ETV Bharat / technology

డ్యూయల్ డిస్లేతో లావా అదిరే ఫోన్- ధర ఎంతంటే? - Lava Agni 3 launched - LAVA AGNI 3 LAUNCHED

Lava Agni 3 Launched: శరన్నవరాత్రుల వేళ మార్కెట్లో మరో సరికొత్త స్మార్ట్​ఫోన్ లాంచ్ అయింది. సెకండరీ డిస్​ప్లేతో లావా తన అగ్ని3 మొబైల్​ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లపై లుక్కేద్దాం రండి.

Lava Agni 3 Launched
Lava Agni 3 Launched (Lava)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 4, 2024, 6:57 PM IST

Lava Agni 3 Launched: దసరా పండగ వేళ దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ లావా సరికొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే అగ్ని సిరీస్‌లో రెండు మొబైల్స్‌ను లాంచ్‌ చేసిన లావా తాజాగా సెకండరీ డిస్‌ప్లేతో మరో స్మార్ట్​ఫోన్​ను లాంచ్ చేసింది. లావా అగ్ని3 పేరిట శుక్రవారం లాంచ్‌ చేసింది. సాధారణంగా అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఉండే డిస్‌ప్లేతో పాటు బ్యాక్​సైడ్​ కూడా మరో డిస్‌ప్లేతో ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ను తీసుకొచ్చింది.

లావా అగ్ని3 మొబైల్​లో బ్యాక్‌ కెమెరా పక్కనే ఈ చిన్న బ్యాక్​సైడ్ డిస్‌ప్లే ఉంటుంది. స్టాప్‌వాచ్‌, అలారమ్‌ క్లాక్‌, మ్యూజిక్‌ ఇలా అన్నింటినీ వెనక భాగంలో డిస్‌ప్లే సాయంతో ఆపరేట్‌ చేసేయొచ్చు. కాల్స్‌ లిఫ్ట్‌ చేయడంతో పాటు సెల్ఫీలు కూడా తీసుకోవచ్చని లావా చెబుతోంది. మిడ్‌- రేంజ్‌లో యాక్షన్‌ బటన్‌తో వస్తున్న ఫస్ట్‌ ఇండియన్ మొబైల్‌ ఇదే అని లాంచ్ సమయంలో వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ 14తో రిలీజ్ చేసిన ఈ సరికొత్త మొబైల్‌కు రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్లను ఇస్తామని కంపెనీ చెబుతోంది.

లావా కొత్త ఫోన్‌ ఫీచర్లు:

  • ముందువైపు 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే
  • వెనుకవైపు 1.74 అంగుళాల సెకండరీ డిస్‌ప్లే
  • డిస్‌ప్లే: 120Hz కర్వ్‌డ్‌
  • ప్రాసెసర్‌: మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300
  • మెయిన్ కెమెరా: 50ఎంపీ (ఐఓఎస్‌)
  • అల్ట్రావైడ్‌ కెమెరా: 8 ఎంపీ
  • టెలిఫొటో లెన్స్‌: 8 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ
  • బ్యాటరీ: 5,000mAh
  • 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం

వేరియంట్స్:

  • 8జీబీ+ 128జీబీ వేరియంట్‌
  • 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ (ఛార్జింగ్‌ అడాప్టర్‌ లేకుండా)
  • 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ (ఛార్జింగ్‌ అడాప్టర్‌తో)

ధరలు:

8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర: రూ.20,999 (ఛార్జింగ్‌ అడాప్టర్‌ లేకుండా)

8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర: ధర రూ.22,999 (ఛార్జింగ్‌ అడాప్టర్‌తో)

8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర: రూ.24,999

Lava Agni 3 Launched
Lava Agni 3 Launched (Lava)

కలర్ ఆప్షన్స్:

  • వైట్‌
  • బ్లూ

ఈ కొత్త స్మార్ట్​ఫోన్ ప్రారంభ ఆఫర్‌ కింద ప్రతి వేరియంట్‌పై రూ.2వేలు రాయితీ అందిస్తున్నట్లు లావా ప్రకటించింది. ఇక ఛార్జర్‌ వద్దనుకుంటే మరో వెయ్యి రుపాయలు తగ్గింపునకే లభిస్తుంది. ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయని, ఈనెల 9 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. అగ్ని 2 ఎక్స్ఛేంజ్‌పై ఫ్లాట్‌ 8వేల రూపాయలు, అగ్ని1 పై రూ. 4వేల వరకు డిస్కౌంట్స్ ఉంటాయని వెల్లడించింది. మూడేళ్ల క్రితం షామీ కూడా బ్యాక్​సైడ్ చిన్న డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. అయితే అందులో టైమ్, బ్యాటరీ ఛార్జింగ్‌ చూసుకునేందుకే వీలయ్యేది.

కొత్త అప్డేట్ ఇచ్చిన యూట్యూబ్- అదేంటో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..! - YouTube Big Update

భారత్​లో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్స్- ఎక్కడెక్కడో తెలుసా? - Apple Stores in India

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.