ETV Bharat / state

జగన్​పై రాయి దాడి కేసు - రివాల్వర్‌తో భయపెట్టారు! - కంటతడి పెట్టిన నిందితుడు సతీశ్​ - YS JAGAN STONE PELTING CASE - YS JAGAN STONE PELTING CASE

YS JAGAN STONE PELTING CASE : జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ముందు వేముల సతీష్ కంటతడి పెట్టాడు. రాయి దాడి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, కేసు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్‌తో భయపెట్టారని వాపోయాడు.

Stone Attack on CM Jagan
YS JAGAN STONE PELTING CASE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 9:49 PM IST

Stone Attack on CM Jagan : ముఖ్యమంత్రి జగన్​పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్​కు కోర్టు షరతులతో కూడిన బైయిల్ మంజూరు చెయ్యడంతో జైలు నుంచి విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే విడుదల కావాల్సిన సతీష్, కొన్ని కారణాలతో ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. తండ్రి దుర్గారావు, తల్లి రమణ, డిఫెన్స్ లాయర్ అబ్దుల్ సలీంలు నెల్లూరుకు వచ్చే సతీష్​ను విజయవాడ తీసుకెళ్లారు.

చంద్రబాబుకు ఘన స్వాగతం - శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో తమ్ముళ్ల సందడి - Chandrababu Return From Foreign

ఏప్రిల్ 13న సీఎం జగన్​పై గులకరాయ దాడి జరిగింది. ఈ దాడి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సతీషే దాడి చేసినట్లు ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. బెయిల్​పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులే కేసు ఒప్పుకోవాలని రివాల్వర్​తో తనను భయపెట్టారని సతీష్ ఆరోపించారు. తన పుట్టినరోజు కావడంతో వేడుకలు చేసుకున్నందునే తనను అనుమానితులుగా అరెస్ట్ చేశారని చెప్పారు. చీకటి ప్రాంతంల్లో తిప్పుతూ తనకు రెండు లక్షలు ఇస్తామని గన్ పెట్టి పోలీసులు బెదిరించినా తాను కేసు ఒప్పుకోలేదన్నారు. సతీషే దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ లాయర్ అబ్దుల్ సలీం వెల్లడించారు.

కాగా ముఖ్యమంత్రి జగన్‌పై రాయి విసిరిన కేసులో నిందితుడిని ఏప్రిల్ 18వ తేదీన అరెస్టు చేసినట్లు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్‌ని నిందితుడిగా తేల్చారు. అయితే ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు ఏ2 ప్రోద్బలంతో జగన్​పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది మాత్రం తేల్చకుండానే కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. నిందితుడికి మే 2వ తేదీ వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు : ముఖ్యమంత్రి జగన్​పై రాయి దాడి కేసులో వడ్డెరకాలనీకి చెందిన అయిదుగురిని ఏప్రిల్ 16వ తేదీన తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సతీష్‌ తప్ప మిగిలిన నలుగురు మైనర్లు. మూడు రోజుల విచారణ అనంతరం సతీష్‌ అరెస్టును ఏప్రిల్ 18వ తేదీన చూపించారు. అరకొర సమాచారంతోనే రిపోర్టును తయారు చేశారు. సీఎంపైకి సతీష్‌ రాయి విసిరినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనకు ఏ2 సూత్రధారి అని చెబుతున్న పోలీసులు ఆ వ్యక్తి పేరును మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.

సీఎం ప్రయాణించిన బస్సుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌టవర్‌ డంప్‌ విశ్లేషణ, సీడీఆర్‌ల ద్వారా వేముల సతీష్‌ను నిందితుడిగా తేల్చామని పోలీసులు పేర్కొన్నారు. రిమాండ్‌ రిపోర్టులో పలువురు సాక్షులను విచారించాలని, సాంకేతిక ఆధారాలను సేకరించాలని తెలిపారు. సతీష్‌ను విచారించినా ఆధారాలను పూర్తి స్థాయిలో సంపాదించలేదు. అనంతరం బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితుడు వేముల సతీష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా మే 28వ తేదీన విజయవాడ కోర్టు సతీశ్‌కు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. నేడు విడుదలయ్యాడు.

రాష్ట్రాలు రెండుగా మారినా - తెలుగు ప్రజలంతా ఒక్కటే : చంద్రబాబు - Chandrababu tweet

తెలంగాణలో తెలుగుదేశం - పూర్వవైభవంపై చంద్రబాబు దృష్టి! - Chandrababu Steps to Rebuild TDP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.