ETV Bharat / technology

UPI యూజర్లు జాగ్రత్త!- ఈ ఆప్షన్​ను వెంటనే ఆఫ్ చేయండి- లేకుంటే మీ ఖాతా ఖాళీ! - HOW TO DEACTIVATE UPI AUTOPAY

UPI ఆటోపే సహాయంతో ఈజీగా నెలావారీ బిల్లుల చెల్లింపులు- ప్రయోజనాలు ఉన్నట్లే నష్టాలు కూడా!

UPI
UPI (Photo Credit- Getty Image)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 28, 2025, 1:21 PM IST

How to Deactivate UPI Autopay Option: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన జీవితాలు సులభతరం అవుతున్నాయి. టెక్నాలజీ సహాయంతో నేడు మన పనులు చాలా వరకు ఈజీగా అయిపోతున్నాయి. అటువంటి వాటిలో డిజిటల్ పేమెంట్స్ ఒకటి. మన దేశంలో ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ హవానే నడుస్తుంది. ఈ మేరకు డిజిటల్ పేమెంట్స్ ఊపందుకోవడంలో UPI కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పొచ్చు.

UPI ద్వారా వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యాపారులకు ఆన్​లైన్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరుగుతున్నాయి. దీంతో నేడు చాలా వరకు అంతా దీన్నే వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో RBI, NPCI చొరవతో ఈ యాప్​లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో 'UPI ఆటోపే' సర్వీస్ ఒకటి. దీని సహాయంతో ప్రతి నెలా వేర్వేరు సర్వీసులకు బిల్లులను ఒకేసారి ఈజీగా చెల్లించొచ్చు.

అంటే దీని ద్వారా మొబైల్, ఇంటర్నెట్, విద్యుత్, వాటర్, గ్యాస్ వంటి మీ నెలవారీ సర్వీస్ బిల్లులు ఒకేసారి ఆటోమెటిక్​గా పే అయిపోతాయి. ఇందుకోసం UPI ఆటోపే ఆప్షన్​ను ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఆపై ప్రతి నెలా మీ బిల్లులను చెల్లించేందుకు విడిగా లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా ఇది మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

అయితే ఈ ఫీచర్ వల్ల ఎన్ని లాభాలున్నాయో, ఉపయోగించడం ఆపేస్తే అంతకంటే ఎక్కువ నష్టమే వాటిల్లే అవకాశం ఉంది. ఈ సర్వీస్​ను వినియోగించడం ఆపేసిన తర్వాత కూడా ఆటోపే ఆప్షన్​ కారణంగా మీ అకౌంట్​ నుంచి అమౌంట్ కట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కొన్నిసార్లు ఈ UPI ఆటోపే కారణంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావొచ్చు. అయితే ఆ సమస్య లేకుండా మీ అకౌంట్​లో UPI ఆటోపే మోడ్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.

ఫోన్​పేలో UPI ఆటోపేను ఎలా డియాక్టివేట్ చేయాలి?:

  • ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్​ఫోన్​లో PhonePe యాప్​ను ఓపెన్ చేసి మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.
  • అప్పుడు మీకు 'Payment Management' ఆప్షన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు పేమెంట్ మేనేజ్​మెంట్ సెక్షన్​లో కన్పిస్తున్న 'Autopay' ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • ఇలా చేసిన తర్వాత మీకు 'Pause', 'Delete' అనే రెండు ఆప్షన్స్​ కన్పిస్తాయి.
  • ఇప్పుడు మీరు ఆటేపేను తాత్కాలికంగా (Temporarily) ఆపేయాలని అనుకుంటే 'Pause' ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకోండి.
  • ఒకవేళ ఆటోపేను శాశ్వతంగా (Permanently) ఆఫ్ చేయాలి అనుకుంటే 'Delete' అనే ఆప్షన్​ను ఎంచుకోండి.
  • అప్పుడే మీ ఆటోపే ఆప్షన్ శాశ్వతంగా డీయాక్టివేట్ అయిపోతుంది.

ట్రాయ్ ఆదేశాలు- రీఛార్జ్ ప్లాన్​లు ఒకేసారి రూ.210 తగ్గింపు!

రాయల్​ ఎన్​ఫీల్డ్ డిమాండ్ మామూలుగా లేదుగా- ఏకంగా 5లక్షల మంది కొన్న మోడల్ ఇదే!​

త్వరలో మార్కెట్లోకి నథింగ్ నుంచి నయా స్మార్ట్​ఫోన్- ఈసారి రెండు కాదు, మూడు కెమెరాలతో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.