ETV Bharat / technology

మంచి వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ కొనాలా?- మార్కెట్లో టాప్ ఇవే! - Best Waterproof Smart Watches

Best Waterproof Smart Watches in India: ఇది స్మార్ట్ యుగం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లే కాదు స్మార్ట్ వాచ్‌ల విక్రయాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాటిలో వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్​లకు మరింత డిమాండ్ ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరి దగ్గర చూసినా ఈ స్మార్ట్ వాచ్​లు ఉంటున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా మంచి వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న టాప్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్​లు ఇవే.

Best_Waterproof_Smart_Watches_in_India
Best_Waterproof_Smart_Watches_in_India (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 1, 2024, 3:41 PM IST

Best Waterproof Smart Watches in India: టెక్నాలజీ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఎప్పటికప్పుడు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. కార్లు, బైక్​లు, మొబైల్ ఫోన్స్ ఈ కోవలోకే వస్తాయి. ఇవి ఎప్పటికప్పుడు కొంగొత్త మెరుగులు దిద్దుకుని స్టైలిష్ లుక్​లో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే వీటికేం తీసిపోకుండా స్మార్ట్​ వాచ్​లు కూడా అదిరే ఫీచర్స్​తో మనముందుకు వస్తున్నాయి. వీటి ద్వారా హార్ట్​ బీట్​, ఆక్సిజన్ లెవల్స్​ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్​లో కూడా అందుబాటులో ఉండటంతో యువత ఎక్కువగా వీటిపై ఆసక్తి చూపుతోంది. అయితే మార్కెట్లో వివిధ బ్రాండ్ల స్మార్ట్ వాచ్​లు అందుబాటులో ఉండటంతో ఏది తీసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ ధరలో మార్కెట్లో ఉన్న టాప్ స్మార్ట్ వాచ్​లు, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Noise Vivid Call 2 Smart Watch: ఈ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్​ను నాయిస్ ఫిట్ ప్రైమ్ యాప్​తో కనెక్ట్ చేయవచ్చు. ఇది 1.85 అంగుళాల డిస్​ప్లేను కలిగి ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల పాటు పనిచేస్తుంది. ఇది ఎప్పటికప్పుడు మీ హార్ట్ బీట్, నిద్ర, స్ట్రెస్ లెవల్స్​ను ట్రాక్ చేస్తుంది.

2. SKG Smart Watch: ఈ ఎస్ కేజీ స్మార్ట్ వాచ్ 1.7 అంగుళాల హెచ్​డీ టచ్​ స్క్రీన్​తో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 8 రోజుల పాటు పనిచేస్తుంది. మనకు ఎంతో ఉపయోగపడే 14 స్పోర్ట్స్ మోడ్ల్​ ఇందులో ఉన్నాయి.

3. AQFIT W6 smart watch: ఏక్యూఫిట్ డబ్ల్యూ6 స్మార్ట్ వాచ్ 1.69 అంగుళాల డిస్​ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. వాతావరణ సూచనలతో పాటు మెసేజెస్, కాల్స్, రోజువారీ రిమైండర్లను అందిస్తుంది. వాటర్‌ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్‌గానూ పనిచేస్తుంది. హార్ట్ బీట్, నిద్ర, కేలరీలు, శ్వాస తదితర వాటిని ఇది ట్రాక్ చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. మహిళల కోసం 15 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

  • బ్రాండ్: ఏక్యూఫిట్
  • డిస్​ప్లే: 1.69 అంగుళాలు
  • స్పెషాలిటీ: వాటర్‌ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్‌
  • ధర: రూ. 1,620

4. Fire-Boltt Ninja 3 Plus: ఫైర్​ బోల్ట్ నింజా 3 ప్లస్ వాచ్ 1.83 అంగుళాల డిస్‌ప్లేతో మార్కెట్లో అందుబాటులో ఉంది. 240 x 284 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యంతో లభిస్తుంది. ఇందులో ఇన్‌బిల్ట్ గేమ్స్, 118 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. . దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు పనిచేస్తుంది. దీనిలో స్విమ్మర్స్ కోసం స్మార్ట్ హెల్త్ అసిస్టెంట్‌ ఫీచర్ ఉంది. ఇది ఎస్పీO2 లెవల్స్, హార్ట్ బీట్, నిద్రను ట్రాక్ చేస్తుంది.

5. FastTrack Limitless FS2 Plus: ఈ స్మార్ట్​ వాచ్ 2.01 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు ఎస్పీO2 లెవల్స్, హార్ట్ బీట్, నిద్రను ట్రాక్ చేస్తుంది. ఈ వాచ్​లో 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, ఏఐ కోచ్, ఆటో మల్టీస్పోర్ట్ రికగ్నిషన్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీన్ని చార్జింగ్ చేస్తే 5 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు.

  • బ్రాండ్: ఫాస్ట్‌ ట్రాక్
  • డిస్‌ప్లే: 2.01 అంగుళాలు
  • స్పెషాలిటీ: వాటర్ రెసిస్టెంట్
  • ధర: రూ. 1,699

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.