ETV Bharat / technology

నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం- ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా? - NATIONAL SPACE DAY 2024 - NATIONAL SPACE DAY 2024

National Space Day 2024: చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుని సౌత్​ పోల్​పై కాలు మోపిన మొదటి దేశంగా అవతరించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది. ఈ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష వేడుకలు నిర్వహించేందుకు భారత్ నిర్ణయించింది.

National_Space_Day_2024
National_Space_Day_2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 10:08 AM IST

Updated : Aug 23, 2024, 11:02 AM IST

National Space Day 2024: చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పతాకాల్లో నిలిచింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద దిగిన తొలి దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23వ తేదీని ప్రధాని మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మొట్ట మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెల రోజుల నుంచి వేడుకలు కొనసాగుతున్నాయి.

ఈ ఏడాది థీమ్ ఏంటంటే?: 'టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ మూన్- ఇండియాస్ స్పేస్ సాగా'(Touching Lives while Touching the Moon: India's Space Saga) అనే థీమ్‌తో ఈ ఏడాది నేషనల్ స్పేస్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.

చంద్రయాన్-3 ప్రయోగం:

  • గతేడాది జూలై 14న చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మరుసటి రోజు, మొదటి కక్ష్యను పెంచే విన్యాసాలను విజయవంతంగా ప్రదర్శించారు.
  • ఆగస్టు 1, 2023న, ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ విజయవంతంగా పనిచేసింది.
  • ఆగస్టు 5న చంద్రయాన్‌-3ని చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
  • ఆగస్ట్ 17, 2023న, ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా వేరైంది.
  • ఆగష్టు 23న, సాయంత్రం 6:04 గంటలకు, చంద్రయాన్-3 ల్యాండర్ ల్యాండింగ్ కోసం లక్ష్యంగా పెట్టుకున్న 4.5 కిలోమీటర్ల విస్తీర్ణంలోని మధ్యభాగాన్ని తాకింది. ఆ పాయింట్‌కి 300 మీటర్ల (985 అడుగులు) దూరంలో ల్యాండర్ ల్యాండ్ అయింది.

హిస్టరీ క్రియేట్ చేసిన భారత్: చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో చంద్రుని సౌత్​ పోల్​పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్​ నిలిచింది. అంతేకాకుండా చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టిన యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా తర్వాత భారత్ నాల్గొవ దేశంగా అవతరించింది. 600 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ మిషన్ ప్రారంభమైంది. భారత్ తదుపరి మానవ సహిత చంద్ర యాత్రకు ప్రయత్నిస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

చంద్రయాన్-1 ప్రయోగం:

  • భారత్ మొదటి మిషన్ చంద్రయాన్-1 అక్టోబర్ 22, 2008న ఆంధ్రప్రదేశ్​లోని శ్రీహరికోటలోని SDSC SHAR నుంచి విజయవంతంగా ప్రారంభించారు.
  • ఈ మిషన్ నవంబర్ 10న చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ మైలురాయిని సాధించిన ఐదో దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది.
  • నవంబర్ 14న చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న షాకిల్టన్ క్రేటర్ సమీపంలో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (MIP) ఢీకొనడంతో చంద్రునిపై విజయవంతంగా దిగిన ఐదో దేశంగా భారత్ అవతరించింది.
  • ఈ మిషన్ రెండు సంవత్సరాల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే ఆర్బిటర్‌తో సంబంధాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని 28 ఆగస్టు 2009న ముగించినట్లు అధికారికంగా ప్రకటించారు.

చంద్రయాన్-2 ప్రయోగం:

  • చంద్రయాన్-1 మిషన్ విజయవంతం అయిన తర్వాత 2019 జూలై 22న చంద్రయాన్-2ని ప్రయోగించారు.
  • కక్ష్యను పెంచే విన్యాసాలు, చివరకు ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ తర్వాత, చంద్రయాన్-2 ఆగస్టు 20న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది.
  • అయితే సెప్టెంబర్ 6న చంద్రుని ఉపరితలంపైకి దిగుతున్న సమయంలో క్రాష్-ల్యాండింగ్ తర్వాత ల్యాండర్‌తో సంబంధం కోల్పోయింది.

ఇస్రో SSLV D3 ప్రయోగం విజయవంతం - దీని ఉపయోగాలు ఏంటంటే? - ISRO SSLV D3 Launched Successfully

అంతరిక్షంలో మినీ ఒలింపిక్స్ సంబరాలు - ఆసక్తిగా సాగిన ఈ వీడియో చూశారా? - Paris olympics 2024 NASA Astronauts

Last Updated : Aug 23, 2024, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.