ETV Bharat / technology

ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన టాప్​-20 ఏఐ టూల్స్ ఇవే!

Best AI Tools You Should Try : నేడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. అందుకే ప్రముఖ టెక్ కంపెనీలు అన్నీ మార్కెట్లోకి తమ ఏఐ టూల్స్​ను తీసుకువస్తున్నాయి. అందులో అందరికీ ఉపయోగపడే టాప్​-20 ఏఐ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best AI Tools for content creators
Best AI Tools You Should Try
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 11:14 AM IST

Best AI Tools You Should Try : భవిష్యత్ అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​దే అని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం మీరు ప్రత్యేకంగా ఏఐ కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సిద్ధం చేసిన కొన్ని లేటెస్ట్ యాప్స్​ను వాడుకోవచ్చు. వీటితో మీకు నచ్చిన విధంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మరి మీకు కూడా ఇలాంటి ఏఐ టూల్స్ వాడాలని ఉందా? మరెందుకు ఆలస్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్​-20 ఏఐ టూల్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

  1. Pally : చాలా మంది ఇన్​స్టాగ్రామ్​లో ఫొటోలు అప్లోడ్ చేస్తుంటారు. వాటికి సరైన క్యాప్షన్స్ ఇవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి 'పాలీ' (Pally) ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే? ముందుగా మీరు పాలీ వెబ్​సైట్ ఓపెన్ చేయాలి. మీ ఫొటోను అప్లోడ్ చేయాలి. అంతే సింపుల్​. పాలీ ఏఐ టూల్​ మీ ఫొటోను అనలైజ్​ చేసి, మంచి క్యాప్షన్​ను జనరేట్ చేస్తుంది. దానిని కాపీ చేసి, మీ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేయండి.
  2. Moises : ఈ మోసిస్​ ఏఐ టూల్ ఉపయోగించి, ఆడియోలోని వాయిస్​, డ్రమ్స్​, బేస్​లను రిమూవ్ చేయవచ్చు. లేదా వాయిస్​ను అలానే ఉంచి, బ్యాక్ గ్రౌండ్​ మ్యూజిక్​ను తీసేయవచ్చు. అంతేకాదు వాయిస్ క్లోనింగ్ కూడా చేసుకోవచ్చు.
  3. GITA GPT : మీకు భగవద్గీత చదవాలని ఉందా? లేదా భగవద్గీతకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే మీరు సంస్కృతంలోని భగవద్గీతను పూర్తిగా చదవాల్సిన పనిలేదు. 'గీతా జీపీటీ' ఏఐ టూల్​ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే? ముందుగా మీరు గీతా జీపీటీని ఓపెన్ చేసి, భగవద్గీతకు సంబంధించి మీకు ఉన్న ప్రశ్నను టైప్ చేయాలి. అంతే సింపుల్​! వెంటనే మీకు సరైన సమాధానం వస్తుంది.
  4. Super Meme AI : ఈ టూల్​తో చాలా ఈజీగా మీమ్స్ తయారు చేసుకోవచ్చు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి, మీ యూజర్లను చక్కగా ఆకట్టుకోవచ్చు.
  5. Chef GPT : ఈ ఏఐ టూల్​ను ఉపయోగించి, మీకు నచ్చిన ఆహార పదార్థాల రెసిపీ తెలుసుకోవచ్చు. అలాగే దానిని ఎలా వండాలో కూడా నేర్చుకోవచ్చు. పైగా మీరు తింటున్న ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు.
  6. Wisely : ఈ వైజ్​లీ ఏఐ టూల్​ ఉపయోగించి ఒర్జినల్, డూప్లికేట్​ డివైజ్​లను సులువుగా గుర్తించవచ్చు. ఎలా అంటే, మీరు ఆన్​లైన్​లో ఏదైనా వస్తువు కొనాలని అనుకుంటే, దాని వివరాలను ఈ వైజ్​లీ ఏఐ టూల్​లో పేస్ట్ చేయండి. వెంటనే సదరు డివైజ్ సరైనదా? నకిలీదా? అనేది మీకు తెలుస్తుంది.
