ETV Bharat / technology

యాపిల్ లవర్స్​కు గుడ్​న్యూస్- ఐఫోన్​లో సరికొత్త ఫీచర్స్..!

యాపిల్ ఇంటెలిజెన్స్​లో కొత్త ఫీచర్స్- వీటి ఉపయోగాలు ఇవే..!

Apple AI Beta Version Preview Released
Apple AI Beta Version Preview Released (Apple)
author img

By ETV Bharat Tech Team

Published : 3 hours ago

Apple AI Beta Version Preview Released: టెక్ దిగ్గజం యాపిల్ తన ఏఐ సాఫ్ట్‌వేర్ బీటా వెర్షన్‌ ప్రివ్యూని గురువారం రిలీజ్ చేసింది. ఇందులో ChatGPT, ఇమేజ్-జనరేషన్ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ విడుదల చేసిన ఈ ప్రివ్యూలో ఎక్కువగా చాట్‌జిపిటి ఇంటిగ్రేషన్​పై చర్చించింది. iOS 18.1లో భాగంగా వచ్చే వారం ప్రారంభంలో Apple Intelligence ఫీచర్‌ల మొదటి వేవ్‌ను కంపెనీ విడుదల చేయనుంది.

ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక డెవలపర్ సమావేశంలో కంపెనీ తన యాపిల్ ఇంటెలిజెన్స్​ను పరిచయం చేసింది. ఇందులో Genmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్, కెమెరా కంట్రోల్‌తో విజువల్ ఇంటెలిజెన్స్, OpenAI ChatGPT వంటి ఫీచర్లు ఉన్నాయి. Genmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్ యూజర్స్​ మెసెజెస్ పంపించేందుకు డివైజ్​లో ఇమేజెస్​ను రూపొందించేందుకు ఉపయోగపడతాయి.

కంపెనీ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. యాపిల్ ఇంటెలిజెన్స్​ ఫీచర్​ చాట్​జీపీటీతో కనెక్ట్ అయి ఉంటుంది. యూజర్స్ సిరిని ఏదైనా సంక్లిష్టమైన ప్రశ్న అడిగితే ఇది "Use ChatGPT?" అనే ఆప్షన్​ను ఇస్తుంది. అప్పుడు మీకు కావాలంటే ఆ ఆప్షన్​ను సెలక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే తిరస్కరించొచ్చు. ఒకవేళ మీరు చాట్​జీపీటీని సెలక్ట్ చేసుకుంటే Gen- AI సర్వీస్​ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. అనంతరం దీని రెస్పాన్స్ మీకు మొబైల్ డిస్​ప్లేపై కన్పిస్తుంది.

దీని యాక్సెస్ యాపిల్ యూజర్స్ అందరికీ ఉచితంగా ఉంటుంది. అయితే పెయిడ్ ChatGPT సబ్‌స్క్రైబర్‌లు అదనపు బెనిఫిట్స్​ పొందేందుకు వారి అకౌంట్స్​ను యాపిల్ ప్రొడక్ట్స్​కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రివ్యూలో రిలీజ్ చేసిన మరో ఫీచర్.. విజువల్ ఇంటెలిజెన్స్​ కూడా యాపిల్ ఏఐ​తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా​ ఫోన్ కెమెరా టెక్స్ట్​ లేదా వస్తువులను గుర్తించి వెంటనే సంకేతాలను ఇస్తుంది.

యాపిల్ ఈ ఏడాది జూన్​లో తన ఏఐ ఫీచర్స్​ను ప్రకటించిన సమయంలో ఈ సాఫ్ట్​వేర్ కేవలం రెండు ఐఫోన్ మోడల్స్, కొన్ని ఐప్యాడ్స్​, Mac లకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ 16 మోడల్స్, కొత్తగా లాంచ్ అయిన మినీ ఐప్యాడ్​తో సహా అన్ని Macs Apple ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో యాపిల్ త్వరలో మరో కొత్త M4-Macsని తీసుకురావాలని చూస్తోంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్​కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ప్రాసెసర్‌లు AI టాస్క్​లను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.

పండగ వేళ మార్కెట్లోకి లగ్జరీ కారు- ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!

BSNL యూజర్స్​కు ఫ్రీ Wi-Fi కనెక్షన్​- వావ్.. ఆఫర్ అదిరిందిగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.