Gboard Scan To Text Feature : గూగుల్ తన యూజర్స్ కోసం ఓ సూపర్ అప్డేట్ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ కీ-బోర్డ్ (జీ-బోర్డ్) తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో మనకి నచ్చిన, కావాల్సిన ఎటువంటి సమాచారాన్నైనా స్కాన్ చేసి క్షణాల్లో మన స్మార్ట్ ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు. మరి ఈ జీ-బోర్డ్ స్కాన్ ది టెక్స్ట్ ఫీచర్‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Use Gboard's Scan Text Feature :
- ముందుగా మీ గూగుల్ కీ-బోర్డును అప్డేట్ చేయండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్లో v13.9 బీటా లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అది ఉంటేనే ఈ స్కాన్ ఫీచర్ పనిచేస్తుంది.
- ఆ తర్వాత మీ ఫోన్ కెమెరాకు జీబోర్డ్ యాక్సెస్ ఎనేబుల్ చేయండి.
- ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేయాలనుకున్న టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసుకోండి.
- అనంతరం జీబోర్డ్‌లో ఉన్న 'More Tools' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ ఉన్న ఆప్షన్స్‌లో 'Scan Text'ను ఎంచుకోండి.
- ఇప్పుడు మీకు కావాల్సిన టెక్స్ట్‌ను లేదా సమాచారాన్ని క్యాప్చర్ చేయండి.
ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి
- మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న టెక్స్ట్ లేదా సమాచారం పైనే మీ ఫోన్ కెమెరాను పాయింట్ చేసి ఉంచండి.
- హాఫ్-స్క్రీన్ వ్యూఫైండర్ లోపల టెక్స్ట్ ఉన్నప్పుడు మాత్రమే క్యాప్చర్ బటన్‌ను ప్రెస్ చేయండి.
- అప్పుడు క్యాప్చర్ చేసిన సమాచారాన్ని గూగుల్ కీ-బోర్డ్ బ్లూ కలర్లో హైలైట్ చేస్తుంది.
టెక్స్ట్‌ను ఇన్సర్ట్ చేయండి
- OCR సాయంతో జీబోర్డ్ హైలైట్ చేసిన సమాచారాన్ని సెలెక్ట్ చేసుకోండి.
- ఇప్పుడు 'Insert' బటన్‌పై నొక్కండి.
- అనంతరం కాపీ చేసిన టెక్స్ట్‌ను మీకు కావాల్సిన యాప్ లేదా మాధ్యమంలో పేస్ట్ చేసుకోవచ్చు. దీనిని ఎడిట్ కూడా చేసుకోవచ్చు.
- అయితే మీరు ఇన్పుట్ కోసం వినియోగించిన ఫొటోను లేదా సమాచారం జీబోర్డ్‌లో సేవ్ కాదు.
జీబోర్డ్ స్కాన్ టెక్స్ట్ ఫీచర్ ఇలా సహాయపడుతుంది!
- విదేశీ సంజ్ఞలు, మెనూ వివరాలను మీకు అర్థమయ్యే రీతిలోకి అనువదిస్తుంది. మీరు ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు లేదా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు మీకు తెలియని భాషలో ఉన్న సమాచారాన్ని సులువుగా మీకు అర్థమయ్యేలా ట్రాన్‌లేట్ చేస్తుంది. ఇందుకోసం మీరు మ్యానువల్‌గా టైప్ చేయాల్సిన పని ఉండదు.
- ఏదైనా పుస్తకం లేదా మ్యాగజైన్లో మీకు నచ్చిన కోట్స్ లేదా ఇతర సమాచారాన్ని నోట్ చేసుకోవాలని అనుకుంటే మీరు మ్యానువల్‌గా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం గూగుల్ కీబోర్డ్‌ను దానిపై ఉంచి స్కాన్ చేసి క్యాప్చర్ చేస్తే మీరు చేయాల్సిన పనిని జీబోర్డ్ చేస్తుంది.
- నెట్‌వర్కింగ్ ఈవెంట్ లేదా ఏవైనా వ్యాపార సంబంధమైన సమావేశాల్లో పాల్గొనే సమయంలో మీకు కావాల్సిన సంస్థల వివరాలన్నింటినీ మ్యానువల్‌గా నోట్ చేసుకునే సందర్భంలో ఈ జీబోర్డ్ స్కాన్ ఫీచర్ ఉపయోగపడుతుంది. కేవలం మీకు కావాల్సిన టెక్స్ట్‌ను క్యాప్చర్ చేయండి. గూగుల్ దానిని ఎడిటెబుల్ టెక్స్ట్ గానూ మారుస్తుంది. దాంతో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకొని సేవ్, షేర్ చేసుకోవచ్చు.
- ఏదైనా ప్రోడక్ట్ లేబుల్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేసి సమాచారాన్ని పొందేందుకు లేదా చదివేందుకు కూడా జీబోర్డ్ స్కాన్ ఫీచర్ ఎంతో సహాయపడుతుంది. ఉత్పత్తిలోని పోషక విలువలు, ప్యాకేజింగ్ వివరాలన్నింటినీ తెలుసుకోవాలన్నా ఈ జీబోర్డ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
- క్లాస్ రూమ్స్‌లో లేదా ఏదైనా మీటింగ్‌లలో కూడా ఈ జీబోర్డ్ స్కాన్ అండ్ రీడ్ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. వైట్‌బోర్డ్‌పై రాసిన సమాచారం లేదా డయాగ్రామ్‌లను మీ మొబైల్లో క్యాప్చర్ చేసి మీకు నచ్చిన ప్రదేశంలో డిజిటల్ టెక్స్ట్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. అనంతరం మీకు వీలున్నప్పుడు వాటిని తెరిచి చూసుకోవచ్చు.
- వైబ్సైట్లు లేదా ఏవైనా సీరియల్ నెంబర్లను మ్యానువల్‌గా టైప్ చేసే బదులు గూగుల్ కీబోర్డ్ స్కాన్ ఫీచర్‌ను వాడవచ్చు. అతి కష్టమైన యూఆర్ఎల్లు, లెంథీ కోడ్లను కూడా ఈ నయా అప్డేట్ క్యాప్చర్ చేస్తుంది.
రూ.15,000 బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే!
మరో 3 రోజుల్లో వన్‌ప్లస్ వాచ్ 2 లాంఛ్ - కేవలం రూ.99కే బుకింగ్!