ETV Bharat / state

జగన్​ హయాంలో గాలికి క్రీడాభివృద్ధి - కూటమి ప్రభుత్వంపైనే ఆశలు - YSRCP NEGLECTED SPORTS DEVELOPMENT

గత ఐదేళ్లూ క్రీడాభివృద్ధిని గాలికి వదిలేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం - ఏలూరులో క్రీడా మైదానాలను ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించిన పరిస్థితి

ysrcp_neglected_sports_development
ysrcp_neglected_sports_development (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2024, 5:11 PM IST

YSRCP Govt Neglected Sports Development : వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లూ క్రీడాభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of Andhra Pradesh) ఆధ్వర్యంలోని క్రీడా మైదానాలను ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించింది. నిత్యం సాధన కోసం మైదానాలకు వచ్చే క్రీడాకారులకు నిరుత్సాహమే మిగులుతోంది.

ఏలూరు జిల్లాలో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని క్రీడా మైదానాలు కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. కొత్త మైదానాలు ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటి నిర్వహణకు వైఎస్సార్సీపీ పాలకులు పూర్తిగా నీళ్లొదిలేశారు. రన్నింగ్, వాకింగ్ ట్రాకుల మొదలు మరుగుదొడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు సదుపాయాలు సవ్యంగా లేకుండా చేశారు. ఇండోర్ స్టేడియం, ఏఎస్​ఐర్​ స్టేడియం (Alluri Seetarama Raju Stadium), ఈతకొలను ఉండగా 3 చోట్ల ఉన్న వ్యాయామశాలల్లోని పరికరాలు పూర్తిగా పాడయ్యాయి.

15 ఏళ్ల క్రితం వచ్చినవి కావడం, మరమ్మతులకు గత జగన్ ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాయామశాల పరికరాలు చాలావరకు మరమ్మతులకు గురికాగా అవి క్రీడాకారులకు సమస్యగా మారింది. భవనం కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయి కనిపిస్తున్నాయి. ఉన్న వాటితోనే క్రీడాకారులు నెట్టుకొస్తున్నారు.

విశాఖ ప్రజలకు గుడ్​న్యూస్ - మెట్రో ప్రాజెక్టు మొదటి దశ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం

ఎక్కడ చూసినా చెత్తా చెదారాలు, ముళ్లపొదలు: ఇండోర్, ఏఎస్​ఆర్​ మైదానాలకు వాకర్స్​తో పాటు క్రీడాకారులు కలిపి నిత్యం వెయ్యి మంది వస్తుండగా ట్రాక్‌ల నిర్వహణ అధ్వానంగా ఉంటోంది. ట్రాక్ ఎగుడుదిగుడుగా మారింది. వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేక స్టేడియం మొత్తం బురదమయంగా మారుతోంది. మైదానాల నిర్వహణకు సిబ్బంది లేకపోవడంతో గ్రౌండ్​లో ఎక్కడ చూసినా చెత్తా చెదారాలు, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు దర్శనమిస్తున్నాయి.

ఏలూరు ఇండోర్ స్టేడియంలోని క్రీడాభవనం రెండేళ్ల క్రితం కూలిపోయింది. ఇందులో వ్యాయామశాల, ఇండోర్ షటిల్ కోర్టులు, ఇతర క్రీడలు నిర్వహిస్తుండగా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యాయామశాల, క్రీడా పరికరాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో క్రీడాభివృద్ధికి ఎగనామం పెట్టి శాప్ మైదానాలను గాలికి వదిలేశారని కూటమి ప్రభుత్వమైనా వాటిని చక్కదిద్దాలని క్రీడాకారులు, నగర వాసులు కోరుతున్నారు.

వ్యవసాయమే ఎందుకంటే - సీఎంకు విద్యార్థిని అదిరిపోయే ఆన్సర్​

"అమరావతి రాజధాని"లో ఆ డిజైన్​కే ఎక్కువ మంది ఓటు - ఫిక్స్ చేసిన CRDA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.