ETV Bharat / state

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు - బెయిల్‌ కోసం హైకోర్టుకు వైఎస్సార్సీపీ నేతల క్యూ - YSRCP Leaders bail petition

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 12:58 PM IST

Updated : Jul 11, 2024, 2:30 PM IST

YSRCP Leaders Filed Petition In High Court For Bail : ఏపీలోని మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్టు భయంతో ఏపీ హైకోర్టుకు వైఎస్సార్సీపీ నేతలు క్యూ కడుతున్నారు. కీలక నేతల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బెయిల్​ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

YSRCP Leaders Filed Petition In High Court For Bail
YSRCP Leaders Filed Petition In High Court For Bail (ETV Bharat)

YSRCP Leaders Filed Petition In AP HC for Bail : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన కేసులో వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు అరెస్టు భయంతో ముందుస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు క్యూ కడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది.

Hearing Of Suits In AP High Court : మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్ దాఖలు చేసిన వ్యాజ్యాలు హైకోర్టులో బుధవారం (జులై 10న) విచారణకు వచ్చాయి. విచారణను గురువారానికి వాయిదా వేయాలని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

ఈ కేసులో మరో ఇద్దరు తాజాగా పిటిషన్లు వేశారని, ప్రస్తుత వ్యాజ్యాలను వాటితో కలిపి విచారణ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ కూడా నేటికి వాయిదా పడింది.

వల్లభనేని వంశీ అనుచరులకు 14 రోజుల రిమాండ్​ : కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల దాడి కేసులో పోలీసులు రిమాండ్‌ రికార్డు తప్పుల తడకగా ఉంది. ఈ కేసులో పరారీలో ఉన్న 71 మంది నిందితుల్లో 15 మందిని మంగళవారం (జులై 9న) అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన మూల్పూరి ప్రభుకాంత్, ఎర్రగుళ్ల నాగేష్‌ సహా 15 మందిని రిమాండ్‌ నిమిత్తం గన్నవరం 12వ అదనపు న్యాయస్థానంలో బుధవారం ప్రవేశపెట్టారు.

రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి ఎఫ్‌ఐఆర్‌లో ఒక పేరు, మరోచోట ఇంకో పేరును సగం పేరును నమోదు చేశారు. ఊరి పేర్లు తప్పులు ఉన్నట్లు న్యాయమూర్తి గుర్తించారు. నివేదికలోని తప్పులు సవరించిన తర్వాతే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు సూచించారు. దీంతో బుధవారం రాత్రి 10 గంటలకు తప్పులు సరిచేసిన అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజులు పాటు రిమాండ్‌ విధించారు.

మద్యం, రింగ్‌రోడ్డు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్​పై విచారణ వాయిదా

Last Updated : Jul 11, 2024, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.