ETV Bharat / technology

రూ.2000 బడ్జెట్లో మంచి ఫిట్​నెస్​ ట్రాకర్​ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్ ఇవే! - Best Fitness Bands Under 2000

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 5:14 PM IST

Best Fitness Bands Under 2000 : మీరు మంచి ఫిట్​నెస్ ట్రాకర్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.2000 మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం బెస్ట్ ఫీచర్స్​తో అందుబాటులో ఉన్న టాప్​-5 ఫిట్​నెస్​ బ్యాండ్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

top 5 Fitness trackers Under 2000
Best Fitness Bands Under 2000 (ETV Bharat)

Best Fitness Bands Under 2000 : నేటి జీవన శైలి వల్ల మనుషుల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే చాలా మంది ఫిట్​నెస్​పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఊబకాయం, రక్తపోటు, చక్కెర వ్యాధి లాంటివి రాకుండా ఉండేందుకు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నారు. దీనితోపాటు ప్రతీ రోజూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లాంటివి చేస్తున్నారు. మరికొందరు జిమ్​కు వెళ్లి వర్క్​అవుట్స్​ చేస్తూ ఫిట్​గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని, ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు అన్నీ లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఫిట్​నెస్​ బ్యాండ్​లు లేదా ఫిట్​నెస్​ ట్రాకర్లను రూపొందించి మార్కెట్లోకి తెస్తున్నాయి. వీటిలో హార్ట్​ రేట్​ & బ్రీథింగ్​ మోనిటరింగ్​, కాలరీస్​ బర్న్​, కార్డియో ఫిట్​నెస్​, స్లీప్​ ట్రాకింగ్​ లాంటి ఎన్నో ఫీచర్లు ఉంటున్నాయి. మరి మీకు కూడా ఫిట్​నెస్​ బ్యాండ్స్​పై ప్రత్యేక ఆసక్తి ఉందా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్​లో మంచి ఫీచర్స్​ కలిగి ఉన్న టాప్​-5 ఫిట్​నెస్ బ్యాండ్లపై ఓ లుక్కేద్దాం రండి.

1. Honor Band 5i : ఫిట్​నెస్​పై ప్రత్యేక ఆసక్తి ఉన్నవాళ్లకు 'హానర్​ బ్యాండ్​ 5ఐ' మంచి ఆప్షన్ అవుతుంది. బ్లూటూత్​ 4.2తో దీనిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లతో అనుసంధానం చేసుకోవచ్చు. మార్కెట్లో ఈ ఫిట్​నెస్ బ్యాండ్ ధర సుమారుగా రూ.1999 ఉంటుంది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

  • 2.44 సెం.మీ ఎల్​సీడీ డిస్​ప్లే
  • 91 mAh బ్యాటరీ
  • బ్యాటరీ లైఫ్​ - సుమారు 7 రోజులు
  • రెక్టాంగ్యులర్​, ఫ్లాట్ డయల్​
  • కాలరీస్​ ఇన్​టేక్/ బర్న్​డ్​
  • సెన్సార్స్​ : ఆప్టికల్ హార్ట్​ రేట్ సెన్సార్​, పెడోమీటర్​, ఎస్​పీఓ2 సెన్సార్​

2. OnePlus Band Steven Harrington Edition : తక్కువ ధరలో మంచి బ్రాండెడ్​ ఫిట్​నెస్ ట్రాకర్ కొనాలని అనుకునేవారికి 'వన్​ప్లస్​ బ్యాండ్ స్టీవెన్ హారింగ్టన్ ఎడిషన్' మంచి ఆప్షన్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్​ కంపాటిబిలిటీతో ఇది వస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1,799 ఉంటుంది. దీనిలో ఫీచర్స్​ ఎలా ఉన్నాయంటే?

  • 2.79 సెం.మీ అమోలెడ్​ డిస్​ప్లే
  • 100 mAh బ్యాటరీ
  • బ్యాటరీ లైఫ్ - 14 రోజులు
  • IP68 సర్టిఫికేషన్​
  • రెక్టాంగ్యులర్​, ఫ్లాట్​ డయల్​
  • సెన్సార్స్​ : యాక్సిలెరోమీటర్​, గైరో, ఆప్టికల్ హార్ట్ రేట్​ సెన్సార్​, ఎస్​పీఓ2 సెన్సార్​

3. Noise ColorFIT 2 : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫిట్​నెస్ ట్రాకర్లలో నాయిస్​ కలర్​ఫిట్​ 2 ఒకటి. దీని ధర సుమారుగా రూ.1,699 ఉంటుంది. ఇది కూడా ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ కంపాటిబిలిటి కలిగి ఉంటుంది. దీని స్పెక్స్ ఎలా ఉన్నాయంటే?

  • 2.44 సెం.మీ ఎల్​సీడీ డిస్​ప్లే
  • బ్లూటూత్​ 4.0 కనెక్టివిటీ
  • 90 mAh బ్యాటరీ
  • IP68 సర్టిఫికేషన్​
  • రెక్టాంగ్యులర్​, ఫ్లాట్ డయల్​
  • కాలరీస్​ ఇన్​టేక్​/ బర్న్​డ్​
  • సెన్సార్స్​ : మోషన్​, ఆప్టికల్ హార్ట్​రేట్​ సెన్సార్​, పెడోమీటర్​

4. Fastrack Reflex Beat : ఇండియాలో మోస్ట్ పాపులర్​ ఫిట్​నెస్​ ట్రాకర్లలో ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ బీట్ ఒకటి. తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఫిట్​నెస్ బ్యాండ్ కావాలని అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1,645 ఉంటుంది. దీని ఫీచర్స్​ ఎలా ఉన్నాయంటే?

  • ఓఎల్​ఈడీ డిస్​ప్లే
  • బ్లూటూత్​ 4.0 కనెక్టివిటీ
  • బ్యాటరీ లైఫ్ - 5 రోజులు
  • రెక్టాంగ్యులర్, ఫ్లాట్ డయల్​
  • కాలరీస్​ ఇన్​టేక్​/ బర్న్​డ్​
  • సెన్సార్స్​ : యాక్సిలెరోమీటర్, ఆప్టికల్​ హార్డ్ రేట్​ సెన్సార్​

5. Lenovo Smart Band HW01 : తక్కువ బడ్జెట్లో పెర్ఫెక్ట్​ ఫిట్​నెస్ ట్రాకర్​ కొనాలని అనుకునేవారికి 'లెనోవా స్మార్ట్​ బ్యాండ్​ హెచ్​డబ్ల్యూ01' మంచి ఛాయిస్ అవుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1,999 ఉంటుంది. లెనోవా స్పెసిఫికేషన్స్​ ఎలా ఉన్నాయంటే?

  • 2.29 సెం.మీ ఓఎల్​ఈడీ డిస్​ప్లే
  • బ్లూటూత్ 4.2 కనెక్టివిటీ
  • 90 mAh బ్యాటరీ
  • బ్యాటరీ లైఫ్​ - 5 రోజులు
  • IP65 సర్టిఫికేషన్​
  • రెక్టాంగ్యులర్​, కర్వ్​డ్​ డయల్​
  • సెన్సార్స్​ : యాక్సిలెరోమీటర్, పడోమీటర్​

మీ ఐఫోన్​ను చాలా ఫాస్ట్​గా ఛార్జ్ చేయాలా? ఈ 9 టిప్స్​ మీ కోసమే! - How To Charge IPhone Faster

ఆన్​లైన్​లో మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండాలా? ఈ 13 టిప్స్ మీ కోసమే! - Protect Personal Information Online

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.