ETV Bharat / technology

అలర్ట్ : మీ ఫోన్‌ కాల్స్‌ ఎవరో వింటూ ఉండొచ్చు! - మీ మెసేజెస్‌ చదువుతూ ఉండొచ్చు! - ఈ ఒక్క కోడ్​తో తెలుసుకోండి! - How To Check Call Forwarding - HOW TO CHECK CALL FORWARDING

How To Check Call Forwarding is ON or OFF : మీకు తెలియకుండానే మీ ఫోన్‌ కాల్స్‌ ఎవరో వింటూ ఉండొచ్చు. మీ మెసేజెస్‌ ఎవరో చదువుతూ ఉండొచ్చు. ఈ సైబర్ ప్రపంచంలో ఒక్క క్లిక్​తోనే మన సమాచారం మొత్తం ఎవరి చేతుల్లోకో వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. అలాంటిది.. ఫోన్​కాల్స్, మెసేజెస్‌ ఫార్వర్డ్‌ కావడమనేది చిన్న విషయం. మరి దీన్ని ఎలా గుర్తించాలి? ఎలా అడ్డుకోవాలి??

How To Check Call Forwarding
How To Check Call Forwarding (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 4:52 PM IST

How To Check Call Forwarding is ON or Not : మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సైబర్‌ క్రైమ్స్‌ పెరుగుతూనే ఉన్నాయి. రోజూ ఎంతో మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులోపడి బ్యాంక్‌ అకౌంట్లు ఖాళీ చేసుకుంటున్నారు. ఇంకా మరెన్నో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు మరో ప్రమాదకరమైన విషయం ఏమంటే.. మీకు తెలియకుండా మీ ఫోన్​ కాల్స్ ఎవరైనా వింటూ ఉండొచ్చు! మీ మెసేజ్‌లను ఎవరైనా చదువుతూ ఉండొచ్చు. వెంటనే పసిగట్టి కనిపెట్టకపోతే ఊహించని నష్టం జరిగిపోతుంది. మరి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కాల్, మెసేజ్‌ ఫార్వార్డింగ్‌ :
మనం ఏదో పనిమీద బజారుకు వెళ్తాం. అక్కడ ఓ అపరిచితుడు వచ్చి అర్జెంట్​గా ఇంట్లో వాళ్లకు లేదా ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేయాలని అడిగితే మనం వెంటనే ఇస్తుంటాం. అవసరంలో ఉన్నారు కదా అని మనం భావిస్తాం. కానీ.. అవతలి వ్యక్తి మోసగాడు అయితే మాత్రం చాలా డేంజర్. మనకు తెలియకుండానే క్షణాల్లో మన ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్‌, మెసేజ్‌ ఫార్వార్డింగ్‌ ఆప్షన్‌ను తమకు అనుకూలంగా ఉపయోగించగలరు.

AI సపోర్ట్​తో - గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్​ఫోన్​ లాంఛ్ - ధర, ఫీచర్ల వివరాలివే! - Google Pixel 8a Phone Lunch

అదే జరిగితే.. మనకు రావాల్సిన ఫోన్​ కాల్స్, మెసేజెస్ వారి ఫోన్​కు వెళ్లిపోతాయి. అది ఎలా చేస్తారంటే.. ఫోన్​ కీ ప్యాడ్​ మీద *401* అని టైప్‌ చేసి వాళ్ల ఫోన్ నెంబర్‌ ఎంటర్‌ చేసి డయల్ చేస్తారు. అంతే.. ఇలా చేస్తే మనకు తెలియకుండానే మన కాల్స్‌, మెసేజెస్ అన్నీ కూడా ఆ నెంబర్‌కు ఫార్వర్డ్‌ అవుతుంటాయి. దీనివల్ల మన సాధారణ మెసేజెస్ మాత్రమే కాకుండా.. మన యూపీఐ, బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన అన్ని ఓటీపీలు కూడా ఆ నెంబర్‌కు ఫార్వర్డ్‌ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాల్స్‌, మెసేజెస్‌ ఫార్వర్డ్‌ అవుతున్నాయా అనేది ఎలా చెక్‌ చేసుకోవాలి?

  • ఒకవేళ మీ ఫోన్‌లో కాల్స్‌, మెసేజెస్‌ ఇప్పటికే వేరే నెంబర్​కు ఫార్వర్డ్‌ అవుతుంటే వెంటనే ఆపేయండి.
  • దీనికోసం ముందుగా మీ ఫోన్​ కీప్యాడ్​లో *#21# అని టైప్‌ చేసి, డయల్ చేయండి.
  • ఇలా చేస్తే మీ ఫోన్‌లో కాల్స్‌, మెసేజెస్‌ ఫార్వర్డ్‌ అవుతున్నాయా? లేదా అనేది స్క్రీన్​ మీద కనిపిస్తుంది.

ఆప్షన్‌ను డిసెబుల్‌ చేసుకోవాలంటే ఏం చేయాలి?

  • మీ ఫోన్‌ కాల్స్‌, మెసేజెస్‌ ఫార్వర్డ్‌ అవుతుంటే.. ఆప్షన్​ ఎనేబుల్‌ లో ఉందని చూపిస్తుంది.
  • అప్పుడు వెంటనే ఆ ఆప్షన్​ డిసేబుల్‌ చేసుకోవాలి.
  • దీనికోసం.. మీ కీప్యాడ్​లో ##002# అని టైప్‌ చేసి, డయల్ చేయాలి.
  • అంతే.. ఫార్వర్డ్‌ ఆప్షన్‌ వెంటనే డిసేబుల్‌ అయిపోతుంది.

క్రెడిట్​, డెబిట్​ కార్డ్​ యూజర్లకు అలర్ట్​ - ఈ కామన్​ 'పిన్స్​'ను వెంటనే మార్చండి - లేకుంటే ఇక అంతే! - Most Common PIN Patterns

ఇక చేతితో మొబైల్ వాడక్కర్లేదు! అంతా ఫేస్ ఎక్స్​ప్రెషన్స్​తోనే- గూగుల్ మరో సూపర్ ఫీచర్ - Google Andriod New Feature

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.