Apple Releases iOS 17.5 Update : యాపిల్ కంపెనీ లేటెస్ట్ ఐఓఎస్ 17.5 అప్డేట్ను రిలీజ్ చేసింది. దీనిని ఐఫోన్ మోడల్స్ అన్నింటిలోనూ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఐఓఎస్ 17.5 అప్డేట్లోని బెస్ట్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- యూరోపియన్ యూనియన్‌లోని ఐఫోన్ యూజర్లకు వెబ్ డిస్ట్రిబ్యూషన్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కనుక వీరు ఐఫోన్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే కాదు, యాప్‌లను సైడ్‌లోడ్ కూడా చేయగలుగుతారు.
- ఐఫోన్ రిపేర్ స్టేటస్ తెలుసుకోవడం కోసం యూజర్లు తిరగాల్సిన అవసరం లేకుండా, 'ఫైండ్ మై' ట్రాకింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది యాపిల్. ఈ ఆప్షన్ ద్వారా యూజర్లు ఈజీగా ఐఫోన్ రిపేర్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ వినియోగదారుల కోసం, తాజా అప్‌డేట్ ద్వారా Apple News+ యాప్ ఆఫ్‌లైన్ మోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వినియోగదారులు ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ News+ ట్యాబ్, టుడే ఫీడ్‌ను యాక్సెస్ చేయగలుగుతారు.
సెక్యూరిటీ ఫీచర్స్
- ఎవరైనా మీ ఐఫోన్‌ను ట్రాకింగ్ చేయాలని ప్రయత్నిస్తే, మీకు ఇట్టే తెలిసేటట్లు ఓ సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రాస్-ప్లాట్ ఫామ్ ట్రాకింగ్ డిటెక్షన్ అనే ఫీచర్ ద్వారా మీ సమీపంలోని ట్రాకర్‌ను సులువుగా గుర్తించవచ్చు.
- ఈ ఐఓఎస్ 17.5 అప్డేట్లోని ఎయిర్‌ట్యాగ్స్ ఫీచర్ ద్వారా మీ డివైజ్‌లను ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్‌ట్యాగ్‌ను ఎనేబుల్ చేసుకుంటే, మీ ఫోన్, కారు లాంటివి చోరీకి గురైనప్పుడు వెంటనే మీకు అలర్ట్ వస్తుంది.
- ఐఓఎస్ 17.5 విడుదల చేసిన నోట్ ప్రకారం, క్రాస్-ప్లాట్ ఫామ్ ట్రాకింగ్ డిటెక్షన్ ఫీచర్ వినియోగదారుల ఫోన్‌ను ట్రాకింగ్ చేసే డివైజ్‌ను గుర్తిస్తుంది. అంటే మీ మొబైల్‌ను ఎవరైనా ట్రాక్ చేస్తుంటే, ఆ విషయాన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఈ భద్రతా ఫీచర్‌ను గూగుల్, యాపిల్ కంపెనీలు సంయుక్తంగా 2023లో తీసుకొచ్చాయి.
అప్‌గ్రేడ్ చేసుకోండిలా?
- ముందుగా మీరు ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- జనరల్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
- సాఫ్ట్వేర్ అప్డేట్పై ట్యాప్ చేయాలి.
- వెంటనే ఐఓఎస్ 17.5 అప్‌గ్రేడ్ అవుతుంది.
రూ.30,000 బడ్జెట్లో మంచి ట్యాబ్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే! - Best Tabs Under 30000