Google Find My Device Network : పొగొట్టుకున్న, స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్‌ను చాలా సులువుగా కనిపెట్టేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ఫీచర్‌ను 'ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్'ను ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో సోమవారం ప్రారంభించింది. అయితే ప్రస్తుతానికి కెనడా, అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్‌తో పొగొట్టుకున్న ఫోన్‌ను చాలా సులువుగా కనిపెట్టేయవచ్చు. అలాగే ఒకవేళ దొంగలు మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినా సరే దానిని ట్రాక్ చేసేవచ్చు. అది కూడా ఇంటర్నెట్, వైఫై కనెక్షన్ లేకపోయినా బ్లూటూత్‌ని ఉపయోగించి ట్రాక్ చేసేలా ఈ కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది గూగుల్.
ఈ ఫీచర్ ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ మాత్రమే కాదు, వాటితో పెయిర్ చేసిన ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్‌ను కూడా ట్రాక్ చేసుకోవచ్చట. అంతేకాదు ఆండ్రాయిడ్ ఫోన్‌తో లింక్ చేసి ఉన్న వాలెట్స్, కీస్, బైక్‌లను కూడా సులువుగా కనిపెట్టేయవచ్చని గూగుల్ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 నంచి ఆపై వెర్షన్లు ఉన్న మొబైళ్లలో మాత్రమే అందుబాటలో ఉంటుంది. పొగొట్టుకున్న వస్తువులను గుర్తించడానికి ఈ ఫీచర్లో ఐదు రకాలు మార్గాలు ఉన్నాయి. అవేంటంటే.
Locate offline devices : ఆండ్రాయిడ్ ఫోన్, ట్యాబ్లెట్‌ను ఫైండ్ మై డివైజ్‌ను ఆన్ చేయటం వల్ల ఇంటర్నెనెట్ కనెక్షన్ లేకపోయినా గుర్తించవచ్చు. అయితే పిక్సల్ 8, పిక్సల్ 8ప్రో వినియోగదారులకు మాత్రం, మొబైల్ స్వీఛ్ ఆఫ్ అయినా సరే ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.
Compatible Bluetooth Tags( బ్లూటూత్ ట్యాగ్లు) : చిపోలో, పెబుల్బీ (ట్రాకర్ డివైజ్ కంపెనీలు) లాంటి వాటితో రూపొందించిన బ్లూటూత్ ఆధారిత ట్రాకర్ ద్వారా ట్యాగ్ చేసిన కీస్, వాలెట్స్, లగేజీ వంటి వస్తువులను కూడా గుర్తించవచ్చు. అలాగే బ్లూటూత్ ట్యాగ్ వినియోగదారులను ఏవరైనా ట్రాక్ చేస్తున్నట్లయితే వారిని హెచ్చరించేలా unknown tracker alerts ఆప్షన్ కూడా ఉంది.
Find Nearby Items : వినియోగదారులు వారు పోగొట్టుకున్న వస్తువు దగ్గరగా ఉండి, దాన్ని ట్రాక్ చేయటంలో ఇబ్బంది ఉన్నప్పుడు, 'ఫైండ్ నియర్‌బై' బటన్ నొక్కితే సులభంగా కనిపెట్టవచ్చు. దీని ద్వారా కీస్, వ్యాలెట్ వంటి రోజూవారి వస్తువులను కూడా సులభంగా కనిపెట్టవచ్చు.
Pinpoint Devices at Home with nest : మనం పోగొట్టుకున్న డివైజ్‌లు మన ఇంటికి దగ్గర్లోనే ఉండవచ్చు. అలాంటప్పుడు ఫైండ్ మై డివైజ్, గూగల్ నెస్ట్ (స్పీకర్, స్క్రీన్స్, థెర్మోస్టార్ట్, వంటి గూగుల్ స్మార్ హోమ్ ప్రొడక్ట్‌లు)తో కనెక్ట్ అవుతుంది. తద్వారా పోయిన వస్తువు మన ఇంటికి ఎంత దూరంలో ఉందనే విషయం తెలుస్తుంది.
Share Accessories with Friends and Family : ఫైండ్ మై డివైజ్ యాక్సెస్‌ను స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఉండేలా చూసుకోవటం మంచిది. ఏదైనా వస్తువులు పోయినప్పుడు దానిని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
అందుకే ఆలస్యం
ఈ ఫీచర్‌ను గూగుల్ సెప్టెంబర్ 2023లోనే ప్రకటించింది. కానీ దీని కంటే ముందు సేమ్ ఫీచర్స్‌తో యాపిల్ కంపెనీ 'యాంటీ-స్టాకింగ్' ఫీచర్‌ను లాంఛ్ చేసింది. యాపిల్ కంపెనీ 2019లో మొదటిసారిగా ఎయిర్‌ట్యాగ్‌ను ప్రారంభించింది. అప్పుడు కొంత మంది వ్యక్తులు ఈ బ్లూటూత్ బేస్డ్ ట్రాకర్‌ను చట్టవిరుద్ధంగా, ఇతరులను ట్రాక్ చేయడానికి ఉపయోగించారు. దీనితో యాపిల్ కంపెనీ, తమ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఒక అలర్ట్ ఫీచర్‌ను తీసుకువచ్చింది.
అయితే ఈ ఫీచర్ కేవలం ఐఫోన్, ఐప్యాడ్లకు మాత్రమే పరిమితం అయ్యింది. తరువాత బ్లూటూత్ ఆధారిత ట్రాకర్‌ను గుర్తించి, వాటిని తొలగించడానికి యూనివర్సల్ మెకానిజంతో ముందుకు రావడానికి యాపిల్ కంపెనీ గూగుల్‌తో జతకట్టింది. శాంసంగ్, టెలీ, చిపోలో, యూఫీ సెక్యూరిటీ, పెబుల్బీ లాంటి ఇతర బ్రాండ్లు కూడా ఈ డ్రాఫ్ట్ స్పెసిఫికేషన్‌కు మద్దతునిచ్చాయి. దీంతో ఈ బ్రాండెడ్ డివైజ్‌లు ఉపయోగించే వినియోగదారులు అందరూ, తమను అనుసరించే ట్రాకర్ల గురించి అలర్ట్‌లు పొందే వీలు ఏర్పడింది. దాని కారణంగా గూగుల్ ఇప్పుడు ఫైండ్ మై నెట్వర్క్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌తో మన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే పొగొట్టుకున్న వస్తువుల లోకేషన్‌ను వస్తువు యజమానితో మాత్రమే షేర్ చేస్తుందని గూగుల్ చెబుతుంది.
అప్పులు త్వరగా తీర్చేసేందుకు సూపర్ మార్గం ఇది! - how to clear loans fast