Flying Taxis Launch: ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కారణంగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా వేధిస్తోంది. నగరవాసులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఎన్ని ఫ్లై ఓవర్లు, స్కై వేలు, హై వేలు, అండర్‌పాస్‌లు నిర్మించినా పెరుగుతున్న జనాభాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సిద్ధమైంది.
త్వరలోనే ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా ఎగిరే ట్యాక్సీలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయని పేర్కొంది. దీంతో ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు తీవ్రమైన రద్దీతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు నగరవాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి రిలీఫ్ లభించనుంది.
ఈ నేపథ్యంలో తక్కువ ఎత్తులో పర్యావరణరహిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు విషయాన్ని కంపెనీ సమాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. విమానాశ్రయం, ఎలక్ట్రానిక్ సిటీ.. ఇలా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయని పేర్కొంది.
Kempegowda International Airport Bengaluru (BLR Airport) and Sarla Aviation have signed a statement of collaboration to explore innovative and sustainable air mobility solutions. This partnership marks a new chapter in our commitment to Advanced Air Mobility solutions developed… pic.twitter.com/ZGlPHxlV1Q
— BLR Airport (@BLRAirport) October 11, 2024
"ప్రస్తుతం ఇందిరానగర్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలంటే 1.50 నిమిషాలు పడుతోంది. అదే ఎగిరే ట్యాక్సీలతో అయితే కేవలం 5 నిమిషాలు చాలు" అని సార్లా ఏవియేషన్ సీఈఓ అడ్రియన్ ష్మిత్ అన్నారు. ఇదో గేమ్ ఛేంజర్‌గా ఆయన అభివర్ణించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఆయన తెలిపారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చేందుకు 2- 3 సంవత్సరాలు పడుతుందన్నారు.
విమానాలు, హెలికాప్టర్లతో పోల్చుకుంటే ఈ ఎగిరే ట్యాక్సీలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి సాధారణ హెలికాప్టర్ల కంటే వేగంగా ప్రయాణించడమే కాకుండా వాతావరణానికి ఎలాంటి హాని కలిగించవు. కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నారు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ సమస్యతో ఇబ్బంది ఎదుర్కొంటున్న బెంగళూరు నగరవాసులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మరోవైపు అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా సేవలు తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, పర్యావరణానికి మేలు చేసేవి కావడంతో అందరూ వీటిపై మొగ్గు చూపుతున్నారు.
త్వరలో మార్కెట్లోకి యాపిల్ స్మార్ట్ గ్లాసెస్- మెటాకు పోటీగా అదిరే ఫీచర్లు..!
ఈ స్కిల్స్ లేకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జాబ్స్ ఔట్..!- విశ్లేషకుల హెచ్చరిక