ETV Bharat / technology

జీ-మెయిల్ యూజర్లకు అలెర్ట్- మీకు ఆ రిక్వెస్ట్‌ వచ్చిందా?- అయితే బీ కేర్​ ఫుల్..!​

జీమెయిల్‌ యూజర్లే లక్ష్యంగా సైబర్ నేరాలు- వెలుగులోకి నయా స్కామ్

author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

New AI Cyber Scam
New AI Cyber Scam (ETV Bharat)

New AI Cyber Scam: సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు వారి పంథాలను మార్చుకుంటున్నారు. గిఫ్ట్‌లు, పార్శిళ్ల పేరిట మోసాలకు తెగబడుతున్న సైబర్‌ నేరగాళ్లు తాజాగా జీమెయిల్‌ యూజర్లే లక్ష్యంగా కొత్త తరహా మోసానికి తెరలేపారు. ఫేక్‌ అకౌంట్‌ రికవరీ రిక్వెస్టులు పంపి వాటిని యూజర్లతో అప్రూవ్‌ చేసుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. పొరపాటున ఆ లింక్​పై క్లిక్‌ చేస్తే వ్యక్తిగత డేటా వారి చేతిలోకి వెళ్లినట్లే! ఇలా తనకు ఎదురైన అనుభవాన్ని ఐటీ కన్సల్టెంట్‌, టెక్‌ బ్లాగర్‌ సామ్‌ మిట్రోవిక్‌ తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించారు. ఈ సైబర్ ఉచ్చులో సామాన్యులు ఈజీగా చిక్కుకునే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు.

సైబర్ నేరగాళ్లు ఎలా నమ్మిస్తారంటే..?:

మిట్రోవిక్ తెలిపిన వివరాల ఇలా..

  • స్కామ్‌లో భాగంగా అకౌంట్‌ రికవరీ పేరిట మీ ఫోన్‌కు నోటిఫికేషన్‌ లేదా మీ జీమెయిల్‌కు మెయిల్‌ చేస్తారు.
  • అదీ వేరే దేశం నుంచి వస్తుంది.
  • తన విషయంలో అమెరికా నుంచి ఈ రిక్వెస్ట్‌ వచ్చినట్లు మిట్రోవిక్‌ పేర్కొన్నారు.
  • ఒకవేళ ఆ నోటిఫికేషన్‌ రిజెక్ట్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్లు ప్లాన్‌-బి అమలు చేస్తారు.
  • వారి ప్లాన్​లో భాగంగా కాసేపటి తర్వాత గూగుల్‌ నుంచి చేసినట్లు మీకు ఓ కాల్‌ వస్తుంది.
  • అవతలి వ్యక్తి చాలా ప్రొపెషనల్‌గా, మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు.
  • గూగుల్‌ ఉద్యోగే ఫోన్‌ చేస్తున్నాడనేలా మిమ్మల్ని నమ్మిస్తారు.
  • 'మీ అకౌంట్‌ను ఎవరో విదేశాల్లో వాడేందుకు ప్రయత్నించారు. ఒకవేళ యాక్సెప్ట్‌ చేసుంటే మీరు ప్రమాదంలో పడేవారు' అంటూ మిమ్మల్ని నమ్మిస్తారు.
  • ఈ క్రమంలో దాని పర్యవసనాలు చెప్పి భయపెడతారు.
  • యూజర్‌ను నమ్మించాక గూగుల్‌ పేరిట మీకో ఈ-మెయిల్‌ పంపిస్తారు.
  • అయితే వాస్తవానికి అది ఫేక్‌ అని, ఒకవేళ వారు చెప్పినట్లు చేస్తే మీ జీమెయిల్‌ ఖాతా పూర్తి యాక్సెస్‌ వారి చేతిలోకి వెళ్లినట్లేనని మిట్రోవిక్‌ పేర్కొన్నారు.

వీటి నుంచి తప్పించుకోవడం ఎలా?

  • ఆధునిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్న ఇలాంటి కొత్త కొత్త స్కామ్స్​ పట్ల యూజర్లు అవగాహన పెంచుకోవాలి.
  • అకౌంట్‌ రికవరీ పేరిట వచ్చే రిక్వెస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదు. మీరు చేసి ఉంటే తప్ప!
  • ఎవరైనా గూగుల్ పేరిట కాల్‌ చేస్తే నమ్మొద్దు. సాధారణంగా గూగుల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ మినహా వేరేవరికీ నేరుగా ఫోన్‌ చేయదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • గూగుల్‌ పేరుతో ఎవరైనా మెయిల్‌ చేస్తే హడావుడిగా ఆమోదించకుండా ఆ మెయిల్‌ ఐడీని ఒకటికి రెండుసార్లు చెక్​చేసుకోవాలి.

ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయోచ్​.. ఇకపై ట్రాఫిక్​ టెన్షన్​కు చెక్​..!

త్వరలో మార్కెట్లోకి యాపిల్​ స్మార్ట్​ గ్లాసెస్​- మెటాకు పోటీగా అదిరే ఫీచర్లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.