ETV Bharat / technology

నంబర్​-1 యూట్యూబ్ ఛానల్​గా 'మిస్టర్ బీస్ట్' - రెండో స్థానానికి పడిపోయిన 'టీ-సిరీస్' - MrBeast - MRBEAST

MrBeast Overtakes T-Series : ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది సబ్​స్క్రైబర్లు ఉన్న ఛానల్​గా మిస్టర్​బీస్ట్​ నిలిచింది. ప్రస్తుతం దీనికి 26.6 కోట్లకు పైగా సబ్​స్క్రైబర్లు ఉన్నారు. ఇండియాకు చెందిన టీ-సిరీస్​ను వెనక్కు నెట్టి మిస్టర్​బీస్ట్ ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది.

MrBeast Youtube subscribers
MrBeast Overtakes T-Series (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 12:16 PM IST

MrBeast Overtakes T-Series : ప్రపంచంలోనే అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్‌ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్‌ (MrBeast) ఎదిగింది. భారత మ్యూజిక్‌ కంపెనీ ‘టీ-సిరీస్‌’ను (T-Series) వెనక్కి నెట్టి మరీ ఈ ఘనతను సాధించింది. ఈ విషయాన్ని మిస్టర్‌బీస్ట్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్న, అమెరికాకు చెందిన జేమ్స్‌ స్టీఫెన్‌ డోనాల్డ్‌సన్‌ తమ ఎక్స్‌ (ట్విట్టర్​) పోస్ట్ ద్వారా వెల్లడించారు.

గ్యాప్ తక్కువే!
మిస్టర్‌బీస్ట్‌కు ప్రస్తుతం 26.6 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టీ-సిరీస్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య దానికంటే కేవలం 1,608 మాత్రమే తక్కువ. ఈ సబ్​స్క్రైబర్స్ నంబర్స్​ను పోలుస్తూ మిస్టర్‌బీస్ట్‌ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే 12 మిలియన్లకు పైగా వ్యూస్‌, 10 వేలకు పైగా లైక్స్ రావడం విశేషం.

మస్క్ అభినందనలు
బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ సైతం మిస్టర్ బీస్ట్​ను అభినందిస్తూ పోస్ట్‌ చేశారు. 2024 ఏప్రిల్‌లోనే మిస్టర్‌బీస్ట్‌ ఛానల్​ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 25 కోట్లు దాటింది. దీంతో యూట్యూబ్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఛానల్‌గా నిలిచింది.

టీ-సిరీస్​ ప్రస్థానం
2019 నుంచి ఇప్పటి వరకు టీ-సిరీస్‌ అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా కొనసాగింది. స్వీడన్‌కు చెందిన 'ప్యూడైపై'ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే 2023లో ఓసారి ప్యూడైపైనకు మిస్టర్‌బీస్ట్‌ మద్దతుగా నిలిచారు. తాజాగా టీ-సిరీస్‌ను ఆయన ఛానల్‌ దాటేయటంతో, ప్యూడైపై ప్రతీకారాన్ని, తాను తీర్చుకున్నానంటూ ఓ పోస్ట్‌ పెట్టాడు.

2023లోనూ అత్యధికంగా డబ్బు సంపాదించిన యూట్యూబ్‌ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్‌ నిలిచింది. సాహసాలు, వింతైన స్టంట్లూ చేస్తూ, డోనాల్డ్‌సన్‌ నడుపుతున్న ఈ ఛానల్‌ ఆదాయం దాదాపు రూ.680 కోట్లని ఒక అంచనా.

మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారా?
చూశారుగా! మరి మీరు కూడా మంచి కంటెంట్ క్రియేటర్​గా, ఇన్​ఫ్లూయెన్సర్​గా పేరు సంపాదించాలని అనుకుంటున్నారా? సోషల్ మీడియా ద్వారా మీ బిజినెస్​ను ప్రమోట్ చేయాలని ఆశిస్తున్నారా? అయితే మీకు యూట్యూబ్ బెస్ట్ ప్లాట్​ఫామ్ అవుతుంది. ప్రతి నెలా దాదాపు 2 బిలియన్ల మంది యూట్యూబ్​ను చూస్తూ ఉంటారు. ఈ వీడియో-షేరింగ్ ప్లాట్​ఫామ్​లో విద్య, వినోదం రెండూ కలగలిసి ఉంటాయి. కనుక ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.

యూట్యూబ్​ ఛానల్​ వల్ల కలిగే లాభాలు

  • ప్రేక్షకుల ఆదరణ : యూట్యూబ్​కు సరిహద్దులు అంటూ ఏమీ లేవు. కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల అభిమానాన్ని మీరు సంపాదించవచ్చు.
  • మోనటైజేషన్​ : యూట్యూబ్​ పార్టనర్ ప్రోగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. యాడ్స్​, ఛానల్ మెంబర్​షిప్స్​, సూపర్ చాట్స్​ ద్వారా; ప్రొడక్ట్స్​ సేల్, అఫిలియేషన్ మార్కెటింగ్​​ చేయడం ద్వారా కూడా సంపాదన పెంచుకోవచ్చు. సబ్​స్క్రైబర్లు పెరుగుతున్న కొలదీ మీ రెవెన్యూ కూడా పెరుగుతుంది.
  • బ్రాండ్ బిల్డింగ్ : మీకంటూ ఒక బ్రాండింగ్​ను సృష్టించుకోవడం వల్ల, సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ అనుభవం, వ్యక్తిత్వం, విలువలు గురించి ప్రజలకు తెలుస్తుంది.
  • జ్ఞానం పంచుకోవడం : మీకు ఉన్న జ్ఞానాన్ని ట్యుటోరియల్స్ ద్వారా ప్రజలతో పంచుకోవచ్చు. దీని వల్ల చాలా మంది విజ్ఞానం, ప్రేరణ పొందుతారు.

YouTubeలో అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోకు ఎంత రెవెన్యూ వచ్చిందో తెలుసా? - The First Youtube Video

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలా? ఈ 10 సెట్టింగ్స్ మార్చుకోండి! - HOW TO BOOST PHONE BATTERY LIFE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.