ETV Bharat / state

YUVA - తొలి సినిమాతోనే మెప్పించిన యువ దర్శకుడు - 12 ఏళ్ల తర్వాత కలను సాకారం చేసుకున్న మెదక్ కుర్రాడు - Yuva on Movie Director Prashanth Reddy - YUVA ON MOVIE DIRECTOR PRASHANTH REDDY

Story on bhaje vaayu vegam Movie Director : సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. సినిమాలు చూడటమే తప్ప తీయడం తెలియదు. సిల్వర్‌ స్క్రీన్‌పై డైరెక్టర్‌గా పేరు చూసుకోవాలని, కోటి ఆశలతో చిత్రసీమలో వాలాడు. సినిమా అంటే ఏంటో తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూ 12 ఏళ్ల తర్వాత కలల తీరాన్ని చేరాడు. 'భజే వాయు వేగం'తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించిన మెదక్‌ యువకుడు ప్రశాంత్ రెడ్డి సక్సెస్‌ స్టోరీనే ఇది.

Yuva on bhaje vaayu vegam Movie Director Prashanth Reddy
Story on bhaje vaayu vegam Movie Director (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 3:55 PM IST

తొలి సినిమాతోనే మెప్పించిన యువ దర్శకుడు -12 ఏళ్ల తర్వాత కలను సాకారం చేసుకున్న మెదక్ కుర్రాడు (ETV Bharat)

Yuva on bhaje vaayu vegam Movie Director Prashanth Reddy : సినిమా ప్రేక్షకులకు వినోద సాధనమైతే అదే సినిమా ఎంతో మంది జీవితాలకు భవిష్యత్తు. అలాంటి జీవితాన్నే కోరుకున్నాడు మెదక్​కు చెందిన ప్రశాంత్ రెడ్డి. సినీ పరిశ్రమలో రాణించాలనే పట్టుదలతో 12 ఏళ్లు అహర్నిశలు శ్రమించి, దర్శకుడు అవ్వాలన్న తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​లో అవకాశం సంపాదించుకొని యువ కథానాయకుడు కార్తికేయతో భజే వాయు వేగం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో ప్రశాంత్ రెడ్డి 12 ఏళ్ల కష్టం ఫలించింది. మెదక్ కుర్రాడి ప్రతిభ ఫిల్మ్ నగర్​లో మారుమోగింది.

హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలోనే ఉండటంతో ప్రశాంత్​ను తల్లిదండ్రులు హాస్టల్​లో చేర్పించి చదివిచారు. చదువుకుంటూనే స్నేహితులతో కలిసి సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నాడు. అలా మొదలైన సినిమా అభిరుచి ఫిల్మ్ నగర్​లో అడుగుపెట్టాలన్న తపనను రేకెత్తించింది. అయితే తన ఊరివాళ్లు కానీ, తనకు తెలిసిన వాళ్లు కానీ సినీ పరిశ్రమలో ఎవరు లేరు. అయినా సరే ప్రశాంత్ తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. కెమెరాతో చిన్న చిన్న వీడియోలు తీస్తూ వాటిని తనే స్వయంగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ముసిరిపోయేవాడు. అప్పుడు ప్రశాంత్​కు అర్కుట్​లో యువ దర్శకుడు సుజీత్ పరిచయం అయ్యాడు.

యూవీ క్రియేషన్స్​లో అవకాశం : ఆ పరిచయంతో సుజీత్​తో కలిసి యూవీ క్రియేషన్స్​లో అవకాశాన్ని అందుకున్నాడు. సుజీత్ దర్శకత్వం వహించిన రన్ రాజా రన్, సాహో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం కంటే ముందే ప్రశాంత్ రెడ్డి తనను తాను తీర్చిదిద్దికున్నాడు. నేపథ్య సంగీతం, ఎడిటింగ్ మీద పట్టు సంపాదించుకొని తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ప్రశాంత్ రెడ్డి పనితీరును మెచ్చిన యూవీ నిర్మాతలతోపాటు దర్శకుడు సుజీత్, రెబల్ స్టార్ ప్రభాస్, శర్వానంద్ లాంటి అగ్ర హీరోల ప్రశంసలందుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు తన మనసులోని మాటను సుజీత్​తో పంచుకున్నాడు.

