How to Speed Up Slow Android Phone: ఇటీవల కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. వాటిలో ఆండ్రాయిడ్ మొబైల్స్‌ను ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ లేకుంటే అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో ఉండాల్సిందే. అంతలా దానిపై ఆధారపడిన సమయంలో ఫోన్ స్లో అయిపోయి సరిగా పనిచేయకపోతే చాలా చికాకుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేస్తే మళ్లీ మొబైల్ ఫోన్ స్పీడ్‌గా పనిచేస్తుంది? అని వెతుకుతున్నవారు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మొబైల్ కొత్తదానిలా స్పీడ్‌గా పనిచేస్తుంది.
ఫోన్ స్పీడ్‌గా పనిచేసేందుకు టిప్స్:
ఫోన్ రీస్టార్ట్: ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించటం వల్ల అది స్లో అయిపోతుంది. దాని పనితీరులో కూడా అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి. దీనివల్ల RAM క్లియర్ అవుతుంది. దీంతోపాటు మొబైల్ ఫోన్లో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి.
ఫోన్లో యాప్స్ స్టోరేజీ తగ్గించుకోవాలి: తరచూ కొత్త కొత్త యాప్‌లను ఇన్స్టాల్ చేయటం వల్ల కూడా మొబైల్ స్లో అయిపోతుంది. కాబట్టి పనికొచ్చే యాప్స్ మాత్రమే ఫోన్లో ఉంచి అనవసరమైన యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. దీంతోపాటు Facebook, Instagram వంటి యాప్స్‌కి సంబంధించిన లైట్ వెర్షన్లను సెలక్ట్ చేసుకోవటం ద్వారా ఫోన్ స్పీడ్ మెరుగుపడుతుంది.
మొబైల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్: స్మార్ట్ ఫోన్లో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయకపోవటం వల్ల కూడా మొబైల్ స్లో అయిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్డేట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మీ ఫోన్ కొత్తదానిలా స్పీడ్‌గా పనిచేస్తుంది.
యానిమేషన్ అడ్జెస్ట్మెంట్: స్మార్ట్ ఫోన్లో యానిమేషన్స్ను తగ్గించటం లేదా నిలిపివేయటం వల్ల ఫోన్ స్పీడ్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఫోన్ స్పీడ్‌గా పనిచేయాలంటే 'Animator Duration Scale', 'Transition Animation Scale', 'Window Animation Scale' సెట్టింగ్స్‌ను '5X' లేదా 'ఆఫ్' మోడ్‌కి మార్చండి.