రీల వరకు వంగి ఉంటుంది. ఇది బిజినెస్ క్లాస్ సీటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. యూఎస్​బీ ఛార్జింగ్ పోర్ట్స్, వెనుక వైపు ఏసీ వెంట్లు, కప్ హోల్డర్‌లతో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌ కూడా ఇందులో ఉన్నాయి.

MG Windsor EV Features:

  • విండ్సర్ టాప్-స్పెక్ వేరియంట్‌
  • వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్
  • వైర్‌లెస్ ఛార్జర్
  • 360-డిగ్రీ కెమెరా
  • వెనుక ఏసీ వెంట్‌లతో క్లైమేట్ కంట్రోల్
  • కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ
  • రిక్లైనింగ్ రియర్ సీట్
  • పనోరమిక్ సన్‌రూఫ్
  • మల్టిపుల్ లాంగ్వేజెస్​లో వాయిస్ కంట్రోల్
  • జియోయాప్‌లు
  • కనెక్టివిటీ
  • టీపీఎంఎస్
  • ఆరు ఎయిర్‌బ్యాగ్స్
  • ఈబీడీతో కూడిన ఏబీఎస్
  • ఫుల్ ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ
  • ధర: రూ. 9.9లక్షలు (ఎక్స్ షోరూం)
    New_MG_Windsor_EV_Launched
    New_MG_Windsor_EV_Launched (MG Motor India)

MG Windsor EV Powertrain: ఎంజీ విండ్సర్ ఈవీ 38 KWH బ్యాటరీ ప్యాక్​తో ఉంటుంది. ఇది 331 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 134 బీహెచ్​పీ/200ఎన్ఎం టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఎంజీ విండ్సర్ ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్స్ నాలుగు డ్రైవ్ మోడ్​లు ఉన్నాయి.

దీని ధర బ్యాటరీ రెంటల్ కాకుండా ఉంటుంది. దీనికి అదనంగా బ్యాటరీ రెంట్ కిలోమీటర్​కు రూ. 3.5 ఉంటుంది. అంటే మీరు ఏడాదికి 50,000 కిలోమీటర్లు తిరిగినా అది మీకు రూ. 2లక్షల లోపే ఉంటుంది. కారు షోరూం ధరకు అదనంగా ఈ మొత్తాన్ని మీరు చెల్లించాల్సి ఉంటుంది.

రేపే మార్కెట్లోకి మెర్సిడెస్​ లగ్జరీ కారు- ఫస్ట్ లుక్​ చూశారా? - Mercedes Benz EQS SUV

వరల్డ్ ఫస్ట్ ట్రై ఫోల్డ్ మొబైల్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - First Tri Foldable Smartphone

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.