ETV Bharat / technology

ఈ 7 టిప్స్​తో మీ వాట్సాప్​ ఫుల్​ సెక్యూర్డ్- ప్రైవసీ కూడా! - Whatsapp Security Tips - WHATSAPP SECURITY TIPS

Whatsapp Security Tips : మీరు వాట్సాప్ యూజర్లా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో మీ వాట్సాప్​ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ ఆర్టికల్​లో మీ వాట్సాప్​ అకౌంట్​ను సెక్యూర్​గా ఉంచుకునేందుకు కావాల్సిన టిప్స్ గురించి తెలుసుకుందాం.

Whatsapp Security Tips
Whatsapp Security Tips (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 5:54 PM IST

Whatsapp Security Tips : ప్రస్తుత కాలంలో వాట్సాప్ వాడని వారంటూ లేరంటే అది అతిశయోక్తి కాదు. చాలా సులువుగా పర్సనల్ చాట్​లు చేయడానికి, ఇతరులతో కమ్యునికేట్ కావడానికి వీలుగా ఉండడమే ఇందుకు కారణం. అయితే సైబర్ దాడులు పెరుగుతున్న నేటి కాలంలో, మీ వాట్సాప్​ అకౌంట్​ను సేఫ్​గా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో మీ వాట్సాప్​ ఖాతాను సురక్షితంగా ఉంచుకునేందుకు అవసరమైన 7 టిప్స్​ ఏంటో చూద్దాం.

1. టూ-స్టెప్​ వెరిఫికేషన్​ మస్ట్!
మీ వాట్సాప్ అకౌంట్​కు కచ్చితంగా 'రెండు అంచెల ధ్రువీకరణ' (టూ-స్టెప్ వెరిఫికేషన్)ను ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే దానికి పటిష్ఠమైన 6 అంకెల పిన్​ను పెట్టుకోవాలి. ఆ పిన్ ఎవరూ ఊహించలేని విధంగా, చాలా పటిష్ఠంగా ఉండేలా చూసుకోవాలి. మీరు ఏదైనా కొత్త డివైజ్​లో, లేదా వేరేవాళ్ల డివైజ్​లో వాట్సాప్​ ఉపయోగించినప్పుడు, ఎస్​ఎంఎస్​ ద్వారా వెరిఫికేషన్ కోడ్​ వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది.

  • వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్​లోకి వెళ్లాలి
  • ఆ తర్వాత టూ-స్టెప్ వెరిఫికేషన్​ను ఎంచుకోవాలి
  • ఎనేబుల్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి
  • ఆపై ఆరు అంకెల్ పిన్ సెట్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలి
  • అలాగే అందులో మీరు కావాలంటే ఈ-మెయిల్ ఇవ్వొచ్చు.

2. వాట్సాప్ వెబ్​తో జాగ్రత్త!
మీ వాట్సాప్ ఖాతా ఏఏ డివైజ్​లలో యాక్టివ్​గా ఉందో ట్రాక్​ చేయడం చాలా అవసరం. వాస్తవానికి వాట్సాప్​​లోనే మీరు ఏఏ డివైజ్​లలో లాగిన్ అయి ఉన్నారో, ఆ జాబితా కనిపిస్తుంది. ఒకవేళ ఆ జాబితాలో మీకు తెలియని డివైజ్​లు ఉన్నా, లేదా అనధికారికంగా ఎవరైనా మీ వాట్సాప్​​ను వాడుతున్నట్లు గమనించినా, వెంటనే దాని నుంచి లాగౌట్ అవ్వాలి. ముఖ్యంగా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వాడుతున్నవారు ఈ టిప్ పాటించి, తమ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

  • ఫోన్​లో వాట్సాప్​ను ఓపెన్ చేయాలి
  • సెట్టింగ్స్​లోకి వెళ్లి, లింక్డ్ డివైజ్​లోకి వెళ్లాలి
  • అందులో మీకు తెలియని డివైజ్​లు ఉన్నా లేదా అనధికారికంగా ఎవరైనా మీ వాట్సాప్​​ను వాడుతున్నట్లు గమనించినా వెంటనే దాన్నుంచి లాగౌట్ అవ్వాలి.

3. రీడ్ రిసీట్స్​​ను డిసేబుల్ చేయండి
మీకు వాట్సాప్​లో వచ్చిన మెసేజ్​లు చూసినట్టు ఇతరులకు తెలియకూడదంటే సెట్టింగ్స్​లో ప్రైవసీ ఆప్షన్స్​లో read receipts ఆఫ్ చేస్తే చాలు. అలా చేయడం వల్ల మీరు మెసేజ్ చూసినట్లు బ్లూ టిక్స్ ఇతరులకు కనిపించవు.