  7. Pop AI : మీ దగ్గర ఒక పాఠానికి సంబంధించిన పీడీఎఫ్ ఉంది అనుకుందాం. దానిని మీరు ఈ పాప్​ ఏఐ టూల్​లో అప్లోడ్ చేయాలి. దాని తరువాత దానికి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు వస్తే, వెంటనే మీకు తగిన సమాధానాలు ఇస్తుంది. దీనిని ఉపయోగించి, మీ అకడమిక్ స్టడీస్​కు సంబంధించిన నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
  8. Luma AI : ఈ లూమా ఏఐ టూల్ ఉపయోగించి మీ సాధారణ వీడియోను 3డీ మూవీగా మార్చేయవచ్చు.
  9. Trip Club : ట్రావెలింగ్ అంటే ఇష్టపడే వారికి ఈ ట్రిప్ క్లబ్ ఏఐ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే? ముందుగా మీరు వెళ్లాలని అనుకుంటున్న లొకేషన్​ పేరును ట్రిప్ క్లబ్​లో ఎంటర్ చేయాలి. అలాగే మీరు ఏయే తేదీల్లో అక్కడకు వెళ్లాలని అనుకుంటున్నారో చెప్పండి. అంతే మీకు సరిపోయే మంచి టూర్​ ప్లాన్​ను ట్రిప్ క్లబ్ అందిస్తుంది.
  10. Rows AI : ఈ రోస్ ఏఐ టూల్ అనేది మీ Excel షీట్​లోని డేటాను అనలేజ్ చేసి, మీకు కావాల్సిన సమాచారాన్ని బ్రీఫ్​ సమ్మరీగా అందిస్తుంది.
  11. Trickle : ఈ ట్రికెల్​ ఏఐ టూల్​ అనేది స్క్రీన్​షాట్​లను అనలేజ్ చేసి, మీకు కావాల్సిన సమాధానాలను అందిస్తుంది. కనుక దీనిని ఉపయోగించి మీకు నచ్చిన ష్క్రీన్​షాట్​లోని వివరాలు తెలుసుకోవచ్చు.
  12. Durable : చిన్నచిన్న బిజినెస్​ల కోసం సొంత వెబ్​సైట్ నిర్మించాలని అనుకునేవారికి డ్యూరబుల్ ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి కేవలం కొన్ని నిమిషాల్లో మీకు నచ్చిన వెబ్​సైట్​ను క్రియేట్ చేసుకోవచ్చు.
  13. Summarist AI : ఈ సమ్మెరెస్ట్ ఏఐ టూల్ ఉపయోగించి ఓ పెద్ద పుస్తకంలో ఉన్న మొత్తం విషయాన్ని సమ్మరీ రూపంలో తెలుసుకోవచ్చు.
  14. 3D Daily : దీనిని ఉపయోగించి 3డీ చిత్రాలను రూపొందించవచ్చు. పక్కాగా ప్లాన్​ చేస్తే, వీటిని ఉపయోగించి సినిమా కూడా తీసేయవచ్చు.
  15. Suno AI : ఈ సునో ఏఐ టూల్ ఉపయోగించి మంచి ఆడియా సాంగ్స్ క్రియేట్ చేయవచ్చు. దీని కోసం మీరు లిరిక్స్ రాసుకొని, దానిలో అప్లోడ్ చేయాలి. తరువాత మీకు ఎలాంటి సంగీతం కావాలో చెప్పాలి. అంతే సింపుల్​. మీరు కోరుకున్న బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​తో పాట రెడీ అయిపోతుంది.
  16. Voicify AI : ఈ వాయిసీఫై ఏఐ టూల్ ఉపయోగించి, మీకు నచ్చిన సెలబ్రిటీ వాయిస్​లాగా మీ వాయిస్​ను మార్చుకోవచ్చు.
  17. Autodraw AI : ఈ ఆటోడ్రా ఏఐ టూల్ ఉపయోగించి, మీకు నచ్చిన బేసిక్ డ్రాయింగ్​లను వేసుకోవచ్చు. పూర్తిగా డ్రాయింగ్ చేయలేనివారు ఈ టూల్ ఉపయోగించి, తమ మనస్సులోని భావాలను డ్రాయింగ్ రూపంలోకి మార్చుకోవచ్చు.
  18. Jellipod : దీనిని ఉపయోగించి చాలా సింపుల్​ పాడ్​కాస్ట్​లను క్రియేట్ చేసుకోవచ్చు.
  19. Tidal Flow : ఈ టైడల్ ఏఐ టూల్ అనేది మీకు ఒక పర్సనల్ ట్రైనర్​లాగా పనిచేస్తుంది. ఇందులో మీ శరీర కొలతలు, మీ ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాలు ఇస్తే, మీకు ఎలాంటి వ్యాయామాలు అయితే మంచిదో తెలుపుతుంది.
  20. Microsoft Copilot : ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉపయోగించి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. కమాండ్స్ ఇచ్చి ఇమేజెస్​ క్రియేట్ చేసుకోవచ్చు. కచ్చితంగా చెప్పాలంటే ఉచితంగా లభిస్తున్న పర్సనల్ అసిస్టెంట్ లాంటిది ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్​.

గూగుల్ బంపర్ ఆఫర్​ - ఉచితంగా ఏఐ కోర్సులు - నేర్చుకుంటే ఉద్యోగం గ్యారెంటీ!

వాట్సాప్​ 'సెర్చ్​ బై డేట్' ఫీచర్​ - ఎలా వాడాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.