ETV Bharat / technology

దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త కారు- ఫీచర్లు, డిజైన్​ చూస్తే మతిపోతోందిగా..! - 2025 JEEP MERIDIAN SUV

సరికొత్త డిజైన్, ఫీచర్లతో​ జీప్​ ఇండియా నయా కారు- ధర, ఫీచర్లు ఇవే..!

2025 Jeep Meridian SUV
2025 Jeep Meridian SUV (Jeep India)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 22, 2024, 10:58 AM IST

2025 Jeep Meridian SUV Launched: దీపావళి పండగ వేళ మార్కెట్లోకి కొత్త కారు వచ్చింది. జీప్ ఇండియా తన అప్డేటెడ్ 2025 జీప్ మెరిడియన్ SUVని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ 3- వరుసల జీప్ మెరిడియన్ SUV మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకొచ్చింది. మార్కెట్లో దీని బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఐదు వేరియంట్స్​లో ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్‌లలో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

ఫీచర్లు: ఇందులో లెవెల్ 2 ADAS సూట్​తో పాటు మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లను న్యూ టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ కారు 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో 10.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను కలిగి ఉంది.

2025 Jeep Meridian
2025 Jeep Meridian (Jeep India)

వీటితో పాటు ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ లాంగిట్యూడ్ వేరియంట్ ఐదు-సీట్ల వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, మిగతా అన్ని వేరియంట్‌లు ఏడు సీట్లతో వస్తున్నాయి. ఇందులో బేస్ వేరియంట్​లో పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ వంటి కొన్ని ఫీచర్లు ఉండవు.

2025 Jeep Meridian
2025 Jeep Meridian (Jeep India)

వేరియంట్స్:

  • లాంగిట్యూడ్
  • లాంగిట్యూడ్ ప్లస్
  • లిమిటెడ్ (O)
  • ఓవర్‌ల్యాండ్

ఎక్స్​టీరియర్ డిజైన్: ఈ 2025 జీప్ మెరిడియన్ ఎక్స్​టీరియర్​లో కంపెనీ ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇది 7-స్లాట్ గ్రిల్, DRLతో సొగసైన LED హెడ్‌ల్యాంప్స్, వేరియంట్‌ను బట్టి డిఫరెంట్ పాటెర్న్​​లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, సొగసైన LED టెయిల్‌ల్యాంప్స్​తో అదే ఫాసియాతో వస్తోంది.

2025 Jeep Meridian
2025 Jeep Meridian (Jeep India)

పవర్‌ట్రెయిన్​: ఈ కొత్త అప్డేటెడ్ జీప్ మెరిడియన్ పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది దాని పాత వెర్షన్​లో ఉన్నట్లుగానే 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్​తో వస్తోంది. ఈ ఇంజన్ 168బిహెచ్‌పి పవర్, గరిష్టంగా 350ఎన్ఎమ్ టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఇది దాని పాత మోడల్​లో ఉన్నట్లుగా 4x2, 4x4 వెర్షన్లలో కూడా అందుబాటులో ఉంది.

2025 Jeep Meridian
2025 Jeep Meridian (Jeep India)

2025 జీప్ మెరిడియన్ ధర:

  • లాంగిట్యూడ్ వేరియంట్ ధర (5-సీటర్): రూ. 24.99 లక్షలు
  • లాంగిట్యూడ్ ప్లస్ వేరియంట్ ధర: రూ. 27.5 లక్షలు
  • లిమిటెడ్ (O) వేరియంట్ ధర: రూ. 30.49 లక్షలు
  • ఓవర్‌ల్యాండ్ వేరియంట్ ధర: రూ. 36.49 లక్షలు

స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో భారత్‌ సరికొత్త రికార్డ్- భారీగా వృద్ధి రేటు..!

వాట్సాప్​లో ఇంట్రస్టింగ్ చాట్ మెమరీ ఫీచర్!- ఇది ఎలా పనిచేయనుందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.