ETV Bharat / technology

మెదడులో 'ఎలాన్ మస్క్​' చిప్- ఆలోచనలతోనే కంప్యూటర్​ను కంట్రోల్ చేసి చెస్​ గేమ్ - Neuralink Brain Chip Chess - NEURALINK BRAIN CHIP CHESS

Neuralink Brain Chip Chess : కేవలం మొదడుతో కంప్యూటర్​ను నియంత్రించి చెస్​ గేమ్​ ఆడాడు ఓ వ్యక్తి. దీనికోసం ఆయన మెదడులో ఓ ఎలక్ట్రానిక్​ చిప్​ను అమర్చింది ఎలాన్​ మస్క్​కు చెందిన న్యూరాలింక్​ సంస్థ. దీనికి సంబంధించిన వీడియోను న్యూరాలింక్​ తమ 'ఎక్స్' ఖాతా​లో పోస్ట్​ చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 2:30 PM IST

Neuralink Brain Chip Chess : మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. ఇలాంటి ప్రయోగాలను చేపట్టిన అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కు చెందిన సంస్థ​ న్యూరాలింక్‌, బుధవారం కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఇదివరకే ఎలక్ట్రానికి చిప్‌ను అమర్చిన వ్యక్తి నోలాండ్‌ అర్బాగ్‌ను ప్రజలకు పరిచయం చేసింది. పక్షవాతంతో బాధపడుతున్న ఆయనతో వీడియో గేమ్‌ 'సివిలైజేషన్‌ VI' చెస్‌ ఆడించింది. దాన్ని 'ఎక్స్‌'లో లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. అయితే అర్బాగ్ ఎవరి సాయం లేకుండా, తన మెదడుతో గేమ్‌ ఆడినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను న్యూరాలింక్‌ సహ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ 'ఎక్స్‌'లో షేర్​ చేశారు.

చెస్​ ఆడుతున్న సమయంలో లైవ్​ స్ట్రీమ్​లో అర్బాగ్‌ మాట్లాడారు. తాను జీవితంలో ఇక చేయలేననుకున్న చాలా పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఈ అత్యాధునిక సాంకేతికతలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని అన్నారు. ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. జీవితంలో తాను గేమ్స్‌ ఆడతానని ఊహించలేదన్న అర్బాగ్, న్యూరాలింక్‌ చిప్‌ వల్లే అది సాధ్యమైందని వివరించారు. తన జీవితంలో ఇప్పటికే చాలా సానుకూల మార్పులు వచ్చినట్లు తెలిపారు. దీని వల్ల ఇప్పుడు గంటలకొద్దీ వీడియో గేమ్స్‌ ఆడగలుగుతున్నానని చెప్పారు.

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో అర్బాగ్​ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వెన్నెముక దెబ్బతినటం వల్ల అర్బాజ్​ మెడ కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. కాళ్లు, చేతులు సొంతంగా కదల్చలేని పరిస్థితి. దీంతో తనకిష్టమైన వీడియో గేమ్స్‌ కూడా ఆడలేకపోయేవాడినని అర్బాగ్​ తెలిపారు. అయితే న్యూరాలింగ్ చిప్‌ అమర్చిన తర్వాత గంటలకొద్దీ ఆడగలుగుతున్నానని చెప్పారు. ఎవరి సాయం లేకుండా కేవలం మెదడుతోనే ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇవ్వగలుగుతున్నానని వెల్లడించారు. అయితే ఈ న్యూరాలింక్ చిప్‌ను తరచూ ఛార్జ్‌ చేయాల్సి రావడం ప్రస్తుతానికి ఉన్న ఒక పెద్ద పరిమితి అని వెల్లడించారు. అయితే ఈ చిప్​ను వైర్‌లెస్‌ విధానంలో ఛార్జింగ్‌ చేస్తారు.

జనవరిలో ప్రకటన
Neuralink Brain Chip Human Trials : ఓ వ్యక్తి మెదడులో విజయవంతంగా చిప్‌ను అమర్చినట్లు జనవరి న్యూరాలింక్‌ సంస్థ ప్రకటించింది. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే 'బ్రెయిన్‌- కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌-BCI' ప్రయోగాలకు అమెరికా 'ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)' గత ఏడాది మేలో ఆమోదం లభించింది. న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు తెలిపారు. దీని సాయంతో ఒక కోతి 'పాంగ్‌' వీడియో గేమ్‌ ఆడింది.

ఎలా పనిచేస్తుందంటే?
న్యూరాలింక్‌ బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (BCI)లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడు వేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. చిప్​ ఇన్‌స్టాల్‌ చేశాక ఈ బీసీఐ మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది.

న్యూరాలింక్‌ ఒక్కటే కాదు
తరచూ వార్తల్లో ఉండడం వల్ల న్యూరాలింక్ ప్రాజెక్టు గురించి మాత్రమే ఎక్కువగా బయటకు వస్తోంది. కానీ, ఈ తరహా ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేపడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలోనే యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్‌ను అమర్చింది. అయితే, న్యూరాలింక్ తరహాలో తాము పుర్రెకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది.

యూట్యూబ్​కు పోటీగా X వీడియోస్​ - నో సెన్సార్ - వారికి మాత్రమే ప్రత్యేకం!

సబ్​స్క్రిప్షన్ లేకున్నా ఎక్స్​లో ఆడియా, వీడియో కాల్స్​- ఈ సెట్టింగ్స్ మార్చుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.