  • వాట్సాప్ సెట్టింగ్స్​లోకి వెళ్లాలి
  • ప్రైవసీ ఆప్షన్​పై క్లిక్ చెయ్యాలి
  • read receipts ఆప్షన్​ను ఆఫ్ చెయ్యాలి

4. డిస్​అపియరింగ్‌ మెసేజెస్ ఆప్షన్​ను ఎంచుకోండి
వాట్సాప్ డిస్​అపియరింగ్‌ మెసేజెస్ ఆప్షన్​ను తీసుకొచ్చింది. ఇందులో చాట్​లో పంపిన మెసేజ్​లు వారం తర్వాత అవే ఆటోమెటిక్​గా డిలీట్ అయిపోతాయి. ఈ ఫీచర్​ను ఎనేబుల్ చేసుకోవాలి.

  • వాట్సాప్​లో చాట్​ను ఓపెన్ చెయ్యాలి
  • ఆ తర్వాత కాంటాక్ట్ నేమ్​పై క్లిక్ చెయ్యండి
  • ఆపై డిస్​అపియరింగ్‌ మెసేజెస్ ఆప్షన్​ను ఎనేబుల్ చేసుకోండి

5. వేర్వేరు టోన్స్ పెట్టుకోండి

  • మీ ఫోన్​లోని వాట్సాప్ గ్రూప్​ల కోసం నోటిఫికేషన్ల కోసం ప్రత్యేకమైన టోన్స్​ను పెట్టుకోండి.
  • మీకు కావాల్సిన వాట్సాప్ గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్లండి
  • కిందకు స్క్రోల్ చేసి, కస్టమ్ నోటిఫికేషన్ ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకోండి
  • అక్కడ నోటిఫికేషన్ టోన్​ను ఎంచుకోండి.
  • అప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్​లో ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఎంచుకున్న టోన్ ప్లే అవుతుంది.

6. వాట్సాప్ గ్రూప్ నుంచి ఇలా వైదొలగండి!
కొన్నిసార్లు మనకు నచ్చని వాట్సాప్ గ్రూప్​లో కొందరు యాడ్ చేస్తుంటారు. అందులో నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తాం. ఒకవేళ ఎగ్జిట్ అయితే నోటిఫికేషన్ వెళ్తుందనుకుంటాం. అలాంటప్పుడు గ్రూపులోని సభ్యులకు నోటిఫికేషన్ వెళ్లకుండా జాగ్రత్తపడొచ్చు.

  • వాట్సాప్​లో మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్న గ్రూపు చాట్​ను ఓపెన్ చేయండి
  • స్క్రీన్ పైభాగంలో ఉన్న గ్రూప్ నేమ్​పై క్లిక్ చెయ్యండి
  • కిందికి స్క్రోల్ చేసి, ఎగ్జిట్ గ్రూప్ బటన్​పై క్లిక్ చెయ్యండి
  • ఆ తర్వాత ఎగ్జిట్ గ్రూప్ ఎగైన్​పై క్లిక్ చెయ్యండి

7. ప్రైవసీ సెట్టింగ్స్
మీ వాట్సాప్​ ప్రొఫైల్​ ఫొటో, స్టేటస్, లాస్ట్ సీన్ స్టేటస్​లను ఎవరెవరు చూడాలో మీరే నిర్ణయించుకోవాలి. మీ కాంటాక్ట్స్​లో లేనివారు, అపరిచితులు మీ పర్సనల్ విషయాలు చూడకుండా మీరే స్వయంగా సెట్టింగ్స్​ చేసుకోవాలి. ఇందుకోసం వాట్సాప్​ ప్రైవసీ సెట్టింగ్స్​లోకి వెళ్లి తగు మార్పులు చేసుకోవాలి.

  • ఆ తర్వాత ప్రైవసీపై క్లిక్ చెయ్యండి
  • లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫొటో, స్టేటస్​ను మీ కాంటాక్ట్​లు ఉన్న ఎవరెవరు చూడాలో ఎంచుకోండి.

వీడియో కాల్​ లైవ్​లోనే ఫిల్టర్స్, మేకప్​​ టచ్! నయా వాట్సాప్ ఫీచర్​తో మనుషుల్ని గుర్తుపట్టడం కష్టమే! - WhatsApp Video Calls New Features

ఇకపై వాట్సాప్‌లోనూ యూజర్ నేమ్ క్రియేషన్‌- నంబర్‌ లేకున్నా చాట్ చేసేయొచ్చు! - Whatsapp New Feature

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.