Google Photos Introduces AI Info: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం భారీగా పెరుగుతోంది. ఇది దాదాపు అన్ని రంగాలకూ వ్యాపిస్తుంది. ప్రపంచం ఏఐ వెంట పరుగులు పెడుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలూ ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నాయి. ఇలా ఏఐ టూల్స్ వినియోగం పెరుగుతున్న తరుణంలో సులువుగా ఏఐ సాయంతో ఫొటోలు, వీడియోలు రూపొందిస్తున్నారు.
దీంతో అసలు నిజమైన ఫొటో ఏదో? ఏఐ సాయంతో రూపొందించనవి ఏవో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ ఫొటోస్ సిద్ధమైంది. ఇందుకోసం గూగుల్ ఫొటోస్‌లో ఏఐ ఇన్ఫో పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఏఐ సాయంతో క్రియేట్ చేసిన ఫొటోస్ను సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.
ఈ 'ఏఐ ఇన్ఫో' సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పంచుకుంది. దీని సాయంతో ఏఐ ఫొటోలను ఈజీగా గుర్తించొచ్చని తెలిపింది. అంటే ఇకపై ఏఐ టూల్స్ ఉపయోగించి ఎడిట్ చేసే ఫొటోస్ను ఇట్టే కనిపెట్టేయొచ్చు. అయితే గూగుల్ తీసుకొచ్చిన ఏఐ టూల్స్ సాయంతో ఫొటోస్ ఎడిట్ చేస్తే మాత్రమే గుర్తించగలరని పేర్కొంది.
ఇది ఎలా పనిచేస్తుందంటే?:
- గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఫొటోస్ను ఎంచుకొని కిందకు స్క్రోల్ చేయగానే 'Details' సెక్షన్ కన్పిస్తుంది.
- అందులో ఏఐ సాయంతో రూపొందించిన ఫొటో అయితే 'Edited with Google AI' అని చూపిస్తుంది.
- ప్రముఖ ఫొటో ఎడిటింగ్ యాప్స్ అన్నీ ఏఐ ఆధారిత టూల్స్‌ను అందిస్తున్నాయి.
- యూజర్లకు మరింత మెరుగైన ఎడిటింగ్ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
- దీంతో గూగుల్ ఫొటోస్ కూడా ఇటీవలే మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్ సహా ఇతర ఏఐ టూల్స్‌ను తమ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇదిలా ఉండగా ఇటీవలే గూగుల్ తన కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ప్రభాకర్ రాఘవన్‌ను నియమించింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎవరీ ప్రభాకర్ రాఘవన్? గూగుల్ ఆయన్నే ఎందుకు కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమించుకుంది? వంటి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్- ఇకపై కంటెంట్ క్రియేటర్లపై కాసుల వర్షం..!
కొత్త బైక్ కొంటున్నారా? టీవీఎస్ రైడర్ iGo చూశారా? ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?