ETV Bharat / technology

డ్రైవర్ల కొరతను తీర్చేందుకు జపాన్ మాస్టర్ ప్లాన్- ఆటోమేటెడ్​ కార్గో ట్రాన్స్​పోర్ట్​పై ఫోకస్ - CONVEYOR BELT ROAD

టెక్నాలజీలో దూసుకుపోతున్న జపాన్- సరకు రవాణాలో కొత్త మలుపు

Cargo Corridor Project
Cargo Corridor Project (AP)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 5, 2024, 12:22 PM IST

Conveyor Belt Road: సరకు రవాణా విషయంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంటోంది. ట్రక్కు డ్రైవర్ల కొరతను తీర్చేందుకు టోక్యో, ఒసాకా మధ్య సరుకు రవాణా కారిడార్‌ను నిర్మించాలని యోచిస్తోంది. దీనికి 'కన్వేయర్ బెల్ట్ రోడ్' అని పేరు పెట్టారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో, ఎంత మంజూరు చేశారన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

జపాన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి కంప్యూటర్ గ్రాఫిక్స్ వీడియోను తీసుకొచ్చింది. ఈ వీడియోలో ఆటో ఫ్లో రోడ్ అని పేరు పెట్టిన థ్రీ-లేన్ కారిడార్‌లో భారీ కంటైనర్లు కదులుతున్నట్లు కన్పిస్తుంది. దీన్ని​ 2027 లేదా 2028లో పరీక్షించనున్నారు. 2030 మధ్యలో ఈ ప్రాజెక్టు పూర్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని జపాన్ ప్రభుత్వం తెలిపింది.

రోడ్డు నెట్​వర్క్​లో లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక స్థలాలను క్రియేట్ చేయడమే ఈ ఆటో ఫ్లో రోడ్ కీ కాన్సప్ట్. దీనిలో భాగంగా 24 గంటల ఆటోమేటెడ్, మానవరహిత రవాణా వ్యవస్థలను అమలు చేస్తోంది. తగ్గిపోతున్న శ్రామిక శక్తిని భర్తీ చేయడం, డ్రైవర్ల పనిభారాన్ని తగ్గించడంతోపాటు ఈ వ్యవస్థ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుందని జపాన్ ప్రభుత్వం తెలిపింది.

జపాన్‌లో ఫోర్క్‌లిఫ్ట్‌లను ఉపయోగించి లోడింగ్ ఆటోమేటెడ్ అవుతుంది. ఇది విమానాశ్రయాలు, రైల్వేలు, ఓడరేవులతో అనుసంధానించి ఉంది. ఈ బాక్స్​లు 180 సెం.మీ ఎత్తు, 110 సెం.మీ వెడల్పు, 110 సెం.మీ పొడవు కలిగిన పెద్ద గది పరిమాణంలో ఉంటాయి. అన్నీ అనుకూలిస్తే ఇవి ఇతర మార్గాలకూ విస్తరించొచ్చు. భవిష్యత్తులో డ్రైవర్‌లెస్ టెక్నాలజీని ఉపయోగించినప్పటికీ, డ్రైవర్లు లాస్ట్​లో ప్రజలకు డోర్‌ డెలివరీలు చేయాల్సి ఉంటుంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో అమలులోకి వచ్చిన చట్టాల కారణంగా జపాన్‌లో ట్రక్ డ్రైవర్ల కొరత తీవ్రమవుతోంది. డ్రైవర్ల ఓవర్ టైమ్ డ్యూటీలపై లిమిట్స్​ విధించింది. ఇది అధిక పని, ప్రమాదాలను నివారించేందుకు అవసరమని భావిస్తున్నారు. అయితే జపాన్ లాజిస్టిక్స్, గవర్నమెంట్ ట్రాన్స్​పోర్ట్ సేక్టార్స్​లో దీన్ని ఒక సమస్యగా అంతా భావిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి జపాన్ మొత్తం రవాణా సామర్థ్యం 34 శాతం తగ్గుతుంది. జపాన్ ట్రక్కింగ్ అసోసియేషన్ ప్రకారం దేశీయ రవాణా సామర్థ్యం సుమారు 4.3 బిలియన్ మెట్రిక్ టన్నులు.

ఎక్స్ యూజర్స్​కు క్రేజీ అప్​డేట్​- మిమ్మల్ని బ్లాక్ చేసిన వారి పోస్ట్​లను ఇకపై చూడొచ్చు- అదెలాగంటే?

పిచ్చెక్కించే ఫీచర్లతో వన్​ప్లస్, ఐక్యూ మొబైల్స్​- వీటిలో ఏది బెస్ట్ అంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.