Best Health Tracking Smartwatch : నేటి యువతకు స్మార్ట్‌వాచ్‌లు అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యువతీయువకులకు మాత్రమే కాదు, పెద్దవాళ్లకు కూడా ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అతి తక్కువ ఖర్చుతో, హెల్త్ మోనిటరింగ్ చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయి. వాస్తవానికి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంతో అందరూ విసిగిపోతున్నారు. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇలాంటి వారు తమ రోజువారీ పనులను, చేసే వ్యాయామాలను ట్రాక్ చేసుకోవడానికి స్మార్ట్‌వాచ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా హార్ట్ రేట్, బీపీ, స్లీప్ ట్రాకింగ్, క్యాలరీ కౌంట్, శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవడం సహా, ఎన్నో ఆరోగ్య విషయాలను వీటి ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
1. Apple Watch Series 8 : యాపిల్ వాచ్ సిరీస్ 8 ఫిట్నెస్ ఫ్రీక్స్కు బాగా ఉపయోగపడుతుంది. ఈ వాచ్‌లో అధునాతన సెన్సార్‌లు ఉంటాయి. ధర కాస్త ఎక్కువైనప్పటికీ ఈ స్మార్ట్‌వాచ్‌లో బోలెడు మంచి ఫీచర్లు ఉన్నాయి.
- బ్రాండ్ : యాపిల్
- మోడల్ : సిరీస్ 8
- సైజ్ : 45 మిల్లీమీటర్లు
- కేస్ మెటీరియల్ : మిడ్నైట్ అల్యూమినియం
- బ్యాండ్ మెటీరియల్ : మిడ్నైట్ స్పోర్ట్ బ్యాండ్
- డిస్ప్లే : ఆల్వేజ్ ఆన్ రెటీనా డిస్ప్లే
- హెల్త్ ఫీచర్లు : బ్లడ్ ఆక్సిజన్ & ఈసీజీ యాప్స్, స్లీపింగ్ స్టేజెస్ ట్రాకింగ్
- కంపాటబిలిటీ : ఐఫోన్8 లేదా లేటర్ లేటెస్ట్ iOS వెర్షన్
- ధర - రూ.30,900
2. Samsung Galaxy Watch 6 : ఈ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6లో బోలెడు ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్స్ ఉన్నాయి. దీనితో బీపీ, హార్ట్‌బీట్, ఈసీజీ, స్లీపింగ్ స్టేజెస్ ట్రాక్ చేసుకోవచ్చు.
- బ్రాండ్ : శాంసంగ్
- మోడల్ : గెలాక్సీ వాచ్
- సైజ్ : 40 మిల్లీమీటర్లు
- కనెక్టివిటీ : బ్లూటూత్
- కలర్ : గ్రాఫైట్
- స్క్రీన్ సైజ్ : 4 సెంటీ మీటర్లు
- కంపాటబిలిటీ : ఆండ్రాయిడ్
- హెల్త్ ఫీచర్లు : బీపీ మానిటరింగ్, ఈసీజీ, స్లీపింగ్ స్టేజ్ ట్రాకింగ్
- ధర : రూ.29,999
3. Garmin Venu 2S : ఈ గార్మిన్ వేణు 2ఎస్ స్మార్ట్‌వాచ్ ప్రకాశవంతమైన అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. సాంగ్స్ వినడం కోసం వైర్లెస్ హెడ్ ఫోన్స్‌తో దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు.
- బ్రాండ్ : గార్మిన్
- మోడల్ : వేణు 2ఎస్
- సైజు : 40మిల్లీ మీటర్లు
- స్టైల్ : మోడ్రన్
- కలర్ : లైట్ శాండ్
- స్క్రీన్ సైజ్ : 1.3 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ : 10 రోజులు
- హెల్త్ ఫీచర్లు : థర్మోమీటర్, గైరో స్కోప్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, జీపీఎస్
- ధర : రూ.37,990
4. Redmi Watch 3 Active : బడ్జెట్లో స్మార్ట్‌వాచ్ కొనాలనుకునేవారికి రెడ్మీ వాచ్ 3 యాక్టివ్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది మంచి బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.
- బ్రాండ్ : రెడ్మీ
- మోడల్ : రెడ్మీ వాచ్ 3
- సైజు : 46 మిల్లీ మీటర్లు
- స్టైల్ : మోడ్రన్ 3 యాక్టివ్ ప్లాటినం గ్రే
- కలర్ : గ్రే
- స్క్రీన్ సైజ్ : 1.83 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ : 12 రోజులు
- హెల్త్ ఫీచర్లు : యాక్టివిటీ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటర్, హార్ట్‌బీట్ రేట్
- ధర : రూ.2,450
5. Amazfit T-Rex Ultra : ఈ అమాజ్‌ఫిట్ స్మార్ట్‌వాచ్ బ్యాటరీ సామర్థ్యం బాగుంటుంది. అలాగే ఇది -30 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పనిచేస్తుంది. బడ్జెట్లో స్మార్ట్‌వాచ్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
- బ్రాండ్ : అమేజ్‌ఫిట్
- స్పెషల్ ఫీచర్స్ : జీపీఎస్
- డిస్ప్లే: హెచ్డీ అమోలెడ్
- వాటర్ రెసిస్టెన్స్ : అప్ టూ 100 మీటర్లు
- బ్యాటరీ లైఫ్ : 20 రోజులు
- హెల్త్ ఫీచర్లు : గైరోస్కోప్, బారోమేటిక్ ఆల్టీమీటర్
- ధర : రూ.8,494
రూ.1000 బడ్జెట్లో మంచి ఇయర్‌బడ్స్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Earbuds Under 1000