ETV Bharat / technology

కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందా?- ఈ టిప్స్ పాటిస్తే సగం డబ్బులు మిగిలినట్లే! - How to Reduce Electricity Bill

author img

By ETV Bharat Tech Team

Published : Sep 5, 2024, 3:58 PM IST

Updated : Sep 5, 2024, 4:06 PM IST

How to Reduce Electricity Bill: విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందా? కరెంటు​ బిల్లుతో ప్రతినెలా జేబులకు చిల్లు పడుతోందా? ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా? విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా? అయితే డోంట్ వర్రీ ఈ టిప్స్ పాటిస్తే సగం డబ్బులు మిగిలినట్లే. అవేంటంటే?

How_to_Reduce_Electricity_Bill
How_to_Reduce_Electricity_Bill (ETV Bharat)

How to Reduce Electricity Bill: ప్రసుతం అందరినీ వేధిస్తున్న సమస్య అధిక కరెంటు బిల్లు. ప్రతినెలా విద్యుత్​ బిల్లు తడిసి మోపెడవుతోంది. దీంతో అంత భారీ మొత్తంలో కరెంటు బిల్లులు చెల్లించలేక సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం రండి.

ఎల్​ఈడీ లైట్ల వాడకం: సాధారణ బల్బులు ఎక్కువ విద్యుత్తును కాలుస్తాయి. దీంతో కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో ఎల్​ఈడీ లైట్లను వాడితే మంచిది. ఇవి తక్కువ కరెంట్​ను కాలుస్తాయి. దీంతో వీటిని ఉపయోగిస్తే బిల్లు కూడా తక్కువగా వస్తుంది. దీంతోపాటు ఇవి ఎక్కువకాలం మన్నికను కూడా ఇస్తాయి.

అన్​ప్లగ్​ అప్లియన్సెస్: ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్​ను ఉపయోగించిన తర్వాత చాలామంది వాటిని అన్​ప్లగ్​ చేయకుండా అలానే ఉంచేస్తారు. స్విచ్​ ఆఫ్​ చేసినా అన్​ప్లగ్​ చేయకుంటే అవి కరెంట్​ను లాగేస్తాయి. అందుకే ఇకపై సెల్​ఫోన్​ ఛార్జర్లు, టీవీలు, కంప్యూటర్లు, వైఫై రూటర్లు, ఐరన్​ బాక్స్, వాషింగ్ మెషీన్స్​ వంటి ఎలక్ట్రానిక్ అప్లియన్స్​ను వినియోగించిన తర్వాత వెంటనే అన్​ప్లగ్ చేయటం మంచిది.

ఏసీ నిర్వహణ: హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్​ కండిషనింగ్ సిస్టమ్స్​ నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎయిర్​ ఫిల్టర్​ను క్రమం తప్పకుండా మార్చాలి. సంవత్సరానికి ఒకసారైనా మెకానిక్​ ద్వారా సర్వీస్ చేయించుకోవాలి. ఏసీ నిర్వహణ సక్రమంగా ఉంటే విద్యుత్​ను తక్కువగా కాలుస్తుంది. దీంతోపాటు ఎక్కువకాలం మన్నిక కూడా ఇస్తుంది. దీంతోపాటు బాగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఏసీని వినియోగించటం ఉత్తమం.

పవర్​ స్ట్రిప్స్ వాడకం: టీవీ, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పవర్​ స్ట్రిప్​లలోకి ప్లగ్ చేయాలి. దీంతోపాటు అలాంటి వస్తువులను స్టాండ్​బైలో ఉంచకూడదు. కంప్యూటర్​ను వినియోగించిన వెంటనే దాన్ని ఆఫ్​ చేసేయండి. అలాకాకుండా స్టాండ్​బై మోడ్​లో ఉంటే అవి ఎక్కువ ఎలక్ట్రిసిటీని వినియోగిస్తాయి. దీంతో బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది.

ఇంటిని ఇన్సులేట్ చేయటం: ఇంటికి మంచి ఇన్సులేషన్ అవసరం. ఇది ఇంట్లో సరైన ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు సహాయపడుతుంది. తలుపులు, కిటికీల్లో ఖాళీలను మూసివేసి, గోడలు, ఇంటి పైకప్పులపై ఇన్సులేషన్ను ఇన్​స్టాల్ చేసుకోండి. దీంతో హీటింగ్, కూలింగ్ ఖర్చులను తగ్గించుకోవచ్చు.

వాషింగ్ మెషీన్ల వాడకం తగ్గించటం: దుస్తులను ఉతికేందుకు వాషింగ్ మెషీన్​ను వినియోగించటం తగ్గించాలి. చాలా బిజీ షెడ్యూల్​లో సమయం లేనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తే మంచిది. ఇలా చేయటం వల్ల కరెంట్ బిల్లుతో పాటు నీటిని కూడా ఆదా చేయొచ్చు.

క్లాత్స్ ఎయిర్​ డ్రై: ఉతికిన దుస్తులను ఆరబెట్టేందుకు ఎప్పుడూ సహజ మార్గాలనే ఉపయోగించాలి. బట్టలను గాలి, సూర్యరశ్మిలో ఆరబెడితే మంచిది.

స్టార్​ రేటింగ్స్ చూసుకోవటం: టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్​ కొనేటప్పుడు ఎక్కువ స్టార్ రేటింగ్స్ ఉన్న వాటిని తీసుకుంటే మంచిది. దీనివల్ల విద్యుత్ వాడకం తగ్గటమే కాక బిల్లును కూడా తగ్గించుకోవచ్చు.

వీటితో పాటు పగటిపూట సూర్యరశ్మిని ఉపయోగించి లైట్స్, ఫ్యాన్స్ వినియోగం తగ్గిస్తే మంచిది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు, బయటికి వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలను ఆఫ్​ చేయండి. ఇలా విద్యుత్తును ఆదా చేసుకుని బిల్లును తగ్గించుకోవచ్చు.

ఒక్కరోజులోనే పాన్​కార్డు కావాలా?- ఉచితంగా డౌన్​లోడ్ చేసుకోండిలా! - Free Instant e PAN

మార్కెట్లోకి వరల్డ్ ఫస్ట్ ట్రై ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్- లాంచ్ ఎప్పుడంటే? - World First Tri Foldable Mobile

భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత- గ్యాస్ సిలిండర్లు వాడకంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - LPG Gas Cylinder Safety Precautions

Last Updated : Sep 5, 2024, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.