ETV Bharat / technology

హ్యుందాయ్ టక్సన్​కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్- కళ్లు మూసుకుని కొనేయొచ్చు ఇక..! - HYUNDAI TUCSON CRASH TEST RATING

5 స్టార్‌ క్లబ్‌లోకి టక్సన్- భారత్ NCAP టెస్ట్​లో టాప్‌ రేటింగ్‌

Hyundai Tucson
Hyundai Tucson (Hyundai)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 29, 2024, 7:25 PM IST

Hyundai Tucson Crash Test Rating: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌కి చెందిన ఎస్‌యూవీ టక్సన్ ఫ్రైవ్​ స్టార్‌ క్లబ్‌లోకి చేరింది. భారత్ ఎన్​సీఏపీ క్రాస్ టెస్ట్​లో ఈ ఎస్​యూవీ పర్ఫెక్ట్ 5-స్టార్ రేటింగ్ సాధించింది. భారత్ ఎన్​సీఏపీ పరీక్షించిన తొలి హ్యుందాయ్ కారు ఇదే. గతంలో ఈ కంపెనీకి చెందిన వెర్నా గ్లోబల్‌ ఎన్‌సీఏపీ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ సాధించింది. ఇప్పుడు టక్సన్‌ అత్యధిక రేటింగ్ సాధించింది.

అడల్ట్ సెక్యూరిటీకి సంబంధించి 32 పాయింట్లకు గానూ ఈ కారు 30.84 పాయింట్లు సాధించింది. ఇక చైల్డ్ ప్రొటెక్షన్​కు సంబంధించి 49 పాయింట్లకు గాను 41 పాయింట్లు పొందింది. ఈ రెండు కేటగిరీల్లోనూ హ్యుందాయ్‌ టక్సన్‌ ఫైవ్​ స్టార్ రేటింగ్‌ సాధించినట్లు భారత్ ఎన్​సీఏపీ వెల్లడించింది. ఈ సందర్భంగా హ్యుందాయ్‌ టక్సన్‌ ఎస్​యూవీ ఇంజిన్, భద్రతా ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండియ

ఇంజిన్: ఇది 2.0-లీటర్ పెట్రోల్‌, 2-లీటర్ డీజిల్‌ వెర్షన్లలో లభిస్తుంది. దీని పెట్రోల్ ఇంజిన్ 156bhp పవర్, 192Nm టార్క్​ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్​తో లింక్ అయి ఉంటుంది. ఇక దీని డీజిల్ ఇంజిన్ 186bhp పవర్, 416Nm టార్క్​ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్​తో జతయి వస్తుంది. అంతేకాకుండా టక్సన్ డీజిల్ ఇంజిన్​కు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది.

సెక్యూరిటీ ఫీచర్స్:

  • ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్
  • బెల్ట్ ప్రీటెన్షనర్
  • బెల్ట్ లోడ్ లిమిటర్
  • సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్
  • సైడ్ చెస్ట్ ఎయిర్ బ్యాగ్
  • సైడ్ పెల్విస్ ఎయిర్ బ్యాగ్

వీటితో పాటు ఈ కారులో చైల్డ్ సీట్ కోసం ఐసోఫిక్స్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల రక్షణ, సీట్ బెల్ట్ రిమైండర్లు ఉన్నాయి. హ్యుందాయ్ టక్సన్ ప్లాటినం, సిగ్నేచర్ వేరియంట్లకు కూడా ఈ రేటింగ్స్ వర్తిస్తాయి.

ధర: దేశీయ మార్కెట్‌లో ఈ కారు ధర రూ.29.02 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మరోవైపు భారత్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్‌లో ఇప్పటికే టాటాకు చెందిన కర్వ్‌, కర్వ్‌ ఈవీ, నెక్సాన్‌, మహీంద్రా థార్‌ రాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కార్లు ఫైవ్ స్టార్‌ రేటింగ్‌ సాధించాయి.

భారత్ అణుబాంబు మిస్సైల్ టెస్ట్ సక్సెస్- భూమి, ఆకాశంలోనే కాదు.. సముద్రం నుంచి కూడా సై..!

మతిచెదిరే లుక్​లో BMW కొత్త కారు- ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.