Amazon Offers on Smartphones: అమెజాన్ అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌లలో ఒకటైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే అమెజాన్ కిక్‌స్టార్టర్ డీల్స్‌ను రివీల్ చేసింది. వాటిలో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. వన్‌ప్లస్ 11R, శాంసంగ్ గెలాక్సీ S21 FE మొబైల్స్‌తో పాటు మరికొన్ని ఇతర ఫోన్లపై కూడా పెద్దఎత్తున ఆఫర్లను రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై ధర తగ్గింపుతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్స్‌ను అందించడానికి అమెజాన్ ఎస్‌బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
OnePlus 11Rపై డీల్స్: ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ రూ. 39,999 ధరతో లాంచ్ అయింది. ఈ మొబైల్‌ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో రూ. 27,999కి కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు కస్టమర్లు బ్యాంక్ ఆఫర్‌లను ఉపయోగించడం ద్వారా రూ.26,749 ధరలో దీన్ని కొనుగోలు చేయొచ్చు.
- ప్రాసెసర్: Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్‌తో
- రిఫ్రెష్ రేట్: 120Hz
- డిస్‌ప్లే: 6.7-అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED
- బ్యాటరీ: 5,000mAh
- 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
Samsung Galaxy S21 FEపై డీల్స్: అమెజాన్ రివీల్ చేసిన కిక్‌స్టార్టర్ డీల్స్‌లో శాంసంగ్ గెలాక్సీ S21 FEపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 74,999 MRPతో మార్కెట్లో రిలీజ్ అయింది. అయితే అప్పటి నుంచి దీని ధర చాలాసార్లు తగ్గించారు. ప్రస్తుతం అమెజాన్ సేల్స్‌లో దీన్ని రూ. 26,999కి కొనుగోలు చేయొచ్చు.
- డిస్‌ప్లే: 6.4-అంగుళాల డైనమిక్ AMOLED 2X
- రిఫ్రెష్ రేట్: 120Hz
- బ్యాటరీ: 500mAh
ఇవి మాత్రమే కాకుండా iQOO Z9s Pro 5G, Realme Narzo 70 Turbo 5G, Lava Blaze Curve వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఇలాంటి అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో వీటిని మంచి ఆఫర్లతో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే అంటే సెప్టెంబర్ 26నే ఈ సేల్ అందుబాటులోకి రానుంది.
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఆఫర్ల పండగ- వన్‌ప్లస్ దీపావళి డీల్స్ రివీల్ - One Plus Diwali Sale 2024