How To Clean Airpods At Home : ఈరోజుల్లో ఫోన్ వాడుతున్న చాలా మంది ఇయర్ ఫోన్స్ లేదా ఎయిర్ పాడ్స్‌ను వాడుతున్నారు. చేతిలో ఫోన్ ఉన్నట్లే చాలా మంది చెవులకు ఎయిర్ పాడ్స్/ బ్లూటూత్ కనిపిస్తున్నాయి. మనలో చాలామంది వాటిని వాడడమే తప్ప వాటి శుభ్రతపై దృష్టి పెట్టరు. దీంతో చెవిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
మన కంటికి కనిపించని బ్యాక్టీరియాతోపాటు ఇతర హానికరమైన క్రిముల వల్ల చెవుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా బ్లూటూత్/ ఎయిర్ పాడ్స్ దుమ్ముపట్టి సరిగా పనిచేయదు. అందుకే వాటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇయర్ పాడ్స్ ను క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి.
ఎయిర్ పాడ్స్‌ను మూడు దశల్లో శుభ్రం చేయాలి. ముందుగా ఎయిర్ పాడ్‌ను కేసు నుంచి జాగ్రత్తగా బయటకు తీయాలి. సిలికాన్ ఎయిర్ పాడ్ అయితే 5 మిల్లీలీటర్ల లిక్విడ్ డిష్ సోప్‌ను 250 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీటిలో వేసి మెల్లగా క్లీన్ చేయాలి. 70శాతం ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌తో తడిపిన కాటన్ స్వాబ్‌తో శుభ్రంగా తుడవాలి. ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్ వల్ల దుమ్ము పోతుంది.
ఇక స్పీకర్ గ్రిల్స్, మైక్ అవుట్ లెట్లు, ఛార్జింగ్ పాయింట్ల చాలా చిన్నగా ఉంటాయి కనుక క్లాత్‌తో తుడవడం వీలుకాదు. వాటిలోపల కూడా దుమ్ము ఉండే అవకాశం ఉన్నందున మెత్తటి బ్రష్ లేదా చిన్న సిలికాన్ పేస్ట్రీ బ్రష్ ఉపయోగించాలి. ఇంట్లో పేష్ట్రీ బ్రష్ లేకపోతే టూత్ బ్రష్ లేదా టూత్ బ్రష్ హెడ్ ఉపయోగించి శుభ్రం చేయవచ్చు.
ఆల్కహాల్ క్లీనింగ్ తర్వాత గ్రిల్స్ చుట్టూ తుడవాలి. ఇక ఛార్జింగ్ పాయింట్లను శుభ్రం చేయడానికి కంప్రెస్డ్ ఎయిర్ కేస్ వాడాలి. ఈ కంప్రెస్డ్ ఎయిర్ కేస్ ఆన్లైన్ సైట్స్‌లో లభ్యమవుతుంది. దీని ద్వారా ధూళి బయటకు వచ్చేస్తుంది. ఇక చివరగా మైక్రో ఫైబర్ క్లాత్‌తో ఎయిర్ పాడ్స్‌ను శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ పాడ్స్ క్లీన్‌గా ఉంటాయి. ఫలితంగా మన చెవులను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
మీకు నచ్చిన ఎమోజీతో 'ఎయిర్‌పాడ్స్' ఛార్జింగ్ కేస్.. ఫ్రీగా...