WhatsApp New Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌లో తమ వినియోగదారులు వీడియో కాల్స్ క్వాలిటీని మరింత పెంచేందుకు 'లో లైట్ మోడ్' పేరుతో సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో తక్కువ వెలుతురు ఉన్న గదిలోనూ మెరుగైన క్వాలిటీతో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా ఈ ఫీచర్ ఉపయోగాలేంటీ?, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? వంటి వివరాలు మీకోసం.
ఈ ఫీచర్ ఉపయోగాలేంటి?:
- వాట్సాప్‌లో వీడియో కాల్స్ క్వాలిటీని పెంచేందుకుకే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.
- ఈ ఫీచర్ గదిలో తక్కువ వెలుతురు ఉన్నా కూడా మీ ప్రియమైన వారితో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.
- మీరు వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో ఇది ఆటోమేటిక్‌గా మీ పరిసరాల్లోని లైటింగ్‌ని పరిశీలించి అందుకు అనుగుణంగా లైట్‌ను అడ్జస్ట్ చేస్తుంది.
- వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో తక్కువ వెలుతురు ఉన్నా.. ఇది మీ ముఖానికి ఎక్కువ వెలుతురు వచ్చేలా చేస్తుంది.
- అంటే చీకటిలో కూడా నాణ్యమైన వీడియో కాల్స్‌ను ఈ ఫీచర్ ద్వారా మాట్లాడుకోవచ్చు.
- ఎంత చీకటిగా ఉన్నా మీరు వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో ఎదుటివారికి కన్పిస్తారు.
యాక్టివేట్ చేసుకోవడం ఎలా?:
- వాట్సప్ కొత్త 'లో లైట్ మోడ్' ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసి మీకు నచ్చినవారికి వీడియో కాల్ చేయండి.
- మీ వీడియోను ఫుల్ స్క్రీన్ చేయండి.
- ఇప్పుడు ఈ కొత్త లో లైట్ మోడ్‌ను యాక్టివేచ్ చేసుకునేందుకు కుడి వైపు కన్పిస్తున్న 'టార్చ్' ఐకాన్‌పై టాప్ చేయండి.
- తర్వాత లైట్‌ను అడ్జస్ట్ చేసేందుకు బల్బు గుర్తుపై ప్రెస్ చేయండి.
- ఇలా మీకు కావాల్సినంత లైటింగ్‌ను సెట్ చేసుకోవచ్చు.
- వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.
- అయితే విండోస్ వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.
- కానీ యూజర్స్ వీడియో కాల్స్‌లో బ్రైట్నెస్ పెంచుకునేందుకు అవకాశం ఉంది.
- ప్రతి కాల్‌కు తక్కువ లైట్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దీన్ని పర్మినెంట్‌గా ఎనేబుల్ చేసే ఆప్షన్ లేదు.
చవక ధరలో మార్కెట్లోకి కొత్త మొబైల్స్- ఫ్రీ రీఛార్జ్‌తో పాటు మరెన్నో..!
జీ-మెయిల్ యూజర్లకు అలెర్ట్- మీకు ఆ రిక్వెస్ట్ వచ్చిందా?- అయితే బీ కేర్ ఫుల్..!