ETV Bharat / technology

మార్కెట్లో యాపిల్ జోరు- సూపర్ స్పీడ్​ మినీ డెస్క్​టాప్ కంప్యూటర్ లాంచ్

యాపిల్ మ్యాక్ మినీ వచ్చేసింది- ధర, ఫీచర్లు ఇవే..!

Apple Mac Mini
Apple Mac Mini (Apple)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 30, 2024, 3:28 PM IST

Apple Mac Mini Launched: టెక్​ దిగ్గజం యాపిల్ మంచి జోరు మీద ఉంది. నిన్ననే పవర్​ఫుల్ M4 చిప్​తో కొత్త ఐమ్యాక్​ను తీసుకురాగా.. ఇవాళ సూపర్​ స్పీడ్​తో పనిచేసే మ్యాక్​ మినీ కొత్త వెర్షన్​ను లాంచ్ చేసింది. ఈ కొత్త యాపిల్ కాంపాక్ట్ డెస్క్‌టాప్ కంప్యూటర్ అయిన మ్యాక్ మినీలో రెండు చిప్​సెట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

మ్యాక్​ మినీ చిప్​సెట్ ఆప్షన్స్:

  • M4
  • M4 ప్రో

ఈ రెండు చిప్​సెట్స్​లో M4 ప్రో అనేది సరికొత్త ఆప్షన్​. ఈ కొత్త మ్యాక్ మినీ M4 వేరియంట్.. మ్యాక్ మినీ M1 కంటే 1.7 రెట్లు ఫాస్టర్ పెర్ఫార్మెన్స్​ను అందిస్తుంది. మరోవైపు M4 ప్రో పవర్డ్ డెస్క్‌టాప్ కంప్యూటర్ బ్లెండర్‌లో 3D రెండర్‌లను 2.9 రెట్లు వేగంగా పూర్తి చేయగలదు.

Apple Mac Mini
Apple Mac Mini (Apple)

M4 చిప్​తో వస్తున్న మ్యాక్​ మిని స్పెసిఫికేషన్స్: M4 చిప్‌సెట్‌తో తీసుకొచ్చిన మ్యాక్​ మినీ.. 10-కోర్ CPU, 10-కోర్ GPU, 24GB యూనిఫైడ్ మెమరీ, 512GB వరకు ఆన్‌బోర్డ్ SSD స్టోరేజీతో వస్తుంది. M1 మోడల్‌తో పోలిస్తే ఇది గరిష్టంగా 1.8 రెట్లు CPU, GPU పనితీరు 2.2 రెట్లు మెరుగ్గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త మినీ మ్యాక్ 5x5 అంగుళాలతో దీని ప్రీవియస్ జనరేషన్ మ్యాక్​ కంటే చాలా చిన్న ఫారమ్​ ఫ్యాక్టర్​లో వస్తుంది. ఇది మ్యాక్‌విస్పర్‌లో ఆన్-డివైస్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్పీచ్-టు-టెక్స్ట్​ 2x వేగంగా ట్రాన్స్​క్రైబింగ్ చేయగలదు.

Apple Mac Mini
Apple Mac Mini (Apple)

M4 ప్రో చిప్​తో వస్తున్న మ్యాక్​ మిని స్పెసిఫికేషన్స్: సరికొత్త M4 ప్రో చిప్​ను ఈ మ్యాక్​ మినీలో కంపెనీ తీసుకొచ్చింది. ఇది 14-కోర్ CPU, 20-కోర్ GPU, 64GB వరకు యూనిఫైడ్ మెమరీ, 8TB వరకు SSD స్టోరేజీతో వస్తుంది. M2 ప్రో మ్యాక్ మినీతో పోలిస్తే దీని ర్యామ్లో మోషన్ గ్రాఫిక్స్​ను 2 రెట్లు వేగంగా అందజేస్తుందని యాపిల్ తెలిపింది.

మ్యాక్ మినీ కనెక్టివిటీ ఫీచర్స్: M4, M4 ప్రో చిప్​సెట్స్​తో వస్తున్న రెండు మ్యాక్​ మినీ మోడల్స్ యాపిల్ ఇంటెలిజెన్స్​కు సపోర్ట్ చేస్తాయి. ఇందులో USB 3 స్పీడ్‌తో రెండు USB టైప్-C పోర్ట్స్, ముందు భాగంలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంటుంది. మ్యాక్ మినీ M4 వెనకవైపు మూడు Thunderbolt 4 పోర్ట్స్​ ఉండగా.. M4 Pro వేరియంట్‌లో మూడు Thunderbolt 5 పోర్ట్స్ ఉంటాయి. ఈ రెండు మోడల్స్​లో గిగాబిట్ ఈథర్నెట్, HDMI పోర్ట్స్​ ఉంటాయి.

ధర: ఇండియన్ మార్కెట్లో M4 చిప్‌తో మినీ మ్యాక్ 10-కోర్ CPU, 10-కోర్ GPU, 16GB యూనిఫైడ్ మెమరీ, 256GB ఆన్‌బోర్డ్ SSD స్టోరేజీతో వచ్చే బేస్ మోడల్​ ధర రూ.59,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మోడల్​ను గరిష్టంగా 24GB RAM, 512GB స్టోరేజీతో కాన్ఫిగర్ చేయొచ్చు.

Apple Mac Mini
Apple Mac Mini (Apple)

మరోవైపు M4 ప్రో చిప్‌తో మినీ మ్యాక్ 12-కోర్ CPU, 16-కోర్ GPU, 24GB యూనిఫైడ్ మెమరీ, 512GB ఆన్‌బోర్డ్ SSD స్టోరేజీతో వచ్చే మోడల్​ ధర రూ.1,49,900. యూజర్స్ 14-కోర్ CPU, 20-కోర్ GPU, 64GB యూనిఫైడ్ మెమరీ, 8TB వరకు SSD స్టోరేజీతో మ్యాక్​ మినీని కస్టమైజ్ చేయొచ్చని యాపిల్ తెలిపింది.

ఈ రెండు మోడల్స్​కు 10-బిట్ గిగాబిట్ ఈథర్నెట్‌ను యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం రూ. 10,000లను అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కొత్త మ్యాక్​ మినీని యాపిల్​ స్టోర్స్​, యాపిల్ ఆథరైజ్డ్ రిటైలర్స్​ నుంచి ప్రీ- ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి షిప్పింగ్ నవంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

దీపావళి వేళ ఖరీదైన మోటార్​సైకిల్ లాంచ్- కొంటే ఇలాంటి బైక్ కొనాలి భయ్యా..!

ఇండియన్ లాంగ్వేజెస్ కోసం సర్వమ్​-1 లాంచ్- ఇకపై ఆ సమస్య తీరినట్లే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.