ETV Bharat / technology

ఊహించినదానికంటే ముందుగానే ఆండ్రాయిడ్ 16- రిలీజ్​పై గూగుల్​ క్లారిటీ..! - ANDROID 16 TO RELEASE IN Q2 2025

త్వరలో ఆండ్రాయిడ్ 16 అప్​డేట్- ఫీచర్ల వివరాలివే..!

Android 16 to release in Q2 2025
Android 16 to release in Q2 2025 (Google/ Android Developer Blog)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 4, 2024, 11:45 AM IST

Android 16 to Release in Q2 2025: ఆండ్రాయిడ్ 16 అప్​డేట్ ఊహించిన దాని కంటే త్వరలోనే వస్తోంది. ఈ మేరకు గూగుల్ రిలీజ్ స్ట్రాటజీని పంచుకుంది. అయితే గత నెల అక్టోబర్​లో పిక్సెల్ మొబైల్స్​కు రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ OS తాజా వెర్షన్​లా కాకుండా, గూగుల్ తన నెక్ట్స్​ ఆండ్రాయిడ్ వెర్షన్​ను వచ్చే ఏడాది ప్రారంభంలోనే లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.

కంపెనీ దాని ఎకో సిస్టమ్ అంతటా డివైస్ లాంచ్‌ల షెడ్యూల్‌తో OSని బెటర్ ఎలైన్​ చేసేందుకు రిలీజ్ విండోను మారుస్తున్నట్లు తెలిపింది. తద్వారా మరిన్ని డివైజస్​ ఆండ్రాయిడ్ మేజర్ రిలీజ్​ను త్వరగా పొందగలుతాయని పేర్కొంది. యాప్​ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తూ యూజర్స్​కు సరికొత్త ఫీచర్లను అందించేందుకు గూగుల్ ఎప్పటికప్పుడు SDK (ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్) అందిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో గూగుల్ Q2 2025లో (సాధారణ Q3 లాంచ్ విండోకు బదులుగా) మేజర్ లాంచ్ ఉంటుందని హింట్ ఇచ్చింది. దాని తర్వాత నాల్గో త్రైమాసికంలో మైనర్ రిలీజ్ ఉంటుందని తెలిపింది. గూగుల్ Q1 2025లో ఫీచర్లు మాత్రమే అప్​డేట్​ను అనుసరించి, ఆండ్రాయిడ్ Q2లో మేజర్ SDKను అందిస్తుంది. OS వెర్షన్‌ను ఆండ్రాయిడ్ 16కి అప్‌గ్రేడ్ చేస్తుంది. గూగుల్ Q3 2025లో వేరే ఫీచర్లను మాత్రమే అప్​డేట్​ చేస్తుంది. తర్వాత Q4 2025లో మైనర్ SDK రిలీజ్ అవుతుంది.

ఆండ్రాయిడ్​లో మేజర్, మైనర్ SDK రిలీజెస్ రెండూ వరుసగా Q2, Q4లో రావడానికి సెట్ చేశారు. ఇందులో కొత్త డెవలపర్ APIలు కూడా ఉంటాయి. Q2 మేజర్ రిలీజ్ యాప్స్​ను ప్రభావితం చేసే ప్రవర్తన మార్పులు ఉంటాయి. ఇవి ఆండ్రాయిడ్​లో యాప్‌లు ఎలా పనిచేస్తాయనే దానిపై ప్రభావం చూపుతాయి. Q4 రిలీజ్ కొత్త డెవలపర్ APIలతో పాటు ఆప్టిమైజేషన్స్, బగ్ పరిష్కారాలతో పాటు ఫీచర్ అప్​డేట్స్​ను అందుకుంటుంది. ముఖ్యంగా Q4 మైనర్ అప్‌డేట్‌లో యాప్ ఇంపాక్టింగ్ ప్రవర్తన మార్పులు ఉండవు.

అదేసమయంలో Q1, Q3 రిలీజెస్​లో కంటిన్యూస్ క్వాలిటీ కోసం ఇంక్రిమెంటల్ అప్​డేట్స్ అందిస్తారు.​ Q2 విడుదలను వీలైనన్ని ఎక్కువ డివైజస్​లలో తీసుకురావడానికి డివైజస్ పార్టనర్స్​తో యాక్టివ్​గా పని చేస్తున్నామని గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ల బ్లాగ్​లో కంపెనీ ఓ పోస్ట్​లో పేర్కొంది.

2025 వీటి రిలీజెస్ కోసం డెవలపర్​లతో సన్నిహితంగా సహకరించాలని యోచిస్తోందని, పిక్సెల్‌లో ప్రారంభ టెస్టర్‌ల కోసం OTA బీటా రిలీజెస్, డెవలపర్‌ల కోసం డౌన్‌లోడ్ చేసుకోదగిన సిస్టమ్ ఇమేజెస్, టూల్స్‌తో టెస్టింగ్, ఫీడ్‌బ్యాక్ కోసం త్రైమాసిక అప్‌డేట్‌లను అందజేస్తుందని గూగుల్ పేర్కొంది.

ఆండ్రాయిడ్ 16 విడుదలైన తర్వాత, గూగుల్ Q3 2025లో అదనపు అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది. ఆ తర్వాత Q4 2025 లో రెండో మైనర్ ఆండ్రాయిడ్ 16 SDK విడుదల అవుతుంది. ఈ విడుదలలో కొత్త APIలు, ఫీచర్లు ఉంటాయని గూగుల్ చెబుతోంది. అయితే ఇది కొత్త ప్రవర్తనను పరిచయం చేయదు. యాప్‌లపై ప్రభావం చూపే మార్పులు మాత్రమే తీసుకువస్తుంది.

'వివో X200 ప్రో మినీ'కి పోటీగా ఒప్పో నయా ఫోన్!- రిలీజ్ ఎప్పుడంటే?

ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్- మీ వద్ద ఈ మోడల్ ఫోన్ ఉందా?- అయితే ఫ్రీ సర్వీస్​ ఆఫర్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.