ETV Bharat / technology

బెంగళూరు ఎగ్జిబిషన్​లో ఫస్ట్ వరల్డ్ వార్ వెపన్స్- సీవీ రామన్ తబలా కూడా- ఇంకా ఏం ప్రదర్శించారంటే? - Science Exhibition in Bangalore

Science Exhibition in Bangalore 2024: బెంగళూరులో సైన్స్ ఎగ్జిబిషన్​ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్​లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు, సీవీ రామన్ తబలాతో పాటు మరెన్నో సైన్స్ సంబంధిత వస్తువులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు ఎంత? ఇందులో ఏఏ వస్తువులు ప్రదర్శించారు? ఈ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు కొనసాగిస్తారు? వంటి వివరాలు మీకోసం.

Science_Exhibition_in_Bangalore
Science_Exhibition_in_Bangalore (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Aug 26, 2024, 8:09 PM IST

Science Exhibition in Bangalore 2024: బెంగళూరులో శనివారం 'SC1560' పేరుతో 'సైన్స్ సిటీ ఆఫ్ బెంగళూరు సైంటిఫిక్ హిస్టరీ' ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఇందులో 19వ శతాబ్దంలో బెంగళూరులో పరిశోధనల కోసం శాస్త్రవేత్తలు ఉపయోగించిన అరుదైన వస్తులు ప్రదర్శించారు. దీంతోపాటు సీవీ రామన్ తబలా, సింప్యూటర్​తో సహా 30 రకాల వస్తువులను ఎగ్జిబిషన్​లో ప్రదర్శించారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు: ఇందులో ప్రదర్శించిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన టార్పెడో(ఇనుప ఈటే) ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని బెంగళూరులో డిజైన్​ చేశారు. అప్పటి మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ ఈ టార్పెడోను తయారు చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శత్రువులపై పోరాడేందుకు భారత సైనికులు దీన్ని ఉపయోగించారని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు.

అట్రాక్టివ్​గా మున్సెల్ రిక్టర్: 2019లో వివిధ సరస్సుల నుంచి మట్టిని సేకరించి వివిధ ప్రదేశాల్లోని నీటిలో బ్యాక్టీరియాను పెంచారు. ఇదే విధానంలో సూక్షజీవుల పునరుత్పత్తి కొనసాగిస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో నేలను బట్టి వివిధ ఆకర్షణీయమైన రంగులు పిక్చర్ ఫ్రేమ్​లో కన్పిస్తాయి.

డాక్టర్ సీవీ రామన్ తబలా: భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ సీ.వీ రామన్ వాయిద్యాల ప్రకంపనలను అధ్యయనం చేసినప్పుడు పరిశోధన కోసం ఉపయోగించిన తబలాను ప్రదర్శనలో ఉంచారు. విసిటర్స్ కూడా ఈ తబలాను వాయించి ప్రకంపనలు వినేందుకు అవకాశం కల్పించారు.

బెంగళూరు కంప్యూటర్: 2001- 2003 సమయంలోని కంప్యూటర్​ను ఈ ఎగ్జిబిషన్​లో ప్రదర్శించారు. దీన్ని బెంగళూరులోని భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కనిపెట్టింది. కీ బోర్డు లేని ఈ కంప్యూటర్​ను అప్పట్లో చాలామంది శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇది ఇప్పటి స్మార్ట్ ఫోన్​లా కనిపించినా అప్పట్లో కంప్యూటర్​లా దీన్ని వినియోగించేవారు.

వివిధ ల్యాబ్స్: టెలిఫోన్ ఆవిష్కరణ, బెంగళూరు మ్యాపింగ్, సరస్సుల క్రానికల్స్, మైండ్ అండ్ మెషీన్స్, కాస్మిక్ కిరణాలు, తపాలా స్టాంపులు, ట్రాన్స్‌మిటింగ్ ఎలక్ట్రానిక్స్ వంటి 30 అంశాల పూర్తి సమాచారాన్ని ఎగ్జిబిషన్​లో ప్రదర్శించారు.

ఎంట్రీ ఫీజు: ఈ ఎగ్జిబిషన్​లోకి వెళ్లేందుకు సామాన్య ప్రజలకు ఎలాంటి ఫీజు లేదు. శనివారం ప్రారంభించిన ఈ కార్బన్ సైన్స్ గ్యాలరీ బుధవారం నుంచి ఆదివారం వరకు తెరచి ఉంటుంది. సోమవారం, మంగళవారం ఇది క్లోజ్ చేసి ఉంటుంది. ఈ రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్​ కొనసాగనుంది. 12 మంది సభ్యులతో కూడిన ఓ ప్రత్యేక బృందం ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన సైన్స్ నమూనాలపై కన్నడ, ఆంగ్ల భాషల్లో వివరిస్తుంది.

అమ్మాయిలూ బయటికి వెళ్తున్నారా?- మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే ఎక్కడికెళ్లినా సేఫ్! - Women Safety APPs in India

విమానాన్ని వాడని మోదీ- రైలులో ప్రయాణం- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? - PM Modi Traveled in Train Force One

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.