ETV Bharat / technology

ఇన్​స్టాలో మీ కంటెంట్​కు ఎక్కువ వ్యూస్​ రావాలా? ఈ టాప్​ AI ఇన్ఫోగ్రాఫిక్స్​ టూల్స్​​ ట్రై చేయండి! - Best AI Tools Infographics

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 2:14 PM IST

Updated : Aug 19, 2024, 2:23 PM IST

Best AI Tools For Infographics : ప్రస్తుత కాలంలో ఏ వ్యాపారానికి ప్రకటనలు చాలా ముఖ్యం. వాణిజ్య ప్రకటనలైనా, యాడ్ అయినా ఆకర్షణీయంగా ఉండాలి. అందుకే చాలా మంది ఇన్ఫోగ్రాఫిక్స్​ను చేయిస్తుంటారు. అప్పుడు ఆ విజువలైజేషన్ రిచ్ గా ఉంటుంది. ఈ క్రమంలో స్టన్నింగ్ ఇన్ఫోగ్రాఫిక్స్ కోసం వాడే బెస్ట్ ఏఐ టూల్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Best AI Tools For Infographics
Best AI Tools For Infographics (Getty Images)

Best AI Tools For Infographics : పేజీల కొద్దీ సమాచారాన్నైనా, వార్తనైనా ఒక్క ఇన్ఫోగ్రాఫిక్​లో చూపించవచ్చు. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్ట్​ల వివరాలను సైతం ఇన్ఫోగ్రాఫిక్స్​లో చూపిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. సులభంగా అర్థమవుతుంది. వాణిజ్య ప్రకటనలు, బ్యానర్స్ ఇలా దేన్నైనా ఇన్ఫోగ్రాఫిక్స్ చేయిపిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆకర్షణీయమైన ఇన్ఫోగ్రాఫిక్స్ ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడే బెస్ట్ 8 ఏఐ టూల్స్ ఇవే.

1. Canva
కాన్వా అనేది ఒక పాపులర్ ఏఐ పవర్డ్ గ్రాఫిక్ డిజైన్ టూల్. ఇది మంచి విజువల్ కటెంట్​ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాన్వాలో మంచి డిజైన్ టూల్స్, ఫీచర్లు ఉంటాయి. అలాగే కాన్వా ప్రత్యేకంగా ఇన్ఫోగ్రాఫిక్స్ కోసం రూపొందించిన టెంప్లేట్ల లైబ్రరీని అందిస్తుంది. సోషల్ మీడియా గ్రాఫిక్స్, ప్రెజెంటేషన్స్, పోస్టర్స్ వంటి వాటిని కాన్వా ఉపయోగించి డిజైన్ చేయవచ్చు.

2. Piktochart
పిక్టోచార్ట్ మరో అద్భుతమైన ఏఐ ఇన్ఫోగ్రాఫిక్ మేకర్. ఇది వినియోగదారులకు వివిధ రకాల ఇన్ఫోగ్రాఫిక్స్ సృష్టించే సామర్థ్యాన్ని అందిస్తుంది. స్టాండర్డ్ ఇన్ఫోగ్రాఫిక్, ప్రెజెంటేషన్, పోస్టర్, రిపోర్ట్స్​ను క్రియేట్ చేయాలంటే పిక్టోచార్ట్ ఉపయోగపడుతుంది. ఇది యూజర్ ఫ్రైండ్లీ ఇంటర్‌ ఫేస్​ను కలిగి ఉంటుంది.

3. Venngage
కాన్వా మాదిరిగానే వెంగేజ్​తో కూడా ఇన్ఫోగ్రాఫిక్స్​తో సహా వివిధ రకాల డిజైన్లను రూపొందించొచ్చు. పోస్టర్స్, ప్రమోషన్ పోస్టర్స్ వంటి ఇన్ఫోగ్రాఫిక్స్ కోసం ఈ టూల్​ టెంప్లేట్​లను అందిస్తుంది. వెంగేజ్​లో మంచి ఇమేజ్ గ్యాలరీ ఉంటుంది.

4.Visme
విస్మే అనేది విక్రయదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బహుముఖ ఏఐ బేస్డ్​ డిజైన్ టూల్. ఇది ప్రెజెంటేషన్స్, యానిమేషన్స్, మాక్ అప్స్, బ్యానర్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేస్తుంది. ఇందులో కూడా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ ఫేస్​ ఉంటుంది. విస్మేను ఇన్ఫోగ్రాఫిక్ క్రియేటర్స్ ఎక్కువగా వాడుతుంటారు.

5. Infogram
ఇన్ఫోగ్రామ్ అనేది ఏఐ పవర్డ్ డిజైన్ టూల్. ఇది ఆకట్టుకునే డేటా విజువలైజేషన్ ఫీచర్లను అందిస్తుంది. క్లిష్టమైన డేటా సెట్​లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతుంది. ఇది కూడా పలురకాల టెంప్లేట్​లను అందిస్తుంది. అయితే ప్రీమియం వినియోగదారులతో పోలిస్తే, ఉచితంగా ఇన్ఫోగ్రామ్ పొందేవారికి తక్కువ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

6. Adobe Creative Cloud Express
అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ ఎక్స్​ప్రెస్ ఇన్ఫోగ్రాఫిక్ డిజైన్​ను అందంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుంది. 10,000 కంటే ఎక్కువ టెంప్లేట్స్, వేలాది ఉచిత లైసెన్స్ లెస్ ఫీచర్లను అందిస్తుంది. ఇందులో ఉండే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్​తో మీరు నిమిషాల్లోనే ఇన్ఫోగ్రాఫిక్స్​ను క్రియేట్ చేయవచ్చు. అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ ఎక్స్​ప్రెస్ 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో విజువల్ రెజ్యూమ్స్​ను రూపొందించడంలో ఉపయోగపడుతుంది.

7. Snappa
స్నాప్పా ఒక పాపులర్ ఆన్​లైన్ గ్రాఫిక్ డిజైన్ టూల్. ఇది ఇన్ఫోగ్రాఫిక్స్​తో సహా అద్భుతమైన విజువల్స్​ను రూపొందించడంలో సాయపడుతుంది. స్నాప్పా వేలాది ప్రొఫెషనల్ గ్రేడ్ టెంప్లేట్స్​ను అందిస్తుంది. ఇది అందమైన ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేయడాన్ని మరింత ఈజీ చేస్తుంది.

8. skill. Ai
స్కిల్.ఏఐ ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేయడంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. స్కిల్ ఏఐ ఆటోమేటిక్​గా వినియోగదారుల కోసం డేటాను సిద్ధం చేస్తుంది. దీని ద్వారా వేలాది టెంప్లేట్స్, ఇమేజ్​లను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఫొటో క్వాలిటీ పక్కా, విజువల్ రిచ్​నెస్ సూపర్​- ఇన్​స్టా ఇన్​ఫ్లుయెన్సర్స్​ వాడే ఎడిటింగ్ యాప్స్​​ ఇవే! - Best Photo Editing Apps

ఇక చాట్‌జీపీటీలో ఇమేజ్‌ జనరేషన్‌ ఫ్రీ- కానీ ఓ కండిషన్​ - ChatGPT Image Generator

Last Updated : Aug 19, 2024, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.