ETV Bharat / technology

ఇకపై నో పాస్​వర్డ్స్ - 'పాస్​ఫ్రేజ్'​ పెట్టుకుంటే చాలు - ఫుల్​ సెక్యూరిటీ గ్యారెంటీ! - Passphrases For Extra Security - PASSPHRASES FOR EXTRA SECURITY

Passphrases For Extra Security : మనం ఆన్​లైన్​ బ్యాంకింగ్ కోసం, సోషల్ మీడియా అకౌంట్ల కోసం పాస్​వర్డ్​లను ఏర్పాటు చేసుకుంటాం. అయితే హ్యాకర్లు వాటిని చాలా సులభంగా క్రాక్ చేసేస్తున్నారు. అందుకే పాస్​వర్డ్​లకు బదులుగా 'పాస్​ఫ్రేజ్​' (passphrases)లు పెట్టుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

What Is A Passphrase?
Passphrases For Extra Security (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 5:27 PM IST

Passphrases For Extra Security : టెక్నాలజీ పెరిగిన తరువాత ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్​లైన్​లోనే చేసేస్తున్నాం. యువతీ, యువకులు అయితే సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారు. అందుకే సైబర్​ క్రిమినల్స్ వీరందరినీ టార్గెట్ చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి, ఆన్​లైన్ బ్యాంకింగ్ కోసం ఉపయోగించే​ పాస్​వర్డ్​లను సులభంగా క్రాక్ చేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల పాస్​వర్డ్​లను కూడా చాలా సింపుల్​గా కనిపెట్టేస్తున్నారు.

పాస్​కీ అథంటికేషన్​ (passkey authentication) అందుబాటులోకి వచ్చినప్పటికీ, దీనిని అందరూ ఉపయోగించుకోవడం లేదు. కొందరు స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లను పెడుతుంటారు. కానీ వాటిని గుర్తుంచుకోలేక ఇబ్బందిపడుతూ ఉంటారు. అందుకే చాలా మంది సింపుల్​గా ఉండే పాస్​వర్డ్​లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంటే రోజు ఉపయోగించే, డిక్షనరీలో ఉండే పదాలనే ఎక్కువగా వాడుతుంటారు. దీనిని అవకాశంగా తీసుకుని సైబర్​ నేరగాళ్లు 'డిక్షనరీ ఎటాక్స్' చేస్తున్నారు.

మరికొందరు f7y88956wo*NLK# లాంటి స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లు పెడుతుంటారు. కానీ అన్ని అకౌంట్లకు ఒకే పాస్​వర్డ్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూడా ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఫిషింగ్ సైట్లలో మీ పాస్​వర్డ్ ఎంటర్ చేయగానే, దానిని సైబర్ విలన్స్ చాలా సులువుగా కనిపెట్టేస్తారు. అలాగని ప్రతి అకౌంట్​కు వేర్వేరు స్ట్రాంగ్ పాస్​వర్డ్స్​ పెట్టుకుంటే, వాటిని గుర్తుంచుకోవడం చాలా కష్టమైపోతుంది. అందుకే ఇలాంటి సమస్యలను అధిగమించడానికి 'పాస్​ఫ్రేజ్' ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

What Is A Passphrase?
ఫ్రేజ్​ను తెలుగుతో పదబంధం అంటారు. అంటే కొన్ని పదాల కలయిక అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు that's not a big deal అనే ఫ్రేజ్ ఉంది. దీనిని మీరు లెటర్స్, నంబర్స్​, స్పెషల్ క్యారెక్టర్స్​లోకి మార్చాలి. అంటే 2081#TON127deaL అని మార్చుకోవాలి. దీనినే leetspeak అని అంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ క్రియేట్ చేసిన పాస్​ఫ్రేజ్​లో not అనే పదాన్ని TON అని మార్చి రాయడం జరిగింది. ఇలా చేయడం వల్ల, హ్యాకర్ మీ పదబంధాన్ని తెలివిగా కనిపెట్టినా, దానిని క్రాక్ చేయడం చాలా కష్టమవుతుంది.

చూశారుగా, ఈ విధంగా మీకు బాగా గుర్తుండే పదబంధాన్ని పాస్​ఫ్రేజ్​గా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లు దీనిని ఎప్పటికీ కనిపెట్టలేరు. అలాకాకుండా మీ పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, ఫోన్​ నంబర్లు, లక్కీ నంబర్లు పెట్టుకుంటే, వాటిని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు.

పరిమితులు ఉన్నాయి!
కొన్ని వైబ్​సైట్లు లాంగ్ పాస్​వర్డ్​లను సపోర్ట్ చేయవు. అంటే పాస్​వర్డ్ లెంగ్త్​ లిమిట్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు అనుకున్న ఫ్రేజ్​లోని మొదటి అక్షరాలను తీసుకుని, వాటితో పాస్​ఫ్రేజ్ క్రియేట్ చేసుకోవాలి.

కొన్ని ఫిషింగ్​ సైట్స్​ ఉంటాయి. ఇవి చాలా కఠినమైన పాస్​వర్డులు, పాస్​ఫ్రైజ్​లనైనా చాలా ఈజీగా గుర్తిస్తాయి. ఉదాహరణకు https://www.paypal.com అనేది ఒక ఒరిజినల్ సైట్. కానీ సైబర్ ఫ్రాడ్స్ www.pyapal.com అనే నకిలీ ఫిషింగ్ సైట్​ను క్రియేట్ చేస్తారు. మీరు కనుక ఓవర్​లుక్​లో దానిలోకి లాగిన్ అయితే - ఇక అంతే సంగతులు. కనుక ఫిషింగ్ సైట్స్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పర్సనల్ కంప్యూటర్​లో ఎంత లాంగ్ పాస్​ఫ్రేజ్​ను అయినా టైప్ చేయవచ్చు. కానీ మొబైల్ ఫోన్స్​, ట్యాబ్స్​లో వాటిని టైప్ చేయడం వీలుపడకపోవచ్చు. కనుక మీరు పాస్​వర్డ్ మేనేజర్​ను వాడుకోవడం మంచిది. దీనికి మీరు ఒక మాస్టర్​ పాస్​వర్డ్​ను పెట్టుకుంటే చాలు. అది మీ అన్ని పాస్​వర్డ్​లను సురక్షితంగా ఉంచుతుంది.

రూ.15వేల బడ్జెట్లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Mobile Phones Under 15000

మీరు డౌన్​లోడ్ చేసే యాప్స్‌ అన్నీ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా! - Mobile App Safety Check

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.