మంచి కథ తయారు చేశానని, దర్శకుడిగా అవకాశం కోసం ప్రయత్నిస్తానని వివరించాడు. ప్రశాంత్ రాసిన కథ విన్న యూవీ నిర్మాతలు, ఒక్క సిట్టింగ్​లోనే ఒకే చేశారు. దేవుడు కరుణించినా పూజారి అడ్డుపడ్డొట్లు, కొవిడ్ రూపంలో ప్రశాంత్ సినీ ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి. కోవిడ్ కష్టకాలాన్ని ఎదుర్కొంటూనే కథానాయకుడు కార్తీకేయకు తన కథ వినిపించాడు. కార్తికేయ కూడా ప్రశాంత్ కథను మెచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కట్ చేస్తే ప్రశాంత్ రెడ్డి 12 ఏళ్ల కల నెరవేరింది. సినీ పరిశ్రమలో ఎవరూ చేయని విధంగా అనుకున్న సమయానికంటే మూడు వారాల ముందే ఫస్ట్ కాపీ సిద్ధం చేశాడు. తన బృందంలో చిత్ర విజయం పట్ల ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.

ప్రేక్షకులను మెప్పించడమే పెద్ద సవాల్ : చిత్ర పరిశ్రమలో అవకాశాల కంటే ప్రేక్షకులను మెప్పించడమే దర్శకుడికి పెద్ద సవాల్ అంటోన్న ప్రశాంత్ రెడ్డి, ఇన్​స్టా రీల్స్ కాలంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రేక్షకుల వద్ద తలదించుకోవాల్సిందేనంటున్నాడు. ఒక మంచి ఆలోచన వర్కవుట్ చేస్తే సినీ పరిశ్రమ వెతికి మరీ అక్కున చేర్చుకుంటుందని చెబుతున్నాడు. మారుతున్న సినిమా ఫార్మెట్​కు అనుగుణంగా ఔత్సాహిక దర్శకులు, రచయితలు తమ పంథాను మార్చుకోవాలని ప్రశాంత్ రెడ్డి సూచిస్తున్నాడు. తనలాంటి కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకు నాని, కార్తీకేయలాంటి కథానాయకులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని చెబుతోన్న ప్రశాంత్, తనదైన కథలను చెప్పేందుకు సిద్ధమయ్యాడు.

ప్రేక్షకుల సమయానికి మర్యాద ఇవ్వడమే తనకు దక్కే గౌరవం అంటోన్న ప్రశాంత్, అగ్ర దర్శకుడు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవిల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాడు. మెతుకు సీమ నుంచి పుట్టిన తొలి దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మంచి కథలతో సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాడు ఈ యువ దర్శకుడు.

'నాకు సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఎవరూ తెలియదు. హైదరాబాద్​కు వచ్చి ఎడిటింగ్​ నేర్చుకున్నాను. ప్రముఖ దర్శకుడు సుజీత్‌తో పరిచయం అయ్యాక సినీ ఇండస్ట్రీకి వచ్చా. ఆయన దగ్గర అసిస్టెంట్​ డైరెక్టర్​గా చేశా. దర్శకుడు సుజీత్‌తో కలిసి నేను షార్ట్​ ఫిల్మ్​లు చేశా. మొదటి నుంచి నేను యూవీ క్రియోషన్స్​తోనే ఉన్నా'-ప్రశాంత్ రెడ్డి, సినీ దర్శకుడు

YUVA : పేదింటి పెన్సిల్​ ఆర్టిస్టు - డ్రాయింగ్‌తో చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువకుడు - pencil artist ganesh

YUVA : కూచిపూడిలో అద్భుత ప్రదర్శనలిస్తున్న అభిజ్ఞ - చిరు ప్రాయంలోనే రెండు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సొంతం - Nizamabad Classical Dancer Abhigna

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.