BMW Motorrad India: ప్రీమియం బైక్ తయారీ సంస్థ బిఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా తన అన్ని మోడల్స్ ధరలను 2.5 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సవరించిన ధరలు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించింది. ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగానే తమ శ్రేణి ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది.
BMW గ్రూప్ ఇండియా అనుబంధ సంస్థగా ఏప్రిల్ 2017లో బిఎండబ్ల్యూ మోటోరాడ్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ క్రమంలో 'BMW G 310 RR', 'BMW G 310 R', 'BMW S 1000 RR', 'BMW G 310 GS', 'BMW M 1000 RR', 'BMW CE 02', 'BMW CE 04' వంటి ఖరీదైన బైకులను, స్కూటర్లను మార్కెట్లో లాంఛ్ చేసింది.
BMW ఇండియా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో స్థానికంగా తయారు చేసిన మూడు 310 మోడల్స్‌ను విక్రయిస్తోంది. అవి 'BMW G 310 R', 'BMW G 310 GS', 'BMW G 310 RR'. దీని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) లైనప్‌లో.. M మోడల్స్, అడ్వెంచర్ మోటార్‌సైకిల్స్, రోడ్‌స్టర్స్, టూరింగ్ బైక్స్‌తో పాటు అనేక ఇతర మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. వీటితో పాటు కంపెనీ 'CE 02', 'CE 04' పేరుతో మరో రెండు మోడల్ ఎలక్ట్రిక్ టూ- వీలర్స్‌ను కూడా విక్రయిస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలోని అన్ని BMW టూ- వీలర్స్ స్టాండర్డ్‌గా మూడేళ్ల వారంటీతో వస్తున్నాయి. దేశంలో కంపెనీ లాస్ట్ టూ- వీలర్ 'CE 02' ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ. 4.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ నుంచి చౌకైన ద్విచక్ర వాహనం 'BMW G 310 R'. మార్కెట్లో దీని ధర రూ. 2.90 లక్షలు. ఇక కంపెనీ అత్యంత ఖరీదైన మోటార్‌సైకిల్ 'M1000 RR'. దీని ధర రూ. 49 లక్షలు (ఎక్స్-షోరూమ్). వీటన్నింటి ధరలు జనవరి 1 నుంచి గణనీయంగా పెరుగనున్నాయి. సవరించిన ధరలు బిఎండబ్ల్యూ ఇండియా పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలకూ వర్తిస్తాయని గమనించాలి.
2025లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?- ఇది ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందంటే..?
ఇండియాలో 'బ్లాక్ ఫ్రైడే సేల్' సందడి- అమెజాన్‌లో ఖరీదైన ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్..!