Microsoft Windows Latest Features : మైక్రోసాఫ్ ఓ సరికొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, విండోస్ 11 ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా నేరుగా మీ కంప్యూటర్లోని ఫైల్స్‌ను, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తో యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంత మంది టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే, వైర్‌లెస్‌గా మీ కంప్యూటర్లోని ఫైల్స్‌ను, ఫోల్డర్స్‌ను, మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా నేరుగా యాక్సెస్ చేయడానికి వీలు ఏర్పడుతుంది.
ఇది ఎలా పని చేస్తుంది?
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విండోస్ 11 ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌తో అనుసంధానం (ఇంటిగ్రేట్) చేయాలి. అంతే సింపుల్! ఇక అప్పటి నుంచి మీ కంప్యూటర్లోని ఫైల్స్‌ను, మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే కాపీ, షేర్, డిలీట్ లాంటివన్నీ చేయవచ్చు. అంతేకాదు ఈ ఫైల్స్‌ను మీ సిస్టమ్ నుంచి నేరుగా ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సాధారణ ఫోన్ లింక్ యాప్స్‌తో పోలిస్తే, ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగిపోతుంది.
ఈ నయా ఫీచర్ వాడడం ఎలా?
ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి వారు దీనిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తెచ్చిన ఈ నయా ఫీచర్ వాడాలంటే, మీ దగ్గర ఆండ్రాయిడ్ 11 లేదా దానికంటే అడ్వాన్స్డ్ వెర్షన్ ఫోన్ ఉండాలి. ఇలాంటి ఫోన్ మీ దగ్గర ఉంటే, ఈ కింది ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి.
- ముందుగా మీ కంప్యూటర్లోని Settings ఓపెన్ చేయాలి.
- 'బ్లూటూత్ అండ్ డివైసెస్'ను సెలక్ట్ చేయాలి.
- 'మొబైల్ డివైజ్'పై క్లిక్ చేయాలి.
- 'మేనేజ్ డివైజ్'ను సెలక్ట్ చేసుకోవాలి.
- మీ పీసీ, ఆండ్రాయిడ్ ఫోన్‌తో కనెక్ట్ కావడానికి కావాల్సిన పర్మిషన్లు అన్నీ ఇవ్వాలి.
- ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కు యాక్స్ ఇస్తూ టోగుల్ చేయాలి.
- నోటిఫికేషన్స్, కెమెరా యాక్సెస్ కోసం కూడా పర్మిషన్స్ ఇవ్వాలి. అంతే సింపుల్!
వీరికి బాగా ఉపయోగపడుతుంది!
రోజువారీ పని కోసం పీసీ, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగించే వారికి ఈ నయా ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంటి వద్ద కంప్యూటర్ ఉన్నప్పుడు, దూరంగా ఉన్న మీరు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీ ఫోన్ ద్వారానే కంప్యూటర్లోని ఫైల్స్‌ను చూడడానికి వీలు అవుతుంది. అంతేకాదు వీటిని షేర్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఇకపై వాట్సాప్‌లోనూ యూజర్ నేమ్ క్రియేషన్- నంబర్ లేకున్నా చాట్ చేసేయొచ్చు! - Whatsapp New Feature