Mercedes Benz AMG G63: దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది. ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ ఇండియన్ కస్టమర్ల కోసం AMG G63ని లాంచ్ చేసింది. దీని పాత వెర్షన్‌ను అప్డేట్ చేసి అదిరే ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త కారు 31 ప్రత్యేకమైన అప్హోల్స్టరీ ఆప్షన్స్, 29 పెయింట్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ లగ్జరీ కారు లాంచ్‌కు ముందే 120కి పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. 2025 మూడో క్వార్టర్లో కంపెనీ మంగళవారం నుంచి ఈ కారు బుకింగ్స్‌ను ప్రారంభించింది. మరెందుకు ఆలస్యం ఈ లగ్జరీ కారు ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి.
ఆటోమేటిక్ గేర్‌బాక్స్: 2025 మెర్సిడెస్ బెంజ్ AMG G63 అదే బై-టర్బో 4.0L V8 ఇంజిన్‌తో 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తోంది. ఇది 590 బిహెచ్‌పి పవర్, 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్, 20 హార్స్‌పవర్ అడిషనల్ బూస్ట్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. ఇది AMG 4MATIC సెటప్ ద్వారా అన్ని చక్రాలకు శక్తిని అందిస్తుంది. ఈ SUVలో ఆఫ్-రోడ్ కోసం లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఉంది.
పెర్ఫార్మెన్స్: ఈ కొత్త AMG G 63 కేవలం 4.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. ఈ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు రేస్ స్టార్ట్ ఫంక్షన్‌తో వస్తోంది.
ట్విన్-స్క్రీన్ సెటప్: ఈ కారు ఇంటీరియర్‌లో ఎలాంటి మార్పులూ చేయకుండా కొన్ని చిన్న ట్వీక్స్తో తీసుకొచ్చారు. ఆఫ్-రోడ్ కాక్‌పిట్, సెంట్రల్ మల్టీమీడియా డిస్‌ప్లేను కొద్దిగా మార్చారు. వీటిలో వెహికల్ పొజిషన్, కంపాస్, ఆల్టిట్యూడ్, స్టీరింగ్ యాంగిల్, టైర్ ప్రెజర్, టెంప్రేచర్, డిఫెరెంటియల్ లాక్ స్టాటస్లు ఉన్నాయి. ఇక మిగిలిన డివైజస్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇందులో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో కూడిన ట్విన్-స్క్రీన్ సెటప్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు మెర్సిడెస్ లేటెస్ట్ MBUX సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఇతర ఫీచర్లు:
- వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో
- ఆపిల్ కార్‌ప్లే
- USB-C పోర్ట్
- యాంబియంట్ లైటింగ్
- 18-స్పీకర్ బర్మెస్టర్ 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్
భద్రతా ఫీచర్లు:
- యాక్టివ్ బ్రేక్ అసిస్ట్
- లేన్-కీపింగ్ అసిస్ట్
- 360-డిగ్రీ కెమెరా సిస్టమ్
మెర్సిడెస్ బెంజ్ AMG G63 ధర: కంపెనీ ఈ కారును ఇండియాలో రూ. 3.60 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ కారు G వ్యాగన్ రేంజ్లో అగ్రస్థానంలో ఉంది. ఈ కారు బేస్ జి-క్లాస్ 400D కంటే రూ.1.05 కోట్లు ఎక్కువ ఖరీదైనది.
టొయోటా ఫెస్టివల్ స్పెషల్ ఎడిషన్ లాంచ్- లిమిటెడ్ సేల్స్.. వెంటనే త్వరపడండి..!
BSNL యూజర్స్‌కు ఫ్రీ Wi-Fi కనెక్షన్- వావ్.. ఆఫర్ అదిరిందిగా